Imrul-kayes
-
బంగ్లాదేశ్ శుభారంభం
ఢాకా: ఓపెనర్ ఇమ్రుల్ కైస్ (140 బంతుల్లో 144; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత శతకంతో చెలరేగడంతో జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 28 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1–0తో ముం దంజ వేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. మిథున్ (37), సైఫుద్దీన్ (50; 3 ఫోర్లు, 1 సిక్స్)ల సాయంతో కైస్ జట్టుకు మంచి స్కోరు అందించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 50 ఓవర్లలో 9 వికెట్లకు 243 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ (50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), జార్విస్ (37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగినా అప్పటికే ఆలస్యమైపోయింది. -
పోరాడుతున్న బంగ్లా
చిట్టగాంగ్: శ్రీలంక జట్టు భారీ స్కోరుకు సమాధానంగా బంగ్లాదేశ్ తీవ్రంగా పోరాడుతోంది. ఓపెనర్ షంషూర్ రెహమాన్ (191 బంతుల్లో 106; 11 ఫోర్లు; 1 సిక్స్), ఇమ్రుల్ కయేస్ (218 బంతుల్లో 115; 17 ఫోర్లు; 1 సిక్స్) కీలక సెంచరీలతో జట్టు ఫాలో ఆన్‌ను తప్పించుకుంది. వీరి ఆటతీరు ఫలితంగా చివరిదైన రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. లంక తొలి ఇన్నింగ్స్ స్కోరు కన్నా ఇంకా 178 పరుగులు వెనుకబడి ఉండగా చేతిలో రెండు వికెట్లున్నాయి. షకీబ్ అల్ హసన్ (89 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాను రెహమాన్, కయేస్ అద్భుతంగా ఆదుకున్నారు. లంక బౌలర్లను నిలకడగా ఎదుర్కొన్న వీరు రెండో వికెట్‌కు ఏకంగా 232 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ వికెట్‌కు ఇది బంగ్లా తరఫున అత్యుత్తమ భాగస్వామ్యం. క్రీజులో ప్రస్తుతం మహ్ముదుల్లా (54 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు), అల్ అమీన్ (3) ఉన్నారు. మెండిస్‌కు నాలుగు, పెరీరాకు మూడు వికెట్లు దక్కాయి.