breaking news
ICC chairman srinivasan
-
‘సారీ’ పేరు మారింది
ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో తమ సమావేశాలకు హాజరు కావచ్చో లేదో తెలపాలంటూ సెప్టెంబరు 12వ తేదీన బీసీసీఐ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అందులో శ్రీనివాసన్ తండ్రి పేరు నటేశన్ అయ్యర్‌గా ప్రస్తావించారు. ఈ పేరుగల వ్యక్తి చెన్నైలో ఓ ప్రముఖ ఆడిటర్. ఎన్.శ్రీనివాసన్ తండ్రిపేరు నారాయణ స్వామి. తర్వాత బోర్డు లాయర్లు కాకతాళీయంగా ఈ పిటిషన్‌ను చూస్తే తప్పు కనిపించింది. వెంటనే లబోదిబో మంటూ మళ్లీ కోర్టుకు పరిగెత్తారు. తమ పిటిషన్లో పేరు తప్పుగా రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ సెప్టెంబరు 23న దానిని సరిదిద్దుకుని తిరిగి మరో పిటిషన్ సమర్పించారు. -
చక్రం తిప్పుతున్న శ్రీనివాసన్!
న్యూఢిల్లీ : ఏడు నెలల వ్యవధిలోనే బీసీసీఐలో మరో సారి రాజకీయం రాజుకుంది. దాల్మియా మృతితో ఖాళీ అయిన అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు బోర్డులోని రెండు వర్గాలు వ్యూహా ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ తన మద్దతుదారులతో గురువారం బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలి, అభ్యర్థి ఎవరు అనే అంశాలను ఇందులో చర్చించనున్నారు. తనకు ఈ సమావేశం కోసం పిలుపు వచ్చినట్లు ఒక సీనియర్ సభ్యుడు ధ్రువీకరించారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న అమితాబ్ చౌదరి కూడా దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈస్ట్‌జోన్ సంఘాలతో పాటు తనకు అనుకూలురైన సౌత్‌జోన్ సంఘాలనుంచి కూడా శ్రీని మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికలపై చర్చించేందుకు శ్రీనివాసన్ నాగపూర్‌లో శరద్‌పవార్‌తో కూడా సమావేశమైనట్లు తెలిసింది. ఇక రాజకీయాల్లో భిన్న ధ్రువాలే అయినా రాజీవ్ శుక్లాను అధ్యక్షుడిని చేసేందుకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈస్ట్‌జోన్ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లు తెలిసింది.