breaking news
Holy Water
-
ఆ పవిత్ర జలంతో అత్యంత ప్రమాదం..!
ఇది ఒక ప్రార్థన మందిరంలోని పవిత్రమైన బావి. శతాబ్దాలుగా వేలాది మంది భక్తులు ఇథియోపియాలోని ‘బెర్మెల్ జార్జిస్’ అనే ఈ బావిలోని నీటిని తాగితే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతున్నారు. కాని, ఇప్పుడు ఉన్న రోగాలు నయం కాకపోగా, కొత్త రోగాలను తెప్పిస్తోంది ఈ పవిత్ర జలం. తాజాగా శాస్త్రవేత్తలు ఈ పవిత్ర జలం కారణంగానే యూరప్‌లో కలరా వ్యాధి వ్యాపిస్తోందని గుర్తించారు. యూరప్ దేశాల నుంచి కొందరు భక్తులు ఇటీవలే ఇథియోపియాకు ప్రయాణించి, ఈ బావిలోని నీటితో చేతులు, ముఖం కడుక్కుని, అదే నీటిని తాగారట! యూరప్‌లో వ్యాపించిన కలరా కేసులను పరీక్షించిన వైద్య పరిశోధకులకు బాధితులే ఈ సంగతి చెప్పారు. ఆ నీటిని పరీక్షించగా, అందులో విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటంతో నీరు తీవ్రంగా కలుషితమైందని తేలింది. ఈ కారణంగానే బాధితులందరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. అదృష్టం కొద్దీ స్థానిక ప్రభుత్వాలు ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టి, అదుపులోకి తెచ్చాయి. ఇకపై ఎవరైనా ఆ పవిత్ర స్థలంలోని నీటిని ఉపయోగించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.(చదవండి: మీరు ఇంట్రావర్టా..? ఎక్స్‌ట్రావర్టా..? చిటికెలో చెప్పే ట్రిక్ ఇదిగో..) -
ఇంటి నుంచే కుంభమేళా స్నానం.. ఎలాగంటే..
మహా కుంభమేళా హిందువులకు పెద్ద పండుగలాంటిది. కుంభమేళా సమయంలో హిందువులు త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని అనుకుంటారు. తద్వారా తాము చేసిన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. అయితే పలు కారణాల దృష్ట్యా అందరికీ కుంభమేళాకు వెళ్లే అవకాశం లభించదు. అలాంటప్పుడు చింతించకుండా ఉండేందుకు ఒక మార్గాన్ని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు.కుంభమేళాకు వెళ్లే అవకాశం లేనివారు ఈ మేళాకు వెళ్లినవారిని అడిగి కుంభమేళా జలాలను తీసుకోవాలని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సూచించారు. ఆ నీటిని మీ ఇంటిలోని నీటి బకెట్లో వేసుకుని, ఆ నీటితో స్నానం చేయాలని తెలిపారు. ఇలా చేయడం ద్వారా కుంభస్నానం చేసినంతటి ఫలితాలనే పొందుతారని శంకరాచార్య స్వామి అన్నారు. మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతం నుంచి నీటిని, ప్రసాదాన్ని పంపేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాటిని సంప్రదించి మన ఇంటికి నీటిని తెప్పించుకోవచ్చని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సూచించారు. ‘త్రివేణి సంగమ్ వాటర్ డెలివరీ సర్వీస్’ కుంభమేళా నుండి నీటిని ఇంటికి నేరుగా డెలివరీ చేస్తోందని తెలిపారు.ఏదైనా కారణం చేత మహా కుంభమేళా నీటిని మీరు పొందలేకపోతే మీ ఇంట్లో ఉంచుకున్న గంగా జలంలోని కొన్ని చుక్కలను బకెట్లో కలుపుకుని స్నానం చేయడం ద్వారా కూడా పుణ్యం పొందవచ్చని శంకరాచార్య స్వామి తెలిపారు. ఇలా స్నానం చేసిన తరువాత దానధర్మాలు చేయడం ఉత్తమఫలితాలనిస్తుందని తెలియజేశారు.ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: ఒక్కో ఘాట్‌కు ఒక్కో ప్రత్యేకత.. విశేష ఫలితం -
నాగోబా జాతర నిర్వహణకు తొలి అడుగు
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర నిర్వహణకు తొలి అడుగు పడింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించే నాగోబా మహా పూజకు గంగాజలం కోసం మెస్రం వంశీయులు ఆదివారం బయల్దేరి వెళ్లారు. ఏడు రోజులపాటు మెస్రం వంశీయులున్న గ్రామాల్లో నాగోబా మహాపూజ, గంగాజలం సేకరణపై ప్రచారం నిర్వహించి కేస్లాపూర్ చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు అదివారం కేస్లాపూర్ గ్రామానికి చేరి నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ ఆధ్వర్యంలో సమావేశమై గంగాజలం పాదయాత్ర, నాగోబా మహాపూజ నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఝరి (కలశం) దేవతకు మెస్రం వంశీయులు, మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం గంగాజలం సేకరణ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు బుందో పట్టగా... మెస్రం వంశీయులు కానుకలు వేసి ముందుకు సాగారు. -
పవిత్ర జలంలో బ్రాందీ కలిపేశారు
సాక్షి, ప్యారిస్: ప్రాంక్ వీడియోల పేరిట కొందరు ఎదుటివారికి తెలీకుండా సరదా చేష్టలను వీడియోలు తీయటం, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి హిట్లు తెచ్చుకోవటం చేస్తుంటారు. అలాంటి కొంటె బ్యాచ్ ఒకటి ఫ్రాన్స్ లోని ఛట్యూ-ఛలోన్ పట్టణంలోని ఓ చర్చిలో చేసిన పని ఇప్పుడు కలకలం రేపుతోంది. జురా చర్చిలో పవిత్ర జలంతో నిండి ఉండే రెండు ఫౌంటెన్లలో(తొట్టి) మద్యం కలిపేశారు. ఇది గమనించిన కొందరు టూరిస్ట్‌లు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా... హుహాహుటిన వాటిని ఖాళీ చేయించి శుభ్రపరిచారు. ఆగష్టు చివరి వారంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. దీనిని ఎవరూ చేశారు? ఎందుకు చేశారు? అన్నదానిపై స్పష్టత లేకపోయినా... సరదా కోసం ప్రాంక్‌స్టర్లు ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేను ఫౌంటెన్ పక్క నుంచి వెళ్తుండగా ముందు మందు వాసన వచ్చింది. పవిత్ర జలాన్ని స్వీకరించినప్పుడు అది ఆల్కాహాల్ అన్న విషయం స్పష్టమైంది. అయితే అది అనవాయితీ కావొచ్చేమోననుకుని అధికారులను అడిగాను. తర్వాతే అసలు విషయం అర్థమైంది అని ఓ సందర్శకుడు వ్యాఖ్యానించారు. ఘటనపై చర్చి అధికారి పౌలిన్ స్పందించారు. ఒక లీటర్ బ్రాందీని రెండు తొట్టిలలో పోసేశారు. దీనికి కారకులను త్వరలోనే పట్టుకుంటాం అని ఆయన చెప్పారు.