breaking news
hundreds
-
కొండను కదిలించడం అంటే ఇదే!
వందేళ్ల పురాతనమైన ఇటుక కట్టడం.. 44 వేల చదరపు అడుగుల నిర్మాణం.. 8270 టన్నుల బరువు.. చిన్నసైజు కొండలా ఉంటుంది. కానీ.. మనిషి సంకల్పం ముందు మాత్రం దూదిపింజె చందంగా తేలికగా మారిపోయింది. ఇటు నుంచి అటుకు.. కొంత సమయం తరువాత అటు నుంచి ఇటుకు వచ్చేసింది. చైనాలో జరిగిందీ అద్భుతం. భూగర్భంలో ఓ షాపింగ్ సెంటర్ కట్టేందుకు అడ్డుగా ఉందని.. షాంఘైలోని హయాన్లీ షికుమెన్ భవనాన్ని చెక్కు చెదరకుండా పక్కకు తరలించారు. మల్టీ లెవల్ అండర్‌గ్రౌండ్ షాపింగ్ మాల్ నిర్మాణం పూర్తి కాగానే యథాతథ స్థితికి చేర్చేశారు.వివరాలు... ఇప్పుడంటే మాయమయ్యాయి కానీ.. ఒకప్పుడు చైనాలో నడవా ఇళ్లు భారీ ఎత్తునే ఉండేవి. నడవ ఇల్లు అంటే అర్థం కాకపోతే.. విశాలమైన సెంట్రల్ కోర్టు ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అనుకోండి. 1920, 30లలో కట్టిన ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఈ హుయాన్లీ షికుమెన్ కాంప్లెక్స్. కాలం మారిపోయింది. షాంఘై మహా నగరమైంది. ప్రజల అవసరాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్టుగా ఈ కాంప్లెక్స్ ఉన్న చోట ఓ భారీ భూగర్భ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్రభుత్వం తీర్మానించింది. అయితే వందేళ్ల చరిత్ర ఉన్న హుయాన్లీ కాంప్లెక్స్‌ను కూల్చేసేందుకు స్థానిక ప్రభుత్వానికి మనసు రాలేదు. దాన్ని కాపాడుకుంటూనే అండర్‌గ్రౌండ్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేద్దామని తీర్మానించారు.ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకున్న షాంఘై కన్స్ట్రక్షన్ నెం:2 సంస్థ భవనాన్ని నఖశిఖ పర్యంతం పరిశీలించి.. త్రీడీ స్కానింగ్ చేసి... పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తరలించాలని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తరువాత మళ్లీ ముందు ఉన్న చోటికి తెచ్చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అత్యాధునిక కృత్రిమ మేధ సాయంతో పనిచేసే డ్రిల్లింగ్ రోబోలు రంగంలోకి దిగాయి. మట్టికి, నిర్మాణానికి మధ్య తేడాను స్పష్టంగా అర్థం చేసుకోగల ఈ రోబోలు భవనం చుట్టూ ఒక పద్ధతి ప్రకారం తవ్వడం మొదలుపెట్టాయి. అడుగుభాగంలోకి చేరి ఒక్కటొక్కటిగా 432 హైడ్రాలిక్ వాకింగ్ రోబోలను నిలిపాయి.ఒక్కోటి పది టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్నవి. సెన్సర్ల సాయంతో పీడనం, కంపనలు వంటివి గుర్తిస్తూ వాకింగ్ రోబోలు అన్నీ సమన్వయంతో నెమ్మదిగా కదలుతూ భవనం మొత్తాన్ని పక్కనున్న ఖాళీస్థలంలో ఏర్పాటు చేసిన ర్యాంప్‌పైకి చేర్చాయి. ఒక రోజుకు కేవలం 33 అడుగుల దూరం మాత్రమే ప్రయాణిస్తూ... భవనం చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2023లో మొదలైన ఈ తరలింపు కొద్ది రోజుల్లోనే ముగిసింది కానీ.. ఆ తరువాత ఖాళీ స్థలంలో అండర్‌గ్రౌండ్ షాపింగ్ కాంప్లెక్స్‌తోపాటు ఒక భూగర్భ మెట్రో రైలు స్టేషన్, పార్కింగ్ ఏర్పాట్లు వంటివన్నీ పూర్తి చేశారు. ఈ ఏడాది మే నెల 19న హుయాన్లీ కాంప్లెక్స్‌ను మళ్లీ యథాతథ స్థితికి తీసుకొచ్చే పని మొదలై 19 రోజుల్లోనే ముగించారు. జూన్ ఏడవ తేదీకల్లా భవనం తన సొంత పునాదులపై నిలిచింది.ఇదే తొలిసారా?ఊహూ కానేకాదు. భారీ భవంతులను పక్కకు జరిపడం గతంలోనూ చాలాసార్లు జరిగింది. 1985లో టెక్సస్‌లోని సాన్ ఆంటోనియలో ఉండే ఫెయిర్‌మౌంట్ హోటెల్ను కూడా ఆరు బ్లాకుల దూరం కదిలించారు. భారీ క్రేన్, డంప్ ట్రక్కుల సాయంతో జరిగిందీ తరలింపు. చక్రాలపై కదిలిన అతి భారీ భవంతిగా ఇప్పటికీ గిన్నిస్ రికార్డు కొనసాగుతోంది. దీని బరువు 14.5 లక్షల కిలోలు లెండి!1930లో ఇండియానా బెల్ అనే టెలిఫోన్ కంపెనీ ఏడు అంతస్తుల తన ప్రధాన కేంద్ర భవనాన్ని ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకు మళ్లించడం కూడా ఒక రికార్డే. పైగా ఇలా ఈ భవనాన్ని తిప్పేస్తున్నప్పుడు దాంట్లో కార్యకలాపాలు ఏ మాత్రం నిలిపివేయకపోవడం ఇంకో విశేషం! 1962లో చైనా కూడా సుమారు 22 అంతస్తుల భవనం ఒకదాన్ని 90 డిగ్రీల మేరకు పక్కకు తిప్పేయడం కొసమెరుపు!- గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
విశాఖ: వందేళ్ల చరిత్ర సాక్ష్యానికి రక్షాబంధన్ (ఫొటోలు)
-
మూడేళ్లు సెంచరీ చేయకపోయినా సచిన్ కంటే కోహ్లినే బెటర్..!
టీమిండియా తాజాగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ముడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా కప్-2022లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో శతక్కొట్టిన కోహ్లి.. అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని, ఓవరాల్‌గా 71 శతకాన్ని నమోదు చేశాడు. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 1020 రోజుల పాటు మూడంకెల స్కోర్ చేయకపోయినా గణాంకాల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. కోహ్లి మూడేళ్లకు పైగా సెంచరీ సాధించకపోయినా, సచిన్ కంటే ఓ ఇన్నింగ్స్ ముందుగానే తన 71వ శతకాన్ని నమోదు చేయడం మరో విశేషం. సచిన్ 71 శతకాల మార్కును 523 ఇన్నింగ్స్‌ల్లో చేరుకోగా.. కోహ్లి 522 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ శతకాలను పూర్తి చేశాడు. 71 సెంచరీల తర్వాత మిగతా గణాంకాల్లోనూ కోహ్లి.. సచిన్ కంటే కాస్త మెరుగ్గానే ఉన్నాడు. సచిన్ 71 సెంచరీలు నమోదు చేసే క్రమంలో 49.51 సగటున 23,274 పరుగులు సాధించగా.. కోహ్లి ఇదే మార్కును చేరుకునే క్రమంలో 53.81 సగటున 24,002 రన్స్ స్కోర్ చేశాడు. అర్ధసెంచరీల విషయంలోనూ కోహ్లి.. సచిన్ కంటే మెరుగ్గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 523 ఇన్నింగ్స్‌ల తర్వాత సచిన్ 107 హాఫ్ సెంచరీలు సాధించగా.. కోహ్లి 124 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ఇవే కాకుండా స్ట్రయిక్ రేట్ ఇతరత్రా గణాంకాల్లోనూ కోహ్లి.. సచిన్‌తో పోలిస్తే కాస్త బెటర్‌గానే ఉన్నాడు. కాగా, కేవలం గణాంకాల్లో మెరుగ్గా ఉన్నాడని సచిన్ కంటే కోహ్లి అత్యుత్తమ ఆటగాడని చెప్పలేని పరిస్థితి. ఇద్దరు తమతమ హయాంలో అత్యుత్తమ ఆటగాళ్లన్నది కాదనిలేని సత్యం. కోహ్లి గణాంకాల పరంగా ప్రస్తుతం సచిన్ కంటే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ.. సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల మార్కు అందుకోవడం కోహ్లికి అంత ఈజీ కాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 33 ఏళ్ల వయసున్న కోహ్లి మరో మూడు నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడినా హండ్రెడ్ హండ్రెడ్స్ మార్కును అందుకోలేడని సచిన్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. చదవండి: కెప్టెన్లంతా ఔట్.. ఒక్క కేన్ మామ తప్ప..! -
భారీగా ఉద్యోగులపై వేటువేస్తున్నవిప్రో
న్యూఢిల్లీ: దేశంలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ విప్రో కూడా ఉద్యోగులపై భారీగా వేటు వేయనుంది. వార్షిక "పనితీరు అంచనా" లో భాగంగా వందల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. సుమారు 600 మంది ని ఇంటికి పంపించనుంది. అయితే ఈ సంఖ్యంగా మరింత పెరిగనుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సంఖ్య 2వేలమంది కంటే ఎక్కువే ఉండొచ్చని సమాచారం. అయితే దీనిపై స్పందించిన విప్రో రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఈ తొలగింపులని పేర్కొంది. తన క్లయింట్ రిక్వైర్మెంట్స్, సంస్థ వ్యూహాత్మక ప్రాధాన్యతలను బట్టి ఉద్యోగులను క్రమబద్ధీకరించే క్రమంలో "కఠినమైన పనితీరును అంచనా వేసే ప్రక్రియ" నిర్వహిస్తామని తెలిపింది. ఈసమగ్రమైన పనితీరు అంచనా ప్రక్రియలో ఉద్యోగుల మార్గదర్శకత్వం, పునః శిక్షణ, అప్ స్కిల్లింగ్ కూడా ఉంటుందని చెప్పింది. అలాగే సంస్థ నుంచి కొందరు ఉద్యోగులపై వేటుకు దారితీయవచ్చని ఈ సంఖ్య సంవత్సర సంవత్సరానికి మారుతూ ఉంటుందని తెలిపింది. అయితే ఎంతమందిని తొలగించిందీ స్పష్టం చేయలేదు. కాగా డిసెంబరు 2016 చివరి నాటికి, బెంగళూరుకు చెందిన కంపెనీకి 1.79 లక్షల ఉద్యోగులు ఉన్నారు. ఏప్రిల్ 25 న నాలుగవ త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించనుంది.