ఆడపిల్లని చంపేశారు.. | Toilet In the Gave birth to a child To Kamod In Terrible event | Sakshi
Sakshi News home page

ఆడపిల్లని చంపేశారు..

Jul 30 2015 3:33 AM | Updated on Sep 3 2017 6:24 AM

కడుపు నొప్పి అంటూ అర్ధరాత్రి సమయంలో చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మహిళ గుట్టు చప్పుడు కాకుండా టాయిలెట్‌లో ప్రసవించి బిడ్డను కమోడ్‌లో...

మరుగుదొడ్డి కమోడ్‌లో కుక్కేశారు..
విజయవాడ (లబ్బీపేట): కడుపు నొప్పి అంటూ అర్ధరాత్రి సమయంలో చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మహిళ గుట్టు చప్పుడు కాకుండా టాయిలెట్‌లో ప్రసవించి బిడ్డను కమోడ్‌లో కుక్కేసిన దారుణ ఘటన మంగళవారం రాత్రి విజయవాడలో జరిగింది. మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటలకు ఓ మహిళ 108 సిబ్బంది సాయంతో రాత్రి 1.50 గంటలకు ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భిణిగా గుర్తించి ఆమెతో ఉన్న వారిని మరో ప్రాంతంలో ఉన్న ప్రసూతి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

ఆ సమయంలో ఆమె సిబ్బందిని ఏమార్చి టాయిలెట్‌కు వెళ్లి ప్రసవించి పుట్టిన  ఆడశిశువును కమోడ్‌లో కుక్కేసింది. కొద్దిసేపటికి బయటకు వచ్చి 2.52 గంటలకు మరో ప్రాంతంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లేందుకు 108కు ఫోన్ చేయగా, సమీపంలోని రామవరప్పాడులో ఉన్న వాహనం వచ్చి ఆమెను వేకువన  3.50 గంటల సమయంలో  ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం 7.45 గంటల సమయంలో ఆస్పత్రి టాయిలెట్స్ కమోడ్‌లో శిశువు మరణించి ఉన్నట్లు అక్కడి సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement