breaking news
instagram picture
-
మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్
మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్, అతని మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తమ మొదటి మనవడి ఫోటోలను తమ వేరువేరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా షేర్ చేశారు. జెన్నిఫర్ ఆమె భర్త నేయెల్ నాసర్ 2023 మార్చి 5న ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తమ మొదటి బిడ్డను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. జెన్నిఫర్ & నేయెల్ నాసర్ చిన్న పాదాలు ఉన్న ఫోటో షేర్ చేస్తూ మా చిన్న హెల్తీ ఫ్యామిలీ ప్రేమను పంచుతోంది, అంటూ రాసుకొచ్చారు. ఇక బిల్ గేట్స్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన మనవడిని చేతుల్లో పట్టుకుని 'ప్రపంచాన్ని కనుగొనడం కోసం నేను వేచి ఉండలేను' అంటూ క్యాప్సన్ ఇచ్చారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) అదే సమయంలో మెలిండా గేట్స్ మనవడిని చేతుల్లో పట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. నాకు మొదటి మనవడిని పట్టుకోవడంలా అనిపించడం లేదు, నేను జెన్ని పట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు జెన్, నాయెల్ తల్లిదండ్రులుగా కొత్త పాత్రలో అడుగు పెట్టడం చూసి గర్వపడుతున్నానంటూ రాసింది. వీరి పోస్టులు చూసిన వారిలో చాలామంది వారికి అభినందనలు తెలిపారు. ఇందులో నోబెల్ శాంతి బహుమతి పొందిన మలాలా యూసఫ్‌జాయ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మొదలైన వారు ఉన్నారు. View this post on Instagram A post shared by Melinda French Gates (@melindafrenchgates) -
పాత గర్ల్‌ఫ్రెండ్ చెంతకు జస్టిన్ బీబర్
ఎప్పటికప్పుడు కలుస్తుండటం, మళ్లీ విడిపోవడం, మళ్లీ కలవడం ఆ జంటకు మామూలే. అలాగే ఇప్పుడు మళ్లీ కలిశారు. తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఓ ఫొటోను జస్టిన్ బీబర్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో బీబర్ భుజాలను ముద్దాడుతున్నట్లుగా సెలెనా కనిపిస్తుంది. ఈ వారం మొదట్లోనే గోమెజ్ వాస్తవానికి జస్టిన్ బీబర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసింది. ప్యారిస్ నగరంలో కెండల్ జెన్నర్ అనే మోడల్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లినప్పుడు అతడు కనపడటంతో ఆమె మండిపడింది. అయితే, ఇంతలో ఏమైందో గానీ బీబర్ మాత్రం ఉన్నట్టుండి ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. గతవారం వీళ్లిద్దరూ కరేబియన్ దీవులకు ఒక రొమాంటిక్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ ఫొటో తీసుకుని ఉంటారని అంతా భావిస్తున్నారు. ఈ ఫొటోలో బీబర్ నల్లటి వెస్ట్ వేసుకుని, డిజైనర్ సన్‌గ్లాసులు పెట్టుకుని కనిపిస్తాడు. గోమెజ్ అతడి భుజాల మీద సుతారంగా ముద్దుపెట్టుకుంటున్నట్లు కనపడింది. ఇంతకుముందు కూడా వీళ్లిద్దరూ ఇవే దుస్తులతో ఒక ఫొటో దిగినా, ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లోంచి బీబర్ తొలగించాడు.