infant baby selling
-
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు..
సాక్షి, హైదరాబాద్: దేశంలో పలు రాష్ట్రాలకు సంబంధించి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటి వరకు 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడ శిశువును నాలుగు లక్షలకు, మగ శిశువులను ఆరు లక్షలకు అమ్మినట్టు దర్యాప్తులో వెల్లడైంది.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ముంబై, యూపీలోని పలు ఏరియాలను టార్గెట్ చేసి ట్రాఫికింగ్ ముఠా.. చిన్న పిల్లలకు విక్రయిస్తోంది. పశ్చిమ బెంగాల్, చెన్నై, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో పిల్లలు లేని తల్లిదండ్రులకు వీరిని విక్రయిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 27 మందిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.అయితే, చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఆసుపత్రుల్లోనే పనిచేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా కార్తీక్ ఉండగా.. అజంపుర UPHCలో ఆశ వర్కర్‌గా అమూల్య పనిచేస్తోంది. మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో ఇస్మాయిల్ సూపర్వైజర్గా ఉన్నారు. ఇక, ఈ కేసులో దళారులతో పాటు పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వేల కిలోమీటర్లు బస్సుల్లో చిన్నారులను దళారులు తీసుకువస్తున్నారు.కాగా, 25 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. ఇప్పటికే 14 మంది చిన్నారులను రెస్క్యూ చేసినట్టు తెలిపారు. మరో 11 మంది చిన్నారుల కోసం రాచకొండ పోలీసులు గాలిస్తున్నారు. ఈక్రమంలో ఆడ శిశువును మూడు లక్షలకు విక్రయించి నాలుగు లక్షలకు అమ్మకం.. మగ శిశువును నాలుగు లక్షలకు విక్రయించి ఆరు లక్షలకు అమ్మకం జరుపుతున్నట్టు గుర్తించారు. -
కుటుంబం కోసం.. 4నెలల బిడ్డను
డిస్పూర్: కరోనా వైరస్‌ని నియంత్రించడం కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. పని లేదు.. చేతిలో పైసా లేదు.. దాంతో ఎంతో మంది జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. వందల మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కడుపు నింపుకోవడం కోసం వారు చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో తినడానికి తిండిలేక బాధపడుతున్న ఓ వలస కూలీ తన నాలుగు నెలల కుమార్తెను 45,000 రూపాయలకు విక్రయించాడు. ఈ సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కొక్రాజార్ జిల్లాలోని అటవీ గ్రామమైన ధంటోలా మాండరియాలో నివసించే దీపక్ బ్రహ్మ గుజరాత్లో కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవాడు. లాక్డౌన్ విధించడంతో ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో పనిలేక తీవ్ర పేదరికంలో ఉండగా దీపక్ భార్య రెండో సంతానంగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటికే వారికి ఏడాది వయసున్న ఓ కుమార్తె ఉంది. (‘నా కొడుకును చిత్ర హింసలు పెట్టారు’) మళ్లీ ఆడపిల్ల జన్మించడం.. చేతిలో పైసా లేకపోవడంతో నాలుగు నెలల పసికందును.. 45,000 రూపాయలకు విక్రయించాడు. అది కూడా భార్యకు తెలియకుండా. ఈ క్రమంలో బిడ్డ గురించి భార్య, దీపక్‌ను ప్రశ్నించగా.. విక్రయించానని తెలిపాడు. దాంతో వెంటనే గ్రామస్తుల సాయంతో భార్య కొచ్చుగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి బిడ్డను కొన్న మహిళల నుంచి శిశువును రక్షించి తల్లి ఒడికి చేర్చారు. ఆ తరువాత బ్రహ్మను అరెస్టు చేశారు. తమకు సంతానం లేకపోవడంతోనే శిశువును కొన్నామని విచారణలో ఆ ఇద్దరు మహిళలు తెలియజేశారు. ‘శిశువును రక్షించినందుకు పోలీసులకు నిజంగా కృతజ్ఞతలు. అయితే ఈ సమస్య చాలా తీవ్రమైంది. లాక్డౌన్ కారణంగా పేద ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. అటవీ గ్రామాల్లో నివసించేవారికి పరిస్థితి మరీ దారుణం’ అని నేడాన్ ఫౌండేషన్ చైర్మన్ దిగంబర్ నార్జరీ అన్నారు. -
రేప్ చేశాడు.. పుట్టిన పాపనూ అమ్మేశాడు!
బరేలి: యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు.. పెద్దల ఒత్తిడితో ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పుట్టిన బిడ్డను పాతిక వేలకు అమ్మేసి, ఆమెను మరో ముసలాడికిచ్చి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసు వివరాలు ఇలాఉన్నాయి.. కుట్టు మిషన్ సామాగ్రి అమ్మే షవీజ్ అనే యువకుడికి 2013లో దర్జీగా పనిచేస్తోన్న ఓ యువతి పరిచయమైంది. దారాలు, సూదుల కోసం షాపునకు వచ్చే ఆ యువతిని ప్రేమ పేరుతో లోబర్చుకున్న షవీజ్.. పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. తీరా ఆమె గర్భం దాల్చిన తర్వాత ప్లేటు ఫిరాయించాడు. దీంతో యువతి తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు సిద్ధమైంది. అయితే ఊరిపెద్దల జోక్యంతో చివరికి షవీజ్.. ఆ అమ్మాయినే పెళ్లిచేసుకున్నాడు. కొద్ది కాలానికి పాప పుట్టింది. ఎలాగౌనాసరే భార్యాపిల్లల్ని ఒదిలించుకోవాలనుకున్న షవీజ్.. పుట్టిన పాపాయిని.. పిల్లలు లేని ఓ జంటకు రూ.25 వేలకు అమ్మేశాడు. ఇక భార్యను.. అప్పటికే ఏడుగురు సంతానం ఉండి, మొదటి భార్య చనిపోయిన ఓ వక్తికి ఇచ్చి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. ఎలాగోలా అతని చెరనుంచి తప్పించుకుని పుట్టింటికి వచ్చిన ఆ యువతి ఆదివారం బరేలీ పోలసు ఉన్నతాధికులకు ఫిర్యాదుచేసింది. భర్త, అతని కుటుంబ సభ్యులను శిక్షించాలని, తన పాపను తిరిగి ఇప్పించాలని పోలీసులను వేడుకుంది. ఈ కేసుపై డీఐజీ అసుతోష్ కుమార్ మాట్లాడుతూ మహిళా సీఐని దర్యాప్తు అధికారిగా నియమించామని, అన్ని కోణాల్లో వాస్తవాలను పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.