-
భారీ కుంభకోణంలో మాజీ సీఈవో
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పైభారీకుంభకోణానికి పాల్పడిన ఆరోపణలు నమోదయ్యాయి. ఇన్వెస్టర్లను మోసం చేసి 30 మిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ఎసెక్స్ హోల్డింగ్స్ ఇంక్ మాజీ సీఈవో నవీన్ శంకర్ సుబ్రమణ్యం జేవియర్ (44) పై దాదాపు రెండు వందలకోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. సెప్టెంబర్ 2011, మే 2014 కాలంలో 100 చిలీలో సుగర్ రవాణా, సరఫరా, ఐరన్ ఓర్ మైనింగ్ వ్యాపార నిమిత్తం పెట్టుబడిదారుల నుంచి 29 మిలియన్లకు పైగా డాలర్లను అక్రమంగా వసూలు చేశాడనీ, తప్పుడు ఆర్థిక ప్రకటనలు, నకిలీ పత్రాలు, తప్పుడు వాగ్దానాల ద్వారా ఎసెక్స్ హోల్డింగ్స్ పెట్టుబడులు సాధించాడని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ మొత్తాన్ని విలాసవంతమైన జీవితం, లగ్జరీ వాహనాలు, వివాహ ఖర్చులు, అతని భార్య ఖరీదైన నగల, కాస్మొటిక్ సర్జరీలు లాంటి ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించినట్టు న్యాయ శాఖ వ్యాఖ్యానించింది. అలాగే కొత్తపెట్టుబడిదారుల పెట్టుబడులను పాత పెట్టుబడిదారులు చెల్లించడానికి ఉపయోగించిందని దక్షిణ కెరొలిన కో ఆర్డినేషన్ కౌన్సిల్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ పేర్కొంది. వ్యాపార కాంట్రాక్ట్ లను పొందడానికి, ఫేక్ బ్యాంక్ స్టేట్ మెంట్లు, తప్పుడు కాంట్రాక్టర్ ఇన్ వోయిస్ లు సమర్పించి అక్రమాలకు పాల్పడ్డాడని వాదించింది. దీంతో గరిష్టంగా ఇరవై సంవత్సరాల శిక్షతోపాటు, జరిమానా 250,000 డాలర్లు (రూ.16,755,000 ) వరకు జరిమానాను విధించే అవకాశం ఉందని తెలిపారు. -
ఎన్నారై సీఈవోపై లంచాల కేసు
తన కంపెనీల షేర్లను కొనడానికి లంచాలు ఇచ్చిన కేసులో అమెరికాలోని రెండు కంపెనీలకు సీఈవోగా వ్యవహరిస్తున్న ఓ ఎన్నారైపై నేరం రుజువైంది. కాలిఫోర్నియాకు చెందిన శైలేష్ షా (48) తాను ఎలాంటి నేరం చేయలేదని అమెరికా జిల్లా జడ్జి రిచర్డ్ స్టీర్న్స్ ఎదుట వాదించారు. ఆయనను ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో శిక్ష విధిస్తారు. దాదాపు 20 ఏళ్ల పాటు జైలుశిక్ష, తర్వాత విడుదల చేసిన తర్వాత కూడా మూడేళ్ల పాటు పర్యవేక్షణ, 2.50 లక్షల డాలర్ల జరిమానా ఆయనకు విధించే అవకాశం ఉందని ఎఫ్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. తన కంపెనీలో షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ప్రతినిధి ఒకరికి రహస్యంగా లంచాలు ఇచ్చేందుకు శైలేష్ షా అంగీకరించినట్లు నేరం రుజువైంది. అయితే, ఆ ప్రతినిధి అండర్‌కవర్‌లో ఉన్న ఎఫ్‌బీఐ ఏజెంటు అన్న విషయం షాకు తెలియదు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. స్టాక్ మార్కెట్లలో అక్రమాలను నిరోధించేందుకు మార్గాలు కూడా ఈ విచారణలోనే వెతికారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement