breaking news
Inderpal Singh
-
‘వైమానికం’లో కొత్త వైస్ చీఫ్.. ఎవరీ ఇందర్‌పాల్ సింగ్ వాలియా?
న్యూఢిల్లీ: భారత వైమానిక దళంలో కీలక నియామకం జరిగింది. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన ఫైటర్ పైలట్ ఎయిర్ మార్షల్ ఇండర్పాల్ సింగ్ వాలియా తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా నియమితులయ్యారు. నవంబర్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ అక్టోబర్ 31న 29వ వైమానిక దళాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు.నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పూర్వ విద్యార్థి అయిన వాలియా.. 1988 జూన్ 11న భారత వైమానిక దళంలోని ఫైటర్ విభాగంలో అధికారిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి వివిధ హోదాల్లో సేవలందించారు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. మిగ్-21, మిగ్-23, మిగ్-27, జాగ్వార్, సుఖోయ్-30 ఎంకేఐ వంటి పలు యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు లేకుండా 3,200 గంటలకు పైగా విమాన ప్రయాణం చేసినట్లు అధికారిక ప్రొఫైల్ వెల్లడిస్తోంది.వాలియా తన కెరీర్లో పలు కీలక కమాండ్ బాధ్యతలు చేపట్టారు. ఫ్రంట్‌లైన్ ఫైటర్ స్క్వాడ్రన్తో పాటు టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ , బరేలీ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు నాయకత్వం వహించారు. ప్రస్తుతం తూర్పు వైమానిక కమాండ్‌కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా సేవలందిస్తున్నారు. భారత వైమానిక దళంలో కీలక సిబ్బంది విభాగాల్లోనూ ఆయన పనిచేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ అధిపతిగా, తూర్పు వైమానిక కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జపాన్, దక్షిణ కొరియాలోని భారత రాయబార కార్యాలయాల్లో రక్షణ అటాషేగా కూడా పనిచేశారు.బ్రిటన్‌లో అడ్వాన్స్డ్ కమాండ్ అండ్ స్టాఫ్ కోర్సు, బంగ్లాదేశ్‌లో నేషనల్ డిఫెన్స్ కాలేజీ కోర్సును పూర్తి చేశారు. సైనిక సేవలతో పాటు విద్యారంగంలోనూ వాలియా ప్రత్యేకత చాటుకున్నారు. డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో మూడు పీజీ డిగ్రీలు పొందారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2008లో వాయుసేన మెడల్, 2018లో అతి విశిష్ట సేవా మెడల్ లభించాయి. నవంబర్ 1 నుంచి వైస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆయనకు దాదాపు నాలుగు దశాబ్దాల సైనిక అనుభవం కీలకం కానుంది.ఇదీ చదవండి: సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: జైశంకర్ -
తలపాగా విప్పి నలుగురిని కాపాడాడు...
సంగ్రూర్ (పంజాబ్): మత ఆచారాన్ని సైతం పక్కన పెట్టి నలుగురు యువకుల ప్రాణాలు కాపాడేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం అతడిని హీరోని చేసింది. అతడే 24 ఏళ్ల ఇందర్ పాల్ సింగ్. మత ఆచారాన్ని మించి అతడు చూపించిన మానవత్వానికి అందరూ జేజేలు కొడుతున్నారు. సిక్కులు అనే కాదు ఎవరైనా సరే వారి మత ఆచారాలను పక్కన పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం సాటి వ్యక్తులను కాపాడటమే తన ప్రథమ కర్తవ్యంగా భావించి తలపాగాను తీసి, మరో సిక్కు యువకుడి సహాయంతో వారిని రక్షించాడు. గణేష్ నిమజ్జనంలో భాగంగా సునం గ్రామానికి చెంవదిన నలుగురు యువకులు ఇంద్రపాల్ సింగ్, జీవన్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, ఇందర్ తివారీ కెనాల్ గోడపై నిలుచున్నారు. అనుకోకుండా ఒకే సారి పెద్ద ఎత్తున నీరు రావడంతో అదుపుతప్పి వాళ్లు నీళ్లలో పడిపోయారు. కెనాల్ లో నలుగురు యువకులు చిక్కుకుని కొట్టుకుపోవడాన్ని ఇందర్ పాల్ సింగ్ గమనించాడు. వీరిని కాపాడటానికి తొలుత ఒక వైరుని వీళ్లకి అందించాడు. కానీ అది తెగిపోవడంతో మరోదారిలేక అక్కడే గట్టుపై కూర్చున్న ఇంద్రపాల్ సింగ్ తన తలపాగాని తీసి వారికి ఇచ్చాడు. ఒడ్డు పైనే ఉన్న మరో సిక్కు యువకుడు ఆ తల పాగా సహాయంతో నలుగురు యువకులు నీళ్లలో కొట్టుకు పోకుండా ఒక్కొక్కరిని ఒడ్డుకు లాగి కాపాడాడు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియోని చూసిన వారందరు ఇందర్ పాల్ చూపించిన మానవత్వానికి జేజేలు కొడుతున్నారు. -
మతాన్ని మించిన మానవత్వం...


