పాప్‌స్టార్ జాక్సన్ ఇంట్లో పోర్న్ కలెక్షన్
లాస్ ఏంజిలెస్: ప్రపంచ ప్రఖ్యాత పాప్‌స్టార్, దివంగత మైఖేల్ జాక్సన్‌కు సంబంధించి విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. చిన్నపిల్లలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొన్న జాక్సన్‌కు బూతు పుస్తకాలు, బాలురు, మహిళలు, పురుషుల నగ్న చిత్రాలు, పోర్న్ వీడియోలంటే మక్కువని, వీటిని సేకరించి తన ఇంట్లో భద్రపరిచాడని పోలీసుల నివేదికలో వెలుగు చేసింది. కాలిఫోర్నియాలోని జాక్సన్ విలాసవంతమైన నివాసం నెవెర్లాండ్ రాంచ్లో 13 ఏళ్ల క్రితం పోలీసులు వీటిని గుర్తించారు. జాక్సన్ ఓ బాలుడిని లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చిన కేసులో పోలీసులు 2003లో ఆయన ఇంటిని సోదా చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల నివేదిక విడుదలైంది.
జాక్సన్ బెడ్రూమ్, బాత్రూమ్లో 7 పోర్న్ కలెక్షన్లను గుర్తించినట్టు పోలీసులు విచారణ నివేదికలో పేర్కొన్నారు. టీనేజ్ అబ్బాయిలు, యువకుల నగ్న ఫొటోలు, స్వలింగ సంపర్క దృశ్యాల ఫొటోలు జాక్సన్ ఇంట్లో లభించినట్టు తెలిపారు. జాక్సన్‌కు విశృంఖల, స్వలింగ శృంగార చర్యలపై ఆసక్తి ఉన్నట్టుగా ఈ చిత్రాల ద్వారా అర్థమవుతుందని ఈ నివేదిక వెల్లడించింది. కాగా లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి 2005లో జాక్సన్‌కు కోర్టులో విముక్తి లభించింది.