helicopter sale
-
భవిష్యత్తులో సివిలియన్ హెలికాప్టర్లకు గిరాకీ
భారత్‌లో వచ్చే ఐదేళ్లలో సివిలియన్ హెలికాప్టర్ల సంఖ్య రెట్టింపు అవుతుందని ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ అంచనా వేసింది. మెడికల్ ఎమర్జెన్సీలు, డిజాస్టర్ రిలీఫ్, లా ఎన్ఫోర్స్మెంట్, టూరిజం రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఇందుకు కారణమని తెలిపింది. ఇది కీలకమైన సేవల కోసం హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని సూచిస్తుంది.ప్రస్తుత పరిస్థితులు ఇలా..దేశంలో ప్రస్తుతం 250 సివిల్ హెలికాప్టర్లున్నాయి. ఇది ప్రపంచ సివిలియన్ ఫ్లీట్‌లో సుమారు ఒకశాతంగా ఉంది. ఈ వాటా ప్రస్తుతానికి స్వల్పంగానే ఉన్నప్పటికీ దేశంలోని వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎయిర్‌బస్ హెలికాప్టర్లకు అపారమైన మార్కెట్ ఉంటుందని అంచనా వేస్తుంది. కొండ రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాల్లో హెలికాప్టర్ కార్యకలాపాలు అధికంగా ఉండే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికాతో భాగస్వామ్యానికి భారత్ సిద్ధంభారత ప్రభుత్వం కూడా ఈ సర్వీసులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రాంతీయ హెలికాప్టర్ సేవలతో సహా సరసమైన విమాన కనెక్టివిటీని అందించేందుకు ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రాజెక్టు సంజీవని ద్వారా మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా హెలిపోర్టులను ఏర్పాటు చేసేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఎయిమ్స్ రిషికేశ్‌లో హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీసులకు ఆదరణ పెరిగింది. ఇక్కడ ఎయిర్‌బస్ హెచ్ 125 హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలకోసం సిబ్బందిని, రోగులను తరలిస్తున్నారు. -
ఫేస్బుక్లో హెలికాప్టర్ సేల్... ధరెంతో తెలుసా?
వెరైటీ బ్యాంగిల్స్, డిజైనర్ డ్రస్‌లు వంటి వాటిని ఫేస్బుక్లో అమ్మకానికి పెడుతుండటం మనం చూస్తుటాం. కాని కొత్తగా దేశ రాజధాని పరిధిలో ఓ ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ డైరెక్ట్‌గా హెలికాప్టర్‌నే అమ్మకానికి పెట్టింది. ఫ్లాట్స్, ఫ్లాట్‌మేట్స్ పేరు మీదున్న ఈ ఫేస్బుక్ గ్రూప్‌లో 2009 మోడల్‌కు చెందిన హెలికాప్టర్‌ను అమ్మకానికి పెట్టారు. దీని ధర రూ.2.8 కోట్లగా ప్రకటించారు. ఆరు సీటర్లున్న ఈ హెలికాప్టర్, గంటకు 200-300 కిలోమీటర్లు పయనిస్తుందట. గంటలకు 60 లీటర్ల వరకు ఇంధనం ఖర్చువుతుందట. ఆసక్తి ఉన్న కస్టమర్లు వయా ఫేస్బుక్ ద్వారా తమ ఇన్‌బాక్స్‌లో నమోదుచేసుకోవాలని విక్రయదారుడు కోరాడు. సామాజిక మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన ఫేస్బుక్, వినియోగదారులను, అమ్మకందారులను అనుసంధానం చేయడానికి మార్కెట్ ప్లేస్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. చాలామందికి ఈ పేజీ వివరాలు తెలియనప్పటికీ, ఫేస్బుక్ ద్వారా ఇప్పటికే అమ్మక, కొనుగోలు జరుగుతున్నాయి. గుర్గావ్ నివాసితులకు సమీపవారు ఫ్లాట్స్ అండ్ ఫ్లాట్మేట్ ఫేస్బుక్ గ్రూప్‌ను ప్రారంభించారు. ఎలాంటి బ్రోకరేజ్ చార్జీలు చెల్లించకుండా ఫ్లాట్లను అద్దెకు ఇచ్చేందుకు, తీసుకునేందుకు ఈ పేజీ ఎంతో సహకరిస్తోందని గ్రూప్ ఓనర్లు చెబుతున్నారు. ఈ గ్రూప్‌లో ఇప్పటివరకు 65,131 సభ్యులున్నారు. ఫ్లాట్లను అద్దెకిచ్చే ఈ గ్రూప్‌లో హెలికాప్టర్ విక్రయానికి పెట్టడం విశేషం.