breaking news
health insurance fraud
-
ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ స్కామ్!
సాక్షి, అమరావతి: అక్రమార్జనే ధ్యేయంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆరోగ్య బీమా అమలులో స్కామ్‌కు రంగం సిద్ధమైంది! ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిన ప్రభుత్వ పెద్దలు బీమా విధానం పేరిట ఇన్సూరెన్స్ కంపెనీలకు నిధులు మళ్లించి భారీ అవినీతికి తెరతీసినట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా పచ్చ పార్టీ కార్యకర్తల బీమా సేవలో తరిస్తున్న కంపెనీకే వైద్యశాఖలో రూ.నాలుగు వేల కోట్ల విలువైన ఆరోగ్య బీమా కాంట్రాక్ట్‌ను కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల అస్మదీయ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి మళ్లించడం, ప్రీమియంపై భారీ మొత్తంలో కమీషన్ బ్రోకర్ ఏజెన్సీకి చెల్లించడం, ఏజెన్సీ నుంచి పెద్దలకు ముడుపులు చేరవేసేలా పావులు కదుపుతున్నారు. ఈ దోపిడీ పరంపరతో భారీ కుంభకోణానికి తెర తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతటా అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీ..ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా అమలులో ప్రభుత్వ పెద్దల అస్మదీయ బ్రోకర్ సంస్థ చక్రం తిప్పుతోంది. పచ్చ పార్టీ కార్యకర్తలకు బీమా సేవలు అందించే ఇన్సూరెన్స్ కంపెనీ, పార్టీకి మధ్య ఓ సంస్థ బ్రోకింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ గతేడాది కోటి మంది కార్యకర్తలకు రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా కోసం కేవలం రూ.42 కోట్లు ప్రీమియం చెల్లించేలా ఓ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిర్చింది. ప్రస్తుతం ఆ బ్రోకర్ ఏజెన్సీ ద్వారానే వివిధ శాఖల్లో బీమా అమలు స్కామ్‌ను ప్రభుత్వ పెద్దలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది విద్యుత్ శాఖలో ట్రాన్స్‌కో ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. రూ.100 కోట్ల విలువైన ఈ టెండర్‌ను తొలుత పచ్చ పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రోకర్ ఏజెన్సీకి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అయితే సాల్వెన్సీ నిబంధన, ప్రమాణాల కారణంగా ఆ బిడ్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో కోరినంత కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకుని మరో ఇన్సూరెన్స్ కంపెనీకి అడ్డదారుల్లో కాంట్రాక్టు ముట్టజెప్పారు. కాంట్రాక్టు దక్కించుకున్న బీమా సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసేందుకు టెండర్ల సమయంలో తిరస్కరణకు గురైన అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీని మళ్లీ రంగంలోకి దించారు. ఇన్సూరెన్స్ సంస్థకు, ఉద్యోగులకు మధ్య సమన్వయం కోసం టెండర్ల దశలో అనర్హతకు గురైన ఏజెన్సీని నియమించారు. పచ్చ పార్టీ బీమా సేవలో తరిస్తున్న కంపెనీకి మేలు చేసేందుకు వైద్యశాఖ బీమా టెండర్లో సాల్వెన్సీ నిబంధనకు మినహాయింపు ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని బీమా నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే అస్మదీయ ఏజెన్సీకి విజయవాడలోని థర్మల్ పవర్ స్టేషన్ ప్రమాద బీమాలో 15 శాతం వాటాను నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చేశారు. 2024–25, 2025–26లో ఇదే ప్రాతిపదికన ఎంపిక చేశారు. భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయనే భయంతో విజయవాడతో పాటు మరో థర్మల్ పవర్ స్టేషన్‌కు 2026–27లో బ్రోకింగ్ ఏజెన్సీల ఎంపికకు టెయిలర్ మేడ్ నిబంధనలతో ఇటీవల టెండర్ పిలిచారు. ఇలా ప్రభుత్వ శాఖల్లో బీమా కార్యకలాపాలన్నింటిలో బ్రోకర్ ఏజెన్సీ ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారు.సాల్వెన్సీ నిబంధన ఎత్తివేతవైద్య శాఖలో బీమా టెండర్‌ను ఎలాగైనా సరే పచ్చ పార్టీకి బీమా అందిస్తున్న ప్రైవేట్ కంపెనీకే కట్టబెట్టాలనే లక్ష్యంతో టెండర్ నిబంధనల్లో మార్పులు తెచ్చినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీ కీలక పాత్ర పోషిస్తోంది. పచ్చ పార్టీకి బీమా సేవలు అందిస్తున్న సంస్థ సాల్వెన్సీ నిబంధనతో ట్రాన్స్‌కో టెండర్లో వైదొలగింది. దీంతో వైద్య శాఖ బీమా టెండర్లో ప్రీ బిడ్ అనంతరం సాల్వెన్సీ షరతులో మెలిక పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సమర్పిస్తే సాల్వెన్సీ నుంచి మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల మంది పేద, మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య సంరక్షణతో చెలగాటమాడుతూ రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టు విషయంలో సాల్వెన్సీ నిబంధన నుంచి మినహాయిం ఇస్తామని పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వం తీరుపై పలు ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం అభ్యంతరం తెలపడం గమనార్హం. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఐఏ) నిబంధనల ప్రకారం ప్రతి బీమా సంస్థ (లైఫ్, జనరల్/హెల్త్ ఇన్సూరెన్స్) కనీసