-
బిల్డింగ్‌పై నుంచి దూకి ఇఫ్లూ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఓయూ పరిధిలోని ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. హర్యానాకు చెందిన విద్యార్థిని శనివారం హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి మృతిచెందింది. మృతురాలిని ఏంఏ ఇంగ్లీష్ చదువుతున్న అంజలిగా(22) గుర్తించారు. కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. -
విదేశీ భాషల నిలయం.. ‘ఇఫ్లూ’
ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ.. సంక్షిప్తంగా ఇఫ్లూ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్‌గా 1958లో ఇంగ్లిష్ కోర్సుల బోధనతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కాలక్రమంలో ఇంగ్లిష్తోపాలు పలు విదేశీ భాషలూ బోధిస్తూ.. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్‌గా పేరు మార్చుకొని పరిధిని మరింత విస్తృతం చేసింది. 2007లో సెంట్రల్ యూనివర్సిటీ హోదాను సొంతం చేసుకుని విభిన్న కోర్సులను అందిస్తూ.. నానాటికీ విస్తరిస్తున్న ఇఫ్లూపై ఇన్స్టిట్యూట్ వాచ్.. ఇంగ్లిష్, ఇతర విదేశీ భాషల్లో పదుల సంఖ్యలో కోర్సులను అందిస్తోంది ఇఫ్లూ. ఆయా భాషల్లో నెపుణ్యం పొందేలా మెరుగైన బోధన అందిస్తూ.. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విశేష గుర్తింపు పొందింది. ప్రతిఏటా ఇక్కడ ప్రవేశం పొందుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా జాతీయ స్థాయిలోనూ ఇఫ్లూ తన క్యాంపస్‌లను విస్తరిస్తోంది. హైదరాబాద్ ప్రధాన క్యాంపస్‌గా ఉన్న ఈ యూనివర్సిటీ.. ఇప్పుడు షిల్లాంగ్, లక్నో, మలప్పురం(కేరళ) సెంటర్స్‌ను కూడా ఏర్పాటు చేసి పలు కోర్సులను అందిస్తోంది. తద్వారా అన్ని ప్రాంతాల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా నిరంతర ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంగ్లిష్ టు రష్యన్.. పలు భాషలు, విస్తృత కోర్సులు ఇఫ్లూలో ఇంగ్లిష్‌తోపాటు అరబిక్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, జపనీస్ కోర్సులను ప్రస్తుతం ఆఫర్ చేస్తున్నారు. ఇంగ్లిష్ భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా అనేక కోర్సులను రూపొందించింది. ఇంగ్లిష్ లిటరరీ స్టడీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్లు ఈ కోవకే చెందుతాయి. పలు స్థాయిల్లో అకడమిక్ కోర్సులు ఇఫ్లూలో సర్టిఫికెట్ స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా వరకు పలు స్థాయిల్లో, భాషల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అరబిక్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషల్లో బ్యాచిలర్స్ డిగ్రీ (ఆనర్స్), పీజీ కోర్సులు ఇందుకు ఉదాహరణలు. వీటిలో బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధిత భాషలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతలు అర్హతలు. ఇంగ్లిష్‌కు సంబంధించి ఇఫ్లూకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అందిస్తున్న కోర్సులు.. ఇంగ్లిష్‌లో బీఏ (ఆనర్స్). అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో బీఈడీ. అర్హత: బీఏ(ఇంగ్లిష్) లేదా ఎంఏ (ఇంగ్లిష్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంఏ (ఇంగ్లిష్). అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. భాష నైపుణ్యాలతో మరెన్నో.. ఆయా భాషలకు సంబంధించి నైపుణ్యాలు అందించే విధంగా కోర్సులను ప్రవేశపెట్టిన ఇఫ్లూ.. మరెన్నో ఇతర కోర్సులను కూడా అందిస్తోంది. