-
1948 .. హైదరాబాద్‌పై ఆపరేషన్ పోలో (ఫొటోలు)
-
అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఆ రోజు మువ్వన్నెల జెండా రెపరెపలాడలేదు. దేశమంతా స్వాతంత్య్రోత్సవాలు వెల్లివిరిసిన 1947 ఆగస్టు 15న హైదరాబాద్‌లో జాతీయోద్యమ నేతలు, కాంగ్రెస్ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు రహస్యంగానే తమ దేశభక్తిని చాటుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన జాతీయోద్యమానికి దీటుగా హైదరాబాద్‌లోనూ మహత్తరమైన స్వాతంత్య్ర పోరాటాలు జరిగాయి. న గరంలోని అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బొగ్గులకుంట, ట్రూప్‌బజార్, కుందన్‌బాగ్ వంటి ప్రాంతాలు స్వాతంత్య్రోద్యమ నినాదాలతో మార్మోగాయి. గాంధీజీ పిలుపు మేరకు స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను చేపట్టారు. ఇదంతా ఒకవైపు అయితే భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పేరొందిన సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్‌లోనూ ఉవ్వెత్తున ఎగిసిపడింది. బ్రిటిష్ వలస పాలనను, ఆధిపత్యాన్ని ప్రతిఘటించింది. ఒప్పందంపై నిరసన... అప్పటి నిజాం నవాబు 1800 బ్రిటిష్ ప్రభుత్వంతో సైనిక సహకార ఒప్పందం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మేరకు బ్రిటిష్ అధికార ప్రతినిధికి హైదరాబాద్‌లో రెసిడెన్సీ (కోఠి)ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే ఏడాది అక్టోబర్ 12 నుంచి సహకార ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటికే జాతీయ భావాలతో చైతన్యం పొందిన యువత బ్రిటిష్ ఆధిపత్యం పట్ల తమ వ్యతిరేకతను చాటుకుంది. అదే సమయంలో బెంగాల్ సహా దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలకుల వ్యతిరేకంగా మొదలైన వహాబీ ఉద్యమం నగరంలోని ఉద్యమకారులను ప్రభావితం చేసింది. అప్పటి నిజాం నవాబు నసీరుద్దౌలా సోదరుడు ముబారిజ్ ఉద్దౌలా నగరంలో వహాబీ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 20 వేల మంది వహాబీ ఉద్యమకారులతో బ్రిటిష్ అధికార ప్రతినిధిపై దాడికి ప్రయత్నించాడనే ఆరోపణలపై నిజాం ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి 1854లో చనిపోయే వరకు కోటలోనే బంధించారు. చదవండి: ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి.. నగరంలో 1857 అలజడి.. మీరట్, లక్నో తదితర ప్రాంతాల్లో సిపాయిలు చేపట్టిన తిరుగుబాటు హైదరాబాద్‌లో పెద్దఎత్తున అలజడిని సృష్టించింది. అప్పటికే ముబారిజ్‌ద్దౌలా మృతితో ఆగ్రహంతో ఉన్న ఉద్యమకారులు బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటును చేపట్టేందుకు వచ్చాడనే ఆరోపణలతో జమేదార్ చీదాఖాన్‌ను అరెస్టు చేశారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వంపై ఉద్యమకారుల వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. జమేదార్ తుర్రెబాజ్‌ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్‌ల నేతృత్వంలో సుమారు 500 మంది రొహిల్లాలు 1857 జూలై 17వ తేదీన బ్రిటిష్ రెసిడెన్సీ కోఠిపై దాడి చేశారు. బ్రిటిష్ సైనికుల ప్రతిఘటనతో ఇది విఫలమైంది. ‘బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమివేయడమే తమ లక్ష్యమని’ తుర్రెబాజ్ ఖాన్ ప్రకటించడంతో అరెస్టు చేసి జీవిత ఖైదు విధించింది. జైలు నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో పోలీసులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. అతని శవాన్ని జోగిపేట వద్ద బహిరంగంగా వేలాడదీసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ♦ఇలా నగరంలో జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చింది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం. -
పురానా హవేలీ
నాలుగొందల ఏళ్లు పైబడిన హైదరాబాద్ నగర చరిత్రకు సాక్షిగా... నాటి రాచరికపు వైభవానికి ప్రతీకగా... కుతుబ్‌షాహీల ప్రధాన మంత్రి నివాస గృహంగా... నేటికీ అలనాటి సిరులొలికిస్తోంది ‘పురానా హవేలీ’. సాలార్జంగ్ మ్యూజియంకు సమీపంలో ఉన్న ఈ ప్యాలెస్... సందర్శకులెందర్నో ఆకర్షిస్తోంది. ఐదో కులీకుతుబ్‌షా నవాబ్ మహ్మద్‌కులీ పాలనా కాలం (1580-1612) నాటిది ‘పురానా హవేలీ’. కుతుబ్‌షాహీల ప్రధానమంత్రి మీర్ మోమీన్ నివాస గృహంగా ఈ ప్యాలెస్ ప్రతీతి. ప్యాలెస్ చుట్టూ సుమారు మైలు దూరం పొడవున, దృఢమైన ఎత్తయిన ప్రహరీ నిర్మించారు. రెండో నిజాం, నవాబ్ మీర్ నిజాం అలీఖాన్ తన కుమారుడు సికిందర్జా కోసం ఈ ప్యాలెస్‌ను కొనుగోలు చేశారని చారిత్రక ఆధారాలున్నాయి. అనంతరం ఈ ప్యాలెస్‌లో పలు కొత్త భవన సముదాయాలను నిజాం నిర్మించారు. అయితే.. మూడో నిజాం ప్రభువుగా నవాబ్ సికిందర్జా సింహాసనం అధిష్టించాక (1803-1829) ఈ ప్యాలెస్‌లో ఆయన నివాసముండనే లేదు. ఆయన చార్మినార్ సమీపంలోని ఖిల్వత్ మహల్లో ఉన్నారు. దీన్నే చౌమొహల్లా అని కూడా పిలుస్తున్నారు. ఆ మాదిరిగా మూడో నిజాం ఖిల్వత్ మహల్లో ఉండటంతో, రెండో నిజాం ప్రభువు నివాసమున్న ఈ ప్యాలెస్‌కు పాత ప్యాలెస్ లేదా ‘పురానా హవేలీ’ అని స్థానికులు పిలవనారంభించారు. అయితే ఐదో నిజాం ప్రభువుగా సింహాసనం అధిష్టించిన నవాబ్ అఫ్జద్దౌలా... పురానాహవేలీ భవనాల్లోనే జన్మించారు. అలాగే, ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ తిరిగి పురానా హవేలీని తన అధికార నివాస గృహంగా చేసుకుని తన అధికార కార్యకలాపాలు నిర్వహించారు. పురానా హవేలీలో మొత్తం పదకొండు భవనాల సముదాయం ఉంది. ఇందులోని ప్రధాన భవనం 18వ శతాబ్దపు ఇండో-యూరోపియన్ ఆర్కిటెక్చర్‌కు ప్రతీకగా నిలుస్తుంది. ఆరో నిజాం ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారనేది చరిత్రకారుల అభిప్రాయం. ఆరో నిజాం కాలంనాటి పలు విశేష వస్తువుల ప్రదర్శనశాల ‘సిటీ మ్యూజియం’ కూడా ప్రస్తుత పురానా హవేలీ ప్రాంగణంలోనే ఉంది. ఎన్నో అద్భుత కళారీతుల ప్రదర్శనశాలగా ప్రఖ్యాతి చెందిన ఈ నిజాం మ్యూజియంను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. అయితే... నేడు పురానా హవేలీలోని పలు భవనాల్లో ముఖరంజా ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యా సంస్థలు నడస్తున్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్న పురానా హవేలీ... నేడు గొప్ప వారసత్వపు కట్టడంగా అలరారుతోంది. - మలాది కృషానంద్ malladisukku@gmail.com
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement