breaking news
Heroine-oriented films
-
రచయిత్రి పాత్ర
హిందీలో తిరుగులేని తారగా నిలదొక్కుకుని హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచిన కథానాయిక విద్యాబాలన్. ఈ మలయాళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ తన మాతృభాషలో ఓ సినిమా చేయనున్నారు. ‘డర్టీ పిక్చర్’లో సిల్క్‌స్మిత పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన ఆమె తాజాగా ఈ మలయాళ చిత్రంలో ఓ రచయిత్రి పాత్రలో ఒదిగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఆంగ్ల, మలయాళ రచయిత్రి కమలా సురయ్యా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. కమల్ అనే సీనియర్ దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ పాత్ర మూడు విభిన్న కోణాల్లో సాగుతుందట. -
హార్రర్ చిత్రంలో నయన
ప్రస్తుతం కోలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా ఎదిగిన నటి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నయనతారనే. రాజారాణి చిత్రంలో ఆర్య, జయ్ ఇద్దరు హీరోలు ఉన్నా ఆ చిత్ర కథ నయనతార పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇటీవల మాయ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నయనతార నటించగా ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు దాని తరువాత ఆమె నటించిన తనీఒరువన్, నానుమ్ రౌడీదాన్ చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో హ్యాట్రిక్ సాధించిన నయనతార ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా పిలవబడుతున్నారు. తాజాగా మాయ చిత్రం తరహాలో మరో లేడీఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. యువ దర్శకుడు సర్గుణం సొంతంగా చిత్ర నిర్మాణం ప్రారంభించి తొలి ప్రయత్నంగా తన శిష్యుడు రాఘవన్ దర్శకత్వంలో మంజపై అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం విజయాన్ని అందుకుంది. తాజాగా మరో శిష్యుడి దర్శకత్వంలో నటి నయనతార ప్రధాన పాత్రలో చిత్రం చేయనున్నారు. దీనిగురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మంజపై వంటి సక్సెస్‌ఫు చిత్రం తరువాత ఏ సర్గుణం సినిమాస్ పతాకంపై నయనతార కథానాయకిగా చిత్రం నిర్మించనున్నానని తెలిపారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం కలవాణి నుంచి ఇటీవల తెరకెక్కించిన చండీవీరన్ వరకు తన వద్ద సహాయదర్శకుడిగా పని చేసిన దాస్ రామసామి ఈ చిత్రానికి కథ, ద ర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇది హార్రర్ నేపథ్యంలో సాగే వినోదం మేళవించి క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించే జనరంజక చిత్రంగా ఉంటుందని దర్శకనిర్మాత సర్గుణం అన్నారు. -
నాకు బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను!
ఈతరం కథానాయికల్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ చేసింది చార్మీనే! మిగతా తారలతో పోలిస్తే తను పూర్తి భిన్నంగా కనిపిస్తారు. ఓ పక్క గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోపక్క ఆత్మసంతృప్తినిచ్చే పాత్రల అన్వేషణలో ఉంటారామె. తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో ఆమె నటించిన ‘ప్రతిఘటన’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు. నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రం