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మాస్టర్స్ ఇన్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లిష్ వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు. హిందీలోనూ కోర్సులు ప్రవేశపెట్టడం ఇన్స్టిట్యూట్ అనుసరిస్తున్న వైవిధ్య విధానాలకు నిదర్శనం. అంతేకాకుండా ఇన్స్టిట్యూట్ అందిస్తున్న ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులన్నింటిలోనూ పీహెచ్డీ చేసే అవకాశం కూడా ఉంది. ఔత్సాహికులకు స్పోకెన్ ఇంగ్లిష్, పార్ట్‌టైం కోర్సులు ఇంగ్లిష్ భాష ఔత్సాహికులు, నైపుణ్యాలు పెంచుకోవాలనుకునే వారికి ప్రత్యేకంగా కొన్ని పార్ట్‌టైం కోర్సులు కూడా ఇఫ్లూలో అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్‌లో బేసిక్, అడ్వాన్స్డ్ ప్రొఫిషియన్సీ కోర్సులు ఇందులో ప్రధానమైనవి. వీటితోపాటు ఇతర ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల్లో ఇంగ్లిష్ భాష నైపుణ్యాలు పెంచే విధంగా స్వల్ప కాలిక వ్యవధిలో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులను కూడా ఇఫ్లూ నిర్వహిస్తోంది. ఏఐఈఎల్టీఏ.. ఇఫ్లూ మరో ప్రత్యేకం ఆల్ ఇండియా ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ అథారిటీ (ఏఐఈఎల్టీఏ) పేరుతో ఇఫ్లూ జాతీయ స్థాయిలో.. నిర్వహించే పరీక్ష ఇది. దీనికి ఔత్సాహికులు ఎవరైనా హాజరు కావచ్చు. ఇందులో మార్కుల ఆధారంగా అభ్యర్థులు తమకు ఇంగ్లిష్ భాష నైపుణ్యాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ప్లేస్‌మెంట్స్ సదుపాయం కూడా.. ఇఫ్లూలో ప్రతి ఏటా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. సగటున 92 శాతం మంది విద్యార్థులు వీటిలో విజేతలుగా నిలుస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాలల నుంచి మన దేశంలోని వివిధ దేశాల ఎంబసీలు, టూరిజం సంస్థలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, బీపీఓ, కేపీఓ రంగంలోని కంపెనీలు ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పాల్గొంటున్నాయి. పీజీ విద్యార్థులకు సగటున రూ.3 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. వేల సంఖ్యలో రిఫరెన్స బుక్స్, జర్నల్స్ లాంగ్వేజెస్ కోర్సులో నైపుణ్యాలు పొందాలంటే.. పలు రిఫరెన్స్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఇఫ్లూలో చక్కటి లైబ్రరీ సదుపాయం కూడా ఉంది. వేల సంఖ్యలో రిఫరెన్స్ పుస్తకాలతోపాటు దాదాపు 15 వందలకుపైగా పీహెచ్డీ థీసిస్‌లు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థులు ఆయా అంశాలకు సంబంధించి పూర్తి అవగాహన పొందొచ్చు. అంతేకాకుండా యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన విద్యార్థులు అందజేసిన థీసిస్‌లను డిజిటలైజేషన్ పద్ధతిలో అమర్చి విద్యార్థులందరూ ఇంటర్నెట్లో చూసే అవకాశం కూడా కల్పించింది. డిస్టెన్స్ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ ఇఫ్లూ రెగ్యులర్ కోర్సులతోపాటు దూర విద్యా విధానంలోనూ పీజీ కోర్సులను అందిస్తోంది. 2014-15కు ఎంఏ ఇంగ్లిష్ (వ్యవధి రెండేళ్లు); పీజీడీటీఈ (వ్యవధి: ఏడాది) ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తోంది. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 31. