Hospital toilets Kamod
-
ఆస్పత్రి మరుగుదొడ్డిలో ప్రసవం!
చెన్నై , టీ.నగర్: ఆస్పత్రి మరుగుదొడ్డిలో పండంటి శిశువుకు జన్మనిచ్చింది ఓ గర్భిణి. ఏమైందో తెలీదు ఆ శిశువుకు అక్కడే వదిలివెళ్లింది. ఈ సంఘటన చెన్నై సమీపంలో గురువారం జరిగింది. వివరాలు.. చెన్నై చూలైమేడులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి గురువారం రాత్రి ఓ నిండు గర్భిణి వచ్చింది. ఆమెతోపాటు ముగ్గురు స్త్రీలు, ఒక పురుషుడు ఉన్నారు.ఆమె పేరు, చిరునామా నమోదు చేసిన తర్వాత డాక్టర్ పరీక్షలు జరిపారు. తర్వాత ఆ గర్భిణి మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లింది. ఆమె అక్కడే బిడ్డను ప్రసవించింది. తర్వాత ఒక బకెట్‌ను శిశువుపై మూసి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. ఆమె వెంట వచ్చినవారు వైద్య సిబ్బందితో ఉదయం మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున మరుగుదొడ్డిలో నుంచి శిశువు కేకలు వినిపించాయి. ఆస్పత్రిలో ఉన్న జెమిమా అనే మహిళ మరుగుదొడ్డికి వెళ్లి చూసింది. అక్కడ బక్కెట్ కింద మగ శిశువు ఉండడంతో చూలైమేడు పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి వచ్చి విచారణ జరిపారు. శిశువు ఆస్పత్రి సిబ్బంది సంరక్షణలో ఉన్నాడు. విచారణలో శిశువు తల్లికి వివాహం కాలేదని, ఆమె మహిళా న్యాయవాదని తెలిసింది. -
ఆడపిల్లని చంపేశారు..
మరుగుదొడ్డి కమోడ్‌లో కుక్కేశారు.. విజయవాడ (లబ్బీపేట): కడుపు నొప్పి అంటూ అర్ధరాత్రి సమయంలో చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మహిళ గుట్టు చప్పుడు కాకుండా టాయిలెట్లో ప్రసవించి బిడ్డను కమోడ్‌లో కుక్కేసిన దారుణ ఘటన మంగళవారం రాత్రి విజయవాడలో జరిగింది. మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటలకు ఓ మహిళ 108 సిబ్బంది సాయంతో రాత్రి 1.50 గంటలకు ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భిణిగా గుర్తించి ఆమెతో ఉన్న వారిని మరో ప్రాంతంలో ఉన్న ప్రసూతి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఆ సమయంలో ఆమె సిబ్బందిని ఏమార్చి టాయిలెట్‌కు వెళ్లి ప్రసవించి పుట్టిన ఆడశిశువును కమోడ్‌లో కుక్కేసింది. కొద్దిసేపటికి బయటకు వచ్చి 2.52 గంటలకు మరో ప్రాంతంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లేందుకు 108కు ఫోన్ చేయగా, సమీపంలోని రామవరప్పాడులో ఉన్న వాహనం వచ్చి ఆమెను వేకువన 3.50 గంటల సమయంలో ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం 7.45 గంటల సమయంలో ఆస్పత్రి టాయిలెట్స్ కమోడ్‌లో శిశువు మరణించి ఉన్నట్లు అక్కడి సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.