breaking news
jatin das
-
మీటూ : తండ్రి మీద ఆరోపణలు.. బాధితులకే మద్దతంటున్న నటి
నా తండ్రిపై ఆరోషణలు వచ్చినప్పటికి కూడా నేను మీటూ ఉద్యమానికే మద్దతిస్తాను అంటున్నారు ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్. మీటూ ఉద్యమం విస్తరిస్తోన్న నేపథ్యంలో నందితా దాస్ తండ్రి జతిన్ దాస్ మీద లైంగిక ఆరోపణలు వచ్చాయి. పేపర్ తయారు చేసే ఓ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు జతిన్ దాస్‌పై లైంగిక వేధిపుల ఆరోపణలు చేశారు. 14 ఏళ్ల క్రితం జతిన్ దాస్ తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆయన చేష్టలు చాలా ‘వల్గర్’గా ఉన్నాయంటూ సదరు మహిళ ఆరోపించారు. ఈ ఆరోపణలపై జతిన్ దాస్ కుమార్తె నందితా దాస్ స్పందించారు. ‘నా తండ్రి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అయినా ఇప్పటికి కూడా నేను మీటూకే మద్దతిస్తున్నాను. వేధింపులు ఎదుర్కొన్న బాధితులందరికి తోడుగా ఉంటాను. ఇక నా తండ్రి మీద వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. వాస్తవాలను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఆరోపణలు చేస్తున్న మహిళలు తమ మాటల పట్ల ఖచ్చితంగా ఉండాలి. తప్పుడు ఆరోపణలు చేస్తే ఈ ఉద్యమం దెబ్బతినే ప్రమాదం ఉంది’ అన్నారు. -
పుస్తకశిల్పి..!
జాతీయం పద్మభూషణ్ అవార్డు గ్రహీత జతిన్‌దాస్ భారతీయ పెయింటర్, శిల్పి. ఒరిస్సాలోని మయూర్భంజ్ ఆయన జన్మస్థానం. జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, బాంబేలో చదివాడు. అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌లో పాల్గొన్నాడు. పారిస్, వెనిస్లలో ప్రదర్శనలిచ్చారు. తను వేసిన చిత్రపటాలను, శిల్పాలను అనేక సంస్థలకు బహుమతిగా ఇచ్చారు. బాలీవుడ్ నటి నందితాదాస్, డిజైన ర్ సిద్ధార్థ దాస్ ఈయన సంతానం. భార్య, కుమారులతో ఢిల్లీలోని లీఫీ ఆసియాడ్ విలేజ్‌లో ఉంటున్న జతిన్‌దాస్ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆయన వేసిన కళాకృతులు కనిపిస్తాయనుకుంటే పొరపాటే. అన్ని గదులూ పుస్తకాల మయం. ‘‘పుస్తకాలు నా ప్రాణం. నేను వేసిన చిత్రాలలో నా స్టూడియో కోసం కొన్నింటిని మాత్రం ఉంచుతాను. వాటిని అందరికీ చూపించాలనే ఆసక్తి నాకు లేదు’ అంటారు కుడ్య చిత్రాల ప్రముఖుడు, గ్రాఫిక్ ఆర్టిస్ట్, కవి అయిన దాస్. దాస్ ఇంట్లోకి ప్రవేశిస్తే... ముగ్గురు కూర్చోవడానికి అనువుగా ఉండే పురాతన కాలం నాటి సోఫా, చిన్న టేబుల్, పుస్తకాలతో నిండిన అల్మరా, కేన్ టేబుల్ స్వాగతం పలుకుతాయి. వంటిల్లు, డ్రాయింగ్రూమ్లోకి వెళ్లడానికి అనువుగా అయిదారు మెట్లు, గదికి రెండువైపులా పుస్తకాల షెల్ఫ్‌లు, మెట్లకు కుడిపక్కగా మూడు బెడ్రూమ్లలోకి దారులు. ఆ ఇంటి గురించి ‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎందరో ఇక్కడ ఆనందంగా గడిపారు’’ అంటారు దాస్. ఆ గదిలోనే భూటాన్ నుంచి తెచ్చిన బుద్ధ ప్రతిమ, రాగితో తయారైన పూజాసామాగ్రి ఉంటాయి. దాస్ ప్రకృతి ప్రేమికుడు. ‘‘సూర్యోదయాన్నే గార్డెన్లో కూర్చుని పేపర్ చదువుతూ, వేడివేడిగా టీ తాగుతూ, దినచర్య ప్రారంభించడమంటే నాకు ఎంతో ఇష్టం’’ అంటూ సంబరంగా చెబుతున్న దాస్ అదర్‌సైడ్ ఇది!