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. వెబ్సైట్: http://www.efluniversity.ac.in/ త్వరలో మరికొన్ని కోర్సులు.. ‘‘లాంగ్వేజ్ స్టడీస్‌లో పలు కోర్సులను అందిస్తున్న ఇఫ్లూకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. త్వరలో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశ పెట్టే ఆలోచన కూడా ఉంది. జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతాల విద్యార్థులకూ అందుబాటులో ఉండేలా క్యాంపస్‌లను విస్తరిస్తున్నాం. ఇఫ్లూ కోర్సులకు విద్యార్థుల ఆదరణ పెరుగుతోంది. నేటి పోటీ ప్రపంచంలో మాతృభాషతోపాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ (రీడింగ్, స్పోకెన్) స్కిల్స్ ప్రాధాన్యం పెరుగుతుండటమే ఇందుకు కారణం. ఈ దిశగా సమాజ అవసరాలకు అనుగుణంగా కరిక్యులంలోనూ మార్పులు చేస్తున్నాం. త్వరలో మరికొన్ని కోర్సులను అందించేందుకు కృషి చేస్తున్నాం’’ - ప్రొఫెసర్ సునయన సింగ్, వైస్ ఛాన్స్లర్, ఇఫ్లూ ఇఫ్లూ ప్రత్యేకం.. పీహెచ్డీ ప్రోగ్రామ్స్ ఇఫ్లూకు ప్రత్యేకంగా ట్రేడ్ మార్క్‌గా నిలుస్తున్న మరో అంశం.. ఇక్కడ ఉన్న పీహెచ్డీ కోర్సులు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్; లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్; కంపేరిటివ్ లిటరేచర్ అండ్ ఇండియన్ స్టడీస్; ఇంగ్లిష్ లిటరేచర్; ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్; ట్రాన్స్లేషన్ స్టడీస్; కల్చరల్ స్టడీస్; ఫిల్మ్ స్టడీస్; సోషల్ ఎక్స్‌క్లూజన్ స్టడీస్ వంటి విభాగాల్లో పీహెచ్డీ కోర్సులున్నాయి. వీటిలో ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్; కంపేరిటివ్ లిటరేచర్ అండ్ ఇండియన్ స్టడీస్‌లో పీహెచ్‌డీలపై విదేశీ విద్యార్థులు అమితమైన ఆసక్తి చూపుతున్నారు. -
విదేశీ భాషలతో వైవిధ్య కెరీర్..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, గ్లోబలైజేషన్.. ప్రపంచాన్ని ఓ చిన్న గ్రామంగా మార్చేస్తూ ఎన్నో కొత్త కొలువులను యువత ముందుంచుతున్నాయి. ఇలాంటి వాటిలో ‘భాష’తో సంబంధమున్న ఉద్యోగాలూ ఉన్నాయి. ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న వారికి కార్పొరేట్ ప్రపంచం ఆకర్షణీయ వేతనాలతో స్వాగతం పలుకుతోంది. ఈ నేపథ్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవడంతో పాటు ఉన్నత జీవితానికి బాటలు వేసుకునేందుకు ఉపయోగపడే విదేశీ భాషల కోర్సులు, కెరీర్‌పై స్పెషల్ ఫోకస్.. విదేశీ మార్కెట్లోకి ప్రవేశించి వ్యాపార కార్యకలాపాలను విస్తరింపజేసే భారతీయ కంపెనీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అదే విధంగా అనేక విదేశీ కంపెనీలు భారత్ లో అడుగుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు, ప్రాజెక్టుల అప్పగింత వంటి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు విదేశీ భాషా నైపుణ్యాలున్న వారు అవసరమవుతున్నారు. విదేశాల్లో చదువుకొని అక్కడే కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకున్న వారూ అధికమయ్యారు. ఇలాంటి వారు కూడా ఫారెన్ లాంగ్వేజ్‌లను నేర్చుకుంటున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలు విదేశీ భాషలకు సంబంధించి వివిధ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు: విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్లు విదేశీ భాషా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు వివిధ రకాల కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఉదాహరణకు గోవా యూనివర్సిటీ ఫ్రెంచ్‌లో పీహెచ్‌డీని ఆఫర్ చేస్తోంది. కురుక్షేత్ర యూనివర్సిటీ ఫ్రెంచ్, జర్మన్లో డిప్లొమాను అందిస్తోంది. ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన అర్హతలతో కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. డిమాండ్ ఉన్న భాషలు: విద్య, వ్యాపార రంగాల్లో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ భాషా నైపుణ్యాలున్న వారి అవసరం పెరుగుతోంది. ప్రధానంగా ఇంగ్లిషేతర దేశాల భాష తెలిసిన వారికి కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలుంటున్నాయి. దీంతో జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్, జపనీస్, స్పానిష్, కొరియన్ కోర్సుల్లో చేరుతున్న ఔత్సాహికులు ఎక్కువయ్యారు. ఇఫ్లూ కేరాఫ్ లాంగ్వేజ్ స్కిల్స్: హైదరాబాద్‌లో ప్రధాన క్యాంపస్‌ను కలిగిన ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి.. విదేశీ భాషల కోర్సుల నిర్వహణలో మంచి పేరుంది. ఇది వివిధ స్థాయిల్లో విదేశీ భాషల కోర్సులను అందుబాటులో ఉంచుతుంది. జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్, అరబిక్, ఫ్రెంచ్ వంటి భాషల కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఏ, ఎంఏ స్థాయిలో కోర్సులను అందిస్తోంది. రష్యన్, ఫ్రెంచ్ భాషల్లో పీహెచ్డీ కూడా ఉంది. వెబ్సైట్: www.efluniversity.ac.in కోర్సులో బోధించే అంశాలు: విద్యార్థులు చేరిన భాషకు సంబంధించిన వ్యాకరణం, ఫొనెటిక్స్, సాహిత్యం వంటి అంశాలను బోధిస్తారు. ట్రాన్స్లేషన్ (థియరీ, ప్రాక్టీస్), జనరల్ లింగ్విస్టిక్స్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. ఇఫ్లూ వంటి యూనివర్సిటీలు విదేశాల నుంచి సంబంధిత భాషా నిపుణులను ఇక్కడకు ఆహ్వానించి వారితో ఏడాదిలో కొద్ది రోజుల పాటు తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి ఏర్పాటు వల్ల విద్యార్థులు తాము నేర్చుకుంటున్న భాష యాక్సెంట్, ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు వంటి వాటిని తెలుసుకునేందుకు వీలవుతుంది. సాధారణంగా డిగ్రీ స్థాయి కోర్సుల్లో మొదటి ఏడాది ఇంగ్లిష్‌లో బోధన ఉంటుంది. ఉద్యోగాలు అందుబాటులో ఉండే విభాగాలు: విదేశీ భాషల కోర్సులను దిగ్విజయంగా పూర్తి చేసినవారు వివిధ విభాగాల్లో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అవి: ఎగుమతి, దిగుమతి సంస్థలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు పర్యాటక, ఆతిథ్య రంగ సంస్థలు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా. రాయబార కార్యాలయాలు. సాయుధ దళాలు, నిఘా సంస్థలు. కాల్ సెంటర్లు; విద్య, పరిశోధన సంస్థలు. హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇన్స్టిట్యూట్స్. ఏయే ఉద్యోగాలుంటాయి?: విదేశీ భాషల కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. అవి: డిప్లొమాటిక్ సర్వీస్ ప్రొఫెషనల్. ఫారెన్ లాంగ్వేజ్ ట్రైనర్. ట్రాన్స్‌లేటర్ (ఎంఎన్‌సీలు/ప్రభుత్వ సంస్థలు). రీసెర్చ్ అసోసియేట్. ఇంటర్ప్రెటర్, టూరిస్ట్ గైడ్. ఎయిర్ హోస్టెస్, అటెండెంట్ (హోటళ్లు). ఫ్రీలాన్స్ రైటర్, ట్రాన్స్‌లేటర్, ఇంటర్ప్రెటర్. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్. వేతనాలు: ట్రాన్స్‌లేటర్లు, ఇంటర్ప్రెటర్లుగా విధులు నిర్వహించే వారికి ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి. నెలకు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు ఆర్జిస్తుంటారు. అనుభవం, పనితీరు బట్టి ఈ మొత్తం పెరుగుతుంది. ట్రాన్స్లేటర్లకు పదాల సంఖ్యను బట్టి డబ్బు ముడుతుంది. భాషను బట్టి పదానికి 60 పైసలు నుంచి రూ.5 రూపాయల వరకు అందుతుంది. ఇంటర్ప్రెటర్లకు గంటలను బట్టి ఆదాయం లభిస్తుంది. వీరికి గంటకు రూ.800 వరకు చెల్లిస్తున్నారు. బోధన వృత్తిలో స్థిరపడ్డ వారికి ప్రారంభంలో రూ.20 వేలకు పైగా వేతనం లభిస్తుంది. కార్పొరేట్ కంపెనీలు, వైద్యం, టూరిజం తదితర రంగాల్లో స్థిరపడిన వారికి ప్రారంభంలోనే రూ.20 వేలు వేతనం ఉంటుంది. క్యాంపస్ నియామకాలు: ఈ-సెర్వ్, వరల్డ్ బ్యాంక్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర, విప్రో, ఒరాకిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, టాటా కన్సల్టెన్సీ, థామ్సన్, రాయిటర్స్ వంటి సంస్థలు క్యాంపస్ నియామకాల ద్వారా విదేశీ భాషలు తెలిసిన వారిని నియమించుకుంటున్నాయి. విదేశీ భాష- కెరీర్ ఫోకస్ విదేశీ భాషల నైపుణ్యాలను పెంపొందించుకున్న వారికి విస్తృత అవకాశాలు ఉంటాయి. వీరు ట్రాన్స్‌లేటింగ్, ఇంటర్ప్రెటింగ్, లాంగ్వేజ్ టీచింగ్ వంటి విభాగాల్లో స్థిరపడొచ్చు. ట్రాన్స్‌లేటర్స్: విదేశీ భాష కోర్సులను పూర్తిచేసిన వారిలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్లేషన్. ట్రాన్స్‌లేటర్లు ఒక భాషలో ఉన్న సమాచారాన్ని వేరొక భాషలోకి అనువదిస్తారు. ఇప్పుడు వివిధ బహుళ జాతి కంపెనీలు భారత్‌లో అడుగుపెడుతుండటం, ఇక్కడి కంపెనీలు విదేశీ కంపెనీలతో జాయింట్ వెంచర్స్‌ను ఏర్పాటు చేయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు, వ్యాపార నివేదికలు, ఒప్పంద పత్రాలు వంటి వాటిని తర్జుమా చేసేందుకు ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు. విదేశీ వ్యవహారాలు, ఎగుమతులు-దిగుమతులు, వ్యాపారం, సాహిత్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర రంగాల్లో పెద్ద ఎత్తున ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు. మన దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తుంది. వివిధ దేశాల నుంచి అనేక ప్రాజెక్టులు ఇక్కడి ఐటీ కంపెనీలకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రాజెక్టులను పూర్తిచేసే క్రమంలో వివిధ దశల్లో ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు. భాషపై పట్టుండి, ఆత్మ విశ్వాసం ఉన్నవారు సొంతంగా ట్రాన్స్లేషన్ సేవల సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటర్‌ప్రెటర్స్: ఒకరి మాటలను అనువదించి మరొకరికి అప్పటికప్పుడు వినిపించడమే ఇంటర్‌ప్రెటర్స్ పని. ఈ వృత్తిలో రాణించాలంటే మంచి లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్ప్రెటింగ్ సవాళ్లతో కూడుకున్న వృత్తి. అయినా ఆకర్షణీయ వేతనాలు వస్తుండటం ఇందులో ప్లస్ పాయింట్. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో పాటు యునెటైడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (యూఎన్ఓ), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలకు ఇంటర్‌ప్రెటర్స్ అవసరం ఉంటుంది. సదస్సులు, ఒక దేశ వాణిజ్య బృందం మరొక దేశంలో పర్యటించే సమయంలోనూ ఈ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. ఆసుపత్రులు, ఫార్మాస్యూటికల్ రంగాల్లోనూ విదేశీ భాష నిపుణుల అవసరం ఉంటోంది. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే క్రమంలో విమానయాన, పర్యాటక, ఆతిథ్య సంస్థలు ఉద్యోగ నియామకాల్లో విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. లాంగ్వేజ్ టీచింగ్ అండ్ ట్రైనింగ్: విదేశీ భాషల కోర్సులు పూర్తిచేసిన వారికి మరో ఉపాధి వేదికగా బోధన రంగం ఉంటోంది. ప్రస్తుతం దేశంలోని పలు కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు విదేశీ భాషల కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాషా నైపుణ్యాలున్న వారు బోధన రంగంలో అవకాశాలను అందుకోవచ్చు. ఉన్నత విద్యను పూర్తిచేస్తే విశ్వవిద్యాలయాల్లో సైతం ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. సొంత కాళ్లపై నిలబడొచ్చు: విదేశీ భాషల్లో పట్టు సాధించినా, పూర్తిస్థాయి ఉద్యోగంపై ఆసక్తి లేని వారు ఫ్రీలాన్సింగ్ ద్వారా అధిక మొత్తాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా పుస్తక ప్రచురణ విభాగంలో వీరికి అవకాశాలు పుష్కలం. సొంతంగా భాష శిక్షణ కేంద్రాలను, ట్రాన్స్‌లేటింగ్, ఇంటర్ప్రెటింగ్ సేవల సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. మరికొంత మందికి ఉపాధి చూపించవచ్చు. వారాలు, నెలల ప్రాతిపదికన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని పని చేయొచ్చు. విదేశీ భాషల కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ: ఎంఏ-అరబిక్; ఎంఏ-జపనీస్; ఎంఏ-పర్షియన్; ఎంఫిల్-పర్షియన్. వెబ్సైట్: www.du.ac.in గోవా యూనివర్సిటీ: బీఏ-ఫ్రెంచ్; ఎంఏ-పోర్చుగీస్; ఎంఏ-ఫ్రెంచ్; పీహెచ్డీ-ఫ్రెంచ్. వెబ్సైట్: www.unigoa.ac.in యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా: సర్టిఫికెట్- అరబిక్/ చైనీస్/ఫ్రెంచ్/జర్మన్/స్పానిష్/రష్యన్. ఎంఏ-రష్యన్; పీహెచ్డీ-రష్యన్; బీఏ (హానర్స్)-రష్యన్. అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్ తదితర భాషల్లో డిప్లొమా కోర్సులు. వెబ్సైట్: www.caluniv.ac.in యూనివర్సిటీ ఆఫ్ ముంబై: రష్యన్, జర్మన్లో ఐదేళ్ల కాల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ (బీఏ అండ్ ఎంఏ)ను ఆఫర్ చేస్తోంది. జర్మన్లో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు, రష్యన్లో సర్టిఫికెట్ కోర్సు, జర్మన్లో సర్టిఫికెట్ కోర్సు. పర్షియన్, అరబిక్, ఇటాలియన్లో సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.mu.ac.in గురునానక్ దేవ్ యూనివర్సిటీ: ఫ్రెంచ్, రష్యన్లో డిప్లొమా కోర్సు; ఫ్రెంచ్, రష్యన్, జర్మన్, జపనీస్‌లో సర్టిఫికెట్ కోర్సు; ఫ్రెంచ్, రష్యన్లో అడ్వాన్స్డ్ డిప్లొమా. వెబ్సైట్: www.gndu.ac.in ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులతో అదనపు ప్రయోజనం విదేశీ భాషలకు సంబంధించి ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (ఇఫ్లూ)తో పాటు వివిధ విశ్వవిద్యాలయాలు సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, బీఏ, ఎంఏ, పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత కెరీర్ అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి. యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఎంఎన్‌సీలు, దౌత్య సంబంధ విభాగాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందనడంలో సందేహం లేదు. ఉదాహరణకు టూరిజం మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్థితో పోలిస్తే అదే కోర్సుతో పాటు ఓ విదేశీ భాష నేర్చుకున్న అభ్యర్థి మంచి కొలువులో స్థిరపడే అవకాశముంది. అదే విధంగా ఐటీ, లా, ఫైనాన్స్, సేల్స్ సంబంధిత కోర్సులు చేసిన వారు ఫారెన్ లాంగ్వేజ్‌లను కూడా నేర్చుకొని ఉన్నత స్థానాలను అందుకోవచ్చు. నాతో పాటు బీఏ స్పానిష్ పూర్తి చేసిన 30 మందిలో 20 మంది బెంగళూరు, లూథియానా వంటి చోట్ల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నేను, మరో తొమ్మిది మంది ఉన్నత విద్య (ఎంఏ స్పానిష్)దిశగా అడుగులేశాం. మాస్టర్ డిగ్రీ, నెట్ అర్హతలతో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో కొలువులను సొంతం చేసుకోవచ్చు. ఒరాకిల్, హెచ్‌పీ వంటి సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఉన్నత విద్యను పూర్తిచేసిన వారు సొంతంగా ఫారెన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. - స్నేహా మెరిన్, ఎంఏ (స్పానిష్), ఫైనలియర్, ఇఫ్లూ.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్‌లు!
- పుష్కర కాలం తర్వాత...
Advertisement