breaking news
INR USD
-
రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి రేపటితో 79 ఏళ్లు పూర్తవుతాయి. బ్రిటిష్ రాచరిక పాలన అంతమైన 1947 సమయంలో ఇండియన్ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.3.30గా ఉండేది. క్రమంగా అది మారుతూ ప్రస్తుతం రూ.87.65కు చేరింది. ఇలా డాలర్ పెరిగి రూపాయి విలువ తగ్గేందుకు చాలా కారణాలున్నాయి. స్వాతంత్ర్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు డాలర్-రూపాయి పరిణామం ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.రూపాయి విలువను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..వాణిజ్యం: భారత్ విదేశాల నుంచి చేసుకునే దిగుమతులు, ఇతర ప్రాంతాలకు చేసే ఎగుమతుల సమతుల్యత వల్ల రూపాయి ప్రభావం చెందుతుంది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేస్తే రూపాయి విలువ పడిపోతుంది. విదేశీ కరెన్సీలకు డిమాండ్ పెరుగుతుంది.ద్రవ్యోల్బణం: దేశంలోని అధిక ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల కొనుగోలుకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ తగ్గిపోతుంది.వడ్డీ రేట్లు: అధిక వడ్డీ రేట్లు విదేశీ మూలధనాన్ని ఆకర్షిస్తాయి. రూపాయి విలువను పెంచుతాయి.విదేశీ మారక నిల్వలు: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే ఫారెన్ కరెన్సీ వల్ల రూపాయి స్థిరంగా ఉంటుంది. విదేశీ కరెన్సీ రాకపెరిగితే రూపాయి విలువ పెరుగుతుంది.రాజకీయ, ఆర్థిక పరిస్థితులు: ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందాలంటే రాజకీయ అనిశ్చితులు ఉండకూడదు. స్పష్టమైన రాజకీయ నాయకత్వ పరిస్థితులు లేకపోయినా రూపాయి పతనమయ్యే అవకాశం ఉంటుంది.చమురు ధరలు: భారత్ గణనీయంగా చమురును దిగుమతి చేసుకుంటోంది. అందుకోసం డాలర్లు చెల్లించాల్సిందే. భారత్ వద్ద ఉన్న ఫారెన్స్ కరెన్సీ రిజర్వులు అందులో ఉపయోగపడుతాయి. అయితే చమురు ధరలు పెరగితే చెల్లింపులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. దాంతో డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది.కొన్ని నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ.3.30గా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విలువ క్రమంగా పడిపోయింది. 1947 నుంచి 2025 వరకు ఇండియన్ రూపాయి పరిణామక్రమం కింది విధంగా ఉంది. -
ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువ
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న యుద్ధ భయాల కారణంగా రూపాయి తీవ్ర ఒత్తిడికి గురైంది. రెండేళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం ఒక్కరోజులోనే 89 పైసలు క్షీణించి 85.72 వద్ద ముగిసింది. 2023 ఫిబ్రవరి 6 తర్వాత రూపాయి విలువ 1 శాతానికి పైగా క్షీణించడం ఇదే తొలిసారి. బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.83 వద్ద ముగిసింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది. తిరిగి నిన్న సరిహద్దులో పాక్ భారత సైన్యాల స్థావరాలను కూల్చేందుకు ప్రయత్నించింది.రూపాయి ఒత్తిడికి కారణాలు..పాకిస్థాన్‌లో భారత్ సైనిక దాడుల తర్వాత యుద్ధ భయాలు పెరిగాయని విశ్లేషకులు తెలిపారు. డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి పలు భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నించడంతో కరెన్సీ మార్కెట్ ఒత్తిడికి గురైంది. ఈ చర్యను భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి. భౌగోళిక రాజకీయ ఒత్తిడితో పాటు, బలమైన అమెరికా డాలర్, ముడి చమురు ధరలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్ట్రంప్ విధానాల చుట్టూ ఉన్న అనిశ్చితులు కూడా ఈ ఏడాది ఫారెక్స్ మార్కెట్లో అస్థిరతను పెంచాయని కొందరు నిపుణులు తెలిపారు. దీనికి తోడు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం కూడా ఇటీవలి రోజుల్లో డాలర్ బలహీనపడటానికి దోహదపడింది. అమెరికా డాలర్ బలపడటం, భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల కారణంగా రూపాయి కొంతకాలంపాటు ఒత్తిడిలో ఉండే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, భారత్-పాక్ మధ్య అనిశ్చితులు కొనసాగుతున్నా భారత స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు కొనుగోళ్లతో మద్దతు ఇవ్వడం కలిసొచ్చే అంశం. -
రూపాయి 8 నెలల కనిష్టం
ముంబై: డాలరుతో మారకంలో వరుసగా ఐదో రోజు నష్టపోయిన రూపాయి ఎనిమిదిన్నర నెలల కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 22 పైసలు బలహీనపడి 61.96 వద్ద ముగిసింది. దేశీ స్టాక్ మార్కెట్లు నష్టపోవడం, దిగుమతిదారుల నుంచి డాలరుకి డిమాండ్ పుంజుకోవడం వంటి అంశాలు రూపాయిని దెబ్బకొట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. విదే శీ పెట్టుబడులు మందగించడం కూడా ఇందుకు జతకలిసినట్లు తెలిపారు. వెరసి ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్రితం ముగింపు 61.70తో పోలిస్తే 61.80 వద్ద బలహీనంగా మొదలైంది. ఆపై ఒక దశలో 61.78 వరకూ బలపడింది. చివరికి 0.4% నష్టంతో 61.96 వద్ద ముగిసింది. 2014 మార్చి 3 తరువాత రూపాయికి ఇదే కనిష్టస్థాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడింగ్‌లో డాలరు స్థిరంగా ట్రేడవుతోంది. అక్టోబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టిన పాలసీ సమీక్ష వివరాలు వెల్లడికానున్న నేపథ్యంలో డాలరు బలాన్ని పుంజుకోవడం గమనించదగ్గ అంశమని నిపుణులు వ్యాఖ్యానించారు.