breaking news
intimate photos
-
మీడియాకు జాక్వెలిన్ అభ్యర్థన.. మీ ప్రియమైన వారికి ఇలా చేయరుగా
Jacqueline Fernandez Request To Media Not Circulate Her Private Photos: శ్రీలంక బ్యూటీ, బీటౌన్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు బాలీవుడ్ హీరోయిన్స్‌తోపాటు జాక్వెలిన్‌కు సుకేష్ ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో ఈడీ ఆమెను విచారించింది. అప్పటినుంచి ఫిల్మ్ దునియాలో తరచుగా, వార్తల్లో అప్పుడప్పుడూ జాక్వెలిన్ పేరు వింటూనే ఉన్నాం. తాజాగా జాక్వెలిన్ మీడియాకు విన్నవించుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సుకేష్ చంద్రశేఖర్‌తో లీక్ అయిన తన ఫొటోను ప్రసారం చేయొద్దని మీడియాను అభ్యర్థించింది. తన గోపత్యకు భంగం కలిగిస్తోందని పేర్కొంది జాక్వెలిన్. 'ఈ దేశం, ఈ ప్రజలు నాకు విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం నేను కఠినమైన పరిస్థితిలో ఉన్నాను. అది నా స్నేహితులు, అభిమానులు గమనిస్తూనే ఉన్నారని తెలుసు. ఈ నమ్మకంతోనే నా వ్యక్తిగత చిత్రాలను ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నాను. నేను ఇప్పటికే చాలా నేర్చుకున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తున్నాను. మీరు మీ ప్రియమైన వారికి ఇలా చేయరు కదా. అలాగే నాకు కూడా ఇలా చేయరని నమ్ముతున్నా. న్యాయం, మంచి గెలుస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.' అని పోస్ట్‌లో రాసుకొచ్చింది జాక్వెలిన్. View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) ఇదీ చదవండి: జాక్వెలిన్‌ను సుకేష్ ఇలా ముగ్గులోకి దింపాడట.. -
ఫేస్బుక్లో ఫొటోలు పెట్టాడని.. బాలిక ఆత్మహత్య
సోషల్ మీడియా.. మరో చావుకు కారణమైంది. ప్రేయసి తనకు దూరమైందన్న ఉక్రోషంతో ఓ యువకుడు గతంలో తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దాంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా బిష్ణుపూర్‌లో జరిగింది. ఫేస్బుక్లో వీళ్ల ఫొటోలు విపరీతంగా సర్క్యులేట్ కావడంతో పాటు వాటికి కామెంట్లు కూడా పిచ్చిపిచ్చిగా వస్తుండటంతో ఆమె తట్టుకోలేకపోయింది. 20 ఏళ్ల యువకుడికి, 12వ తరగతి చదివే బాలికు మధ్య మూడేళ్ల పాటు ప్రేమాయణం నడిచింది. అయితే, ఏడాది క్రితం కుటుంబ సమస్యల కారణంగా వాళ్లిద్దరూ విడిపోయారు. దీనిపై మౌనంగా ఉండకపోతే ఆ ఫొటోలను ఫేస్బుక్లో పెడతానంటూ యువకుడు చాలాసార్లు బెదిరించాడు. చిరవకు తాను అన్నంత పనీ చేశాడు. ఆ బాధను తట్టుకోలేని బాలిక.. ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని బాలిక తల్లిని సైతం అతడు బెదిరించాడు. దాంతో అతడి గురించి బాలిక తల్లి పోలీసులకు ముందే ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు స్పందించి చర్యలు తీసుకునేలోపే బాలిక ప్రాణాలు తీసుకుంది.