చేయడం మీకు కొత్త కానప్పటికీ, ‘ప్రతిఘటన’ మీకెలాంటి అనుభూతినిచ్చింది? ఇప్పటివరకు చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. శక్తిమంతమైన పాత్రికేయురాలి పాత్ర నాది. ఓ న్యూస్ చానల్ రిపోర్టర్ని అన్నమాట. ఇప్పటివరకు పాత్రికేయులు నన్ను తికమకపెట్టే ప్రశ్నలు అడిగేవారు. ఈ సినిమాలో నేనా పని చేశా. కొంచెం వెటకారంగా చికాకు పెట్టే ప్రశ్నలతో ఆడుకుంటానన్నమాట. భలే అనిపించింది. ఇది మీకు 50వ సినిమా కదా? అవును. ఇప్పటివరకూ 49 విడుదలలు చూశాను. అయినా ఏదో మొదటి సినిమా అప్పుడు ఉన్నంత టెన్షన్‌గా ఉంది. కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్లుగా ఉంది. ఈ ఒత్తిడి అంతా సినిమా ఏమవుతుందో ఏమోననే భయం వల్ల కాదు. ఎందుకంటే, ఇది తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో చేయడం ఎలా అనిపించింది? ఇలాంటి శక్తిమంతమైన చిత్రాలు తీయడానికి ఆయనే కరెక్ట్. తనకేం కావాలో మొహమాటం లేకుండా చెప్పేస్తారు. అలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు కాబట్టే, పాత్రను బాగా అర్థం చేసుకుని చేయడానికి కుదిరింది. సమాజంలో జరుగుతున్న పలు అన్యాయాల గురించి ఆయన ఈ సినిమాలో చర్చించిన తీరు అద్భుతం. ఈ సినిమా చేయడం ద్వారా మీరేం నేర్చుకున్నారు? ఇప్పటివరకు నేను ఓటు వేయలేదు. కానీ, ఈ ఎన్నికలకు తప్పకుండా ఓటేస్తా. ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో ఈ సినిమా చేసిన తర్వాత తెలిసింది. ఈ సందర్భంగా అందర్నీ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. 12 ఏళ్లలో 50 సినిమాలు పూర్తి చేశారు. ఇక మీ తరువాతి లక్ష్యం 100 సినిమాలపైనేనా? ఆ లక్ష్యం లేదు. నేనేదీ ప్లాన్ చేసుకోను. జీవితం ఎలా తీసుకువెళితే అలా వెళ్లిపోతాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌కే పరిమితం అవుతున్నారెందుకని? ఆ తరహా సినిమాలే చేయాలనే లక్ష్యంతో చేయడంలేదు. నేనే సినిమా చేసినా కథని దష్టిలో పెట్టుకునే చేస్తున్నాను. నేను వింటున్న కథల్లో ఇవి బాగున్నాయనిపిస్తోంది. అందుకే చేస్తున్నాను. రెగ్యులర్ సినిమాల్లో హీరోయిన్గా చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నా వయసు 25. ఇంకా బోల్డంత కెరీర్ ఉంది. కాబట్టి, నింపాదిగా సినిమాలు చేసుకోవచ్చు. కెరీర్ పరంగా వేగం తగ్గిందేమో అనిపిస్తోంది... నేను హీరోయిన్ అయ్యి పన్నెండళ్లవుతోంది. ఇన్నేళ్లూ ఎంతో బిజీగా సినిమాలు చేశాను. ఇప్పుడు రిలాక్స్ కావాలనిపిస్తోంది. ఒకప్పుడు డబ్బు కోసం సినిమాలు చేశాను. ఇప్పుడా అవసరంలేదు. ఆత్మసంతృప్త్తిని మిగిల్చే సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను తిరస్కరించిన సినిమాల జాబితా చాలానే ఉంది. పాతికేళ్లు వచ్చేశాయ్ కాబట్టి, పెళ్లి చేసుకోమని మీ ఇంట్లో తొందరపెట్టడంలేదా? ఎందుకు పెట్టరు? కొన్ని సంబంధాలు కూడా వస్తున్నాయి. పెళ్లి గురించి నేనింకా ఓ నిర్ణయానికి రాలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లేనా? ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లి కష్టమే. ఎందుకంటే, మనిషి ఎలాంటివాడో, మనస్తత్వం ఏంటో తెలియకుండా జీవితాన్ని పంచుకోలేను. అందుకే నాకు బాగా తెలిసిన వ్యక్తినే చేసుకుంటాను. ఎవరా వ్యక్తి? ఇంకా తారసపడలేదు. మీరిప్పుడు చేయనున్న చిత్రాలు? ‘మంత్ర 2’ ఓకే చేశాను.