breaking news
Hindu prayer
-
పశ్చిమబెంగాల్ బీజేపీలో అసీమానంద!
కోల్‌కతా: హైదరాబాద్‌లో 2007 మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో ఇటీవల నిర్దోషిగా విడుదలైన హిందుత్వ బోధకుడు స్వామి అసీమానంద(66)పై పశ్చిమబెంగాల్ బీజేపీ దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్లో బీజేపీని పటిష్టం చేసేందుకు అసీమానంద సేవల్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, ఈ విషయమై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. ‘స్వామి అసీమానంద వ్యక్తిగతంగా నాకు చాలాకాలంగా తెలుసు. బెంగాల్‌కు వచ్చి పార్టీ కోసం పనిచేసే విషయమై ఆయనతో మాట్లాడతాను. అసీమానంద రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో గతంలో చాలాకాలం పనిచేశారు. ఆయన పార్టీకి చాలారకాలుగా ఉపయోగపడతారు’ అని వ్యాఖ్యానించారు. -
లక్ష్మీపూజ నిర్వహించిన హాలీవుడ్ సింగర్!
ప్రముఖ హాలీవుడ్ సింగర్ మిలీ సైరస్ హిందువుల సంప్రదాయమైన లక్ష్మీపూజను నిర్వహించింది. హిందువుల పద్ధతిలో సంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవి ఫొటో ముందు పూలు, పండ్లు అలకరించి.. అగరొత్తులు, జ్యోతులు వెలిగించి.. హల్వా ప్రసాదం సమర్పించి, భక్తిశ్రద్ధలతో ఆమె ఈ పూజ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రెండు ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. ఈ ఫొటోలను బట్టి లక్ష్మీపూజను నిర్వహించి ఉంటుంది లేదా లక్ష్మీపూజలో పాల్గొని ఉంటుందని భావిస్తున్నారు. ఫొటొను బట్టి పండితుడు పూజను నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సూపర్ బౌల్ 2017 క్రీడలకు మద్దతుగా లక్ష్మీదేవికి పూజలు చేసినట్టు ఆమె ఈ పోస్టులో పేర్కొనడం గమనార్హం. ఈ ఫొటోలో ఆమెకు తెలిసిన లేదా ఆమె ఆరాధించే పలువురు గురువుల ఫొటోలు కూడా ఉన్నాయి. #FruitBowl over Super......