-
అవతార్-2 అరుదైన రికార్డ్.. రెండు వారాల్లోనే ఆ చిత్రాన్ని దాటేసింది..!
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’. డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియాలోనూ ఓ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోందీ చిత్రం. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సముద్రం అడుగున ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించడం కామెరూన్‌కే సాధ్యమనేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: అవతార్-2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ రేట్స్) తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వన్ బిలియన్ డాలర్ల టికెట్ల అమ్మకాల మార్క్‌ను అవతార్-2 అధిగమించింది. కేవలం 14 రోజుల్లో ఈ మార్క్‌ను దాటేసింది కామెరూన్ విజువల్ వండర్. జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాన్ని అధిగమించి 2022లో రెండో అత్యధిక గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. 2022లో విడుదలైన మూడు సినిమాలు మాత్రమే వన్ బిలియన్ డాలర్ల మార్కును అధిగమించాయి. అవతార్: ది వే ఆఫ్ వాటర్‌తో పాటు టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్: మావెరిక్ (31 రోజులు), క్రిస్ ప్రాట్ మూవీ జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఈ మార్క్ చేరుకోవడానికి నాలుగు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. 2019లో విడుదలైన తొమ్మిది సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లను అధిగమించాయి. 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ మూవీ తర్వాత అవతార్- 2 అత్యంత వేగంగా ఈ మార్క్‌ను చేరుకుంది. స్పైడర్ మ్యాన్ చిత్రం కేవలం 12 రోజుల్లోనే అధిగమించి మొదటిస్థానంలో ఉంది. ఇప్పటివరకు కేవలం ఆరు సినిమాలు మాత్రమే మొదటి రెండు వారాల్లో వన్ బిలియన్ చేరుకున్నాయి. (ఇది చదవండి: సెన్సేషన్‌గా అవతార్ 2.. ఇండియాలో ఎంత వచ్చిందంటే?) అవతార్ 2 ఇప్పటివరకు ఉత్తర అమెరికాలో 317.1 మిలియన్ డాలర్లు, విదేశాల్లో 712.7 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 1.025 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. జురాసిక్ వరల్డ్ డొమినియన్ 1.001 బిలియన్ డాలర్లను అధిగమించి రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది అవతార్-2. ప్రస్తుతం అంచనాల ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి మరోసారి పుంజుకోనుంది. అవతార్-2 ప్రధాన థియేట్రికల్ మార్కెట్ అయిన చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలు ఆంక్షల రష్యాలో చిత్రానికి ఆదరణ తగ్గింది. -
23 ఏళ్ల తర్వాత డ్రీమ్ నెరవేరింది!
లాస్ ఏంజిల్స్: 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. ఐదు నామినేషన్లు. అయినా అందకుండా ఊరిస్తున్న ఆస్కార్. ఎట్టకేలకు 'టైటానిక్' హీరో లియోనార్డో డికాప్రియో కల నెరవేరింది. థ్రిల్లర్ డ్రామా 'ద రెవెనంట్' సినిమాలో చూపిన తన నటవిశ్వరూపానికిగాను డికాప్రియో ఉత్తమ నటుడిగా ఆస్కార్ ట్రోపీని అందుకున్నాడు. 'రెవెనంట్' సినిమాలో పగ తీర్చుకునే ఫర్ ట్రాపర్ పాత్రలో అసాధారణ అభినయాన్ని చూపిన డికాప్రియో అకాడమీ పురస్కారాన్ని అందుకొని భావోద్వేగంతో ప్రసంగించాడు. సినిమా దర్శకుడు ఇనారితు, సహ నటుడు టామ్ హార్డీతోపాటు చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రకృతి ప్రేమికుడైన డిక్రాపియో ఈ సందర్భంగా పర్యావరణ అంశాన్ని ప్రస్తావించాడు. 'సహజమైన ప్రపంచంతో మనిషి అనుబంధాన్ని మా 'రెవెనంట్' సినిమా చాటింది. వాతావరణం మారుతున్న సంగతి వాస్తవం. ఇది ప్రస్తుతం జరుగుతోంది. మన భూగోళంపై ప్రభావం చూపుతోంది. యావత్ జీవకోటి ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పు ఇది. దీనిని అడ్డుకునేందుకు మనం అందరం కృషి చేయాల్సిన అవసరముంది' అని డికాప్రియో పేర్కొన్నాడు. డికాప్రియో 'రెవెనంట్' సినిమా బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు తన ఖాతాలో వేసుకున్నా.. అనూహ్యంగా 'స్పాట్ లైట్' సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్ ను ఎగరేసుకుపోవడం గమనార్హం.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement