breaking news
Idly Kottu Movie
-
8 ఏళ్లు పేదరికంలోనే ఉన్నాం.. నిజంగా ఇడ్లీ తినేందుకు డబ్బుల్లేవ్!
కుబేరతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ (Dhanush) ఇడ్లీ కొట్టు మూవీ (Idly Kadai Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ధనుష్ స్వీయదర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇటీవల సినిమా ఆడియా లాంచ్ ఈవెంట్లో ధనుష్ తన బాల్యం గురించి చెప్తూ ఎమోషనలయ్యాడు. చిన్నప్పుడు రోజూ ఇడ్లీ తినాలనుండేదని, కానీ తన దగ్గర అంత డబ్బుండేది కాదన్నాడు. ట్రోలింగ్‌పై స్పందించిన ధనుష్ఏదైనా చిన్నపనికి వెళ్లి, ఆ డబ్బుతో ఇడ్లీ కొనుక్కుని తినేవాడినని గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ కామెంట్స్‌పై నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ధనుష్ తండ్రి కూడా ఒక దర్శకుడేనని, అలాంటి వ్యక్తి పేదరికంలో ఎందుకుంటాడని, అంతా కట్టుకథ అని విమర్శించారు. ఈ వివాదంపై మధురైలో జరిగిన ఇడ్లీ కొట్టు ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్ స్పందించాడు. నా స్పీచ్ మీరు పూర్తిగా విన్నారా? 1983లో నేను పుట్టాను. 1991లో మా నాన్న దర్శకుడయ్యాడు. ఆ ఎనిమిదేళ్లపాటు మేము కష్టపడుతూనే ఉన్నాం. 1995 తర్వాతే మా కుటుంబ పరిస్థితి మెరుగుపడింది. మేము నలుగురం సంతానం కాబట్టి బయట తినడానికి డబ్బు అడిగినప్పుడు ఇచ్చేవాళ్లు కాదు! అందుకే ఏదైనా పని చేసి కొనుక్కునేవాడిని.అన్న దొంగచిన్నప్పుడు నేను అల్లరి ఎక్కువ చేసేవాడిని. మా అన్న సెల్వరాఘవన్ నన్ను మించిపోయేవాడు. నేను 20 పైసలు, చారానా.. ఇలా కాయిన్లు దాచుకునేవాడిని. అవి నాలుగైదు రూపాయలవగానే మా అన్న వాటిని దొంగిలించేవాడు. క్రికెట్ ఆడేటప్పుడు కూడా మూడున్నరగంటలవరకు ఔట్ అవకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉండేవాడు. నేను బౌలింగ్ చేసేవాడిని. నా వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాడిని. కానీ ఎప్పుడైతే అతడు ఔటయి నేను బ్యాట్ పట్టుకుంటానో.. వెంటనే బౌలింగ్ చేయకుండా అక్కడినుంచి పారిపోయేవాడు. అలా నన్ను చీటింగ్ చేసేవాడు అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.బయోపిక్ కాదుఅలాగే ఇదో ప్రముఖ చెఫ్ బయోపిక్ అంటూ వస్తున్న రూమర్లను కొట్టిపారేశాడు. ఇది ఎవరి బయోపిక్ కాదని, తన బాల్యంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలు, తన ఊహలను కలగలిపి ఈ సినిమా తీసినట్లు పేర్కొన్నాడు. ఇడ్లీ కొట్టు సినిమా విషయానికి వస్తే ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అరుణ్ విజయ్, రాజ్‌కిరణ్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.చదవండి: చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్ -
ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన మూవీ ఇడ్లీ కడై (Idli Kadai Movie). ఇది తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రానుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 14న) ఇడ్లీ కొట్టు ఆడియో లాంచ్ నిర్వహించారు. రోజూ తినాలనిపించేదిఈ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు ప్రతిరోజు నాకు ఇడ్లీ తినాలనిపించేది. కానీ నాదగ్గర అంత డబ్బుండేది కాదు. అప్పుడేం చేశానంటే తోటలో పూలు తెంపడానికి పనికెళ్లేవాడిని. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి త్వరగా తోటకు వెళ్లి రెండు గంటలు పనిచేసేవాడిని. అప్పుడు నాకు రూ.2 ఇచ్చేవారు. అది తీసుకున్నాక ముందు చేతి పంపు దగ్గరకు వెళ్లి రోడ్డుపైనే స్నానం చేసేవాళ్లం. తర్వాత ఇడ్లీ కొట్టుకు వెళ్తే.. ఆ డబ్బుతో నాలుగైదు ఇడ్లీలు వచ్చేవి. హ్యాపీగా ఉందిమనం కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కుని తింటే వచ్చే టేస్ట్ దేంట్లోనూ రాదు. మిమ్మల్నందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను చాలామంది అభిమానులను కలిశాను. వారిలో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఉన్నారు. నా ఫ్యాన్స్ ఇంత మంచి స్థాయిలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునేదానిపైనే ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
వేసవిలో ధనుష్ ‘ఇడ్లీ కొట్టు ’
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు). ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. వండర్‌బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై ధనుష్, ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘ఇడ్లీ కడై’ తెలుగు విడుదల హక్కులను శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత, నిర్మాత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చింతపల్లి రామారావు మాట్లాడుతూ– ‘‘రాయన్’ మూవీ తర్వాత ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ఇడ్లీ కడై’పై మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ధనుష్‌కి ఇది నటుడిగా యాభై రెండో చిత్రం, అలాగే ఆయన దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా. ఈ మూవీకి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన ‘విడుదల 2’ చిత్రాన్ని ఇటీవల మా బ్యానర్లో తెలుగులో రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది’’ అని తెలిపారు.