Heart Wrenching incident
-
Operation Sindoor ఎవరిని అడగాలి?
ఇంటి పనులూ బయటి పనులూ చింతలూ చిక్కులూ చికాకులూ రోజూ వుండేవే వాటికి కాస్త విరామమిస్తూ విహారానికని అపుడపుడు ఊరు దాటి బయటికి వెళ్లొస్తాం దూరమైనా ఈ పరి ఈ కాశ్మీరానికి వచ్చాం ముచ్చటపడి –ఏమంద మేమంద మేమందం అంటూ పచ్చగా మురిసిపోతూ మేం ఉల్లాసపడుతున్న వేళ అదాటున కాల్పులు! కళ్లెదుటే మా ఇంటి మనిషి క్షణాల్లో శవమయ్యాడు భూతల స్వర్గపు పచ్చదనం ఉన్నట్టుండి ధడేల్మని ఎరుపెక్కుతుందని తెలిస్తే అసలు ఇటు నిండు కుటుంబంగా వచ్చే వాళ్ళమా! నిండు మనిషిని పోగొట్టుకునే వాళ్ళమా! ఇపుడు మాకు ఏ అందాల సంబరాలొద్దు మా మనిషి మాక్కావాలి, తెచ్చిస్తారా ఊపిరితో –ఈ సరిహద్దు వివాదాలూ లోయలో కల్లోలాలూ తుపాకుల కవాతులూ పేలుళ్ళూ దాడులూ ఇక్కడి చరిత్రా మాకేం తెలుసు! మామూలు మనుషులంతుపాకులు, ఎదురు తుపాకులతోనే తలపడతాయని తలచాం కానీ... యాత్రికుల కన్నులను సైతం తుపాకుల్లా చూస్తాయని గుర్తించి మరీ గురి చూస్తాయని అనుకోలేదు! ఉన్నట్టుండి ఈ కొత్త చోటున మేం ఎవరికి ఇంతలోనే ఇంత బద్ధ శత్రువులమెట్లయ్యామో తెలియట్లేదు ముగ్గురం వచ్చి ఇపుడిద్దరమే ఇంటికెళ్తున్నాం మూడో మనిషేడని ఇల్లు కలవరపడుతూ అడుగుతుంది దాన్ని ఎట్లా ఓదార్చాలి? మా మనిషి లేడు నిట్రాడు లేదు మరింత బరువైపోయిన మా బతుకు! ఇపుడు ఎట్లా నిలబడేది క్షణ క్షణం భయం భయంగా వుంది మా బయటా మా లోపలా – కారణమెవరని ఇపుడు మేం ఎవ్వరినడగాలి?– దర్భశయనం శ్రీనివాసాచార్య ఇదీ చదవండి: కేన్స్లో తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో? -
తాలిబన్ల చెరలో అఫ్గన్: హృదయ విదారక దృశ్యాలు.. వైరల్
కాబూల్: అమెరికా సేనల ఉపసంహరణ, తాలిబన్ల అక్రమణ తరువాత అఫ్గానిస్తాన్ ఆరని చిచ్చులా రగులుతోంది. తాలిబన్లు అఫ్గాన్ భూభాగాలను ఆక్రమించుకోవడం మొదలు తాలీబన్ల హింస, ఆగడాలతో అఫ్గాన్ పౌరుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తంగా అఫ్గాన్ను తమస్వాధీనంలోకి తెచ్చుకున్నప్పటినుంచి పౌరుల ఆందోళన మరింత పెరిగింది. తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి ర్యాలీ అయ్యారు. మరోవైపు ఎలాగైనా దేశం విడిచి పారిపోయేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు వేలాదిగా తరలి వచ్చారు. వీరిని అణచివేసేందుకు తాలిబన్లు హింసను ప్రయోగించారు. తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. తుపాకీ మడమలు, రాడ్లు, కొరడాలతో జనాన్ని చితక బాదారు. ఈ క్రమంలో అనేక హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూశాయి. పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ షేర్ అవుతున్నాయి. బిడ్డలనైనా రక్షించాలని తల్లిదండ్రులు తమ చిన్నారులను కాబూల్ ఎయిర్పోర్టు వద్ద కంచెపైనుంచి బ్రిటన్, అమెరికా సైనికులకు అందించిన దృశ్యాలు. విదేశీ సైనికులు చంటిపాపలను లాలిస్తున్న తీరు కంటతడిపెట్టిస్తోంది. సైనికుల చేతుల్లోకి వెళ్లిన చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించామని అక్కడి అధికారులు చెప్తున్నారు. -
కేరళ ప్రమాద స్థలంలో విదారక దృశ్యం
తిరువనంతపురం: ఇడిక్కి జిల్లా మూనూరు సమీపంలోని రాజమలైలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడి తేయాకు తోటల్లో పని చేసే కార్మికులు శుక్రవారం జలసమాధి అయ్యారు. సుమారు 30 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. సహాయక బృందాల గాలింపులో శనివారం 22 మృతదేహాలు బయట పడగా, ఆదివారం 20, సోమవారం మరో 7 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 24 మంది కోసం అన్వేషణ సాగుతోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన నాటి నుంచి రెండు శునకాలు అదే ప్రాంతంలో తచ్చాడుతూ ఉన్నాయి. తమ యజమానులు కనిపించకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తున్నాయి. పగలూ రాత్రి తేడా లేకుండా ప్రమాదం జరిగిన చోటే పస్తులుంటూ గడుపుతున్నాయి. వాటి మౌన రోదనను అర్థం చేసుకున్న సహాయ సిబ్బంది వాటికి ఆహారాన్ని ఇచ్చినప్పటికీ అవి తినడానికి నిరాకరించాయి. (తవ్వేకొద్దీ శవాలు..! ) గాలింపు చర్యల్లో భాగంగా సిబ్బంది ఏదైనా శవాన్ని కనుగొని వాటిని బయటకు తీస్తే వెంటనే ఈ శునకాలు అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లి వాసన చూసి అవి తమ యజమాని కాదని నిరాశగా వెనక్కు వస్తున్నాయి. మృతదేహాన్ని వెలికి తీసిన ప్రతీసారి ఇదే తంతు జరుగుతోంది. ఇది చూసి కొంతమంది మనసు చలించిపోగా ఆ శునకాలను వారి ఇంటికి తీసికెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అవి అదే స్థలంలో శిలా విగ్రహంలా నిలబడుతూ రానని మొండికేశాయి. తమను పెంచిన వ్యక్తులు ఎప్పటికైనా తిరిగొస్తారేమో, ఎప్పటిలాగే వాటితో ఆడుకుంటారేమోనని దీనంగా ఎదురు చూస్తున్నాయి. ఈ దృశ్యం అక్కడి వారందరినీ కదిలించివేస్తోంది. మరోవైపు ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.5 లక్షలను, గాయపడ్డ వారికి వైద్య సాయం అందిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బాధితులు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్లో వెల్లడించారు. (కేరళలో వర్షబీభత్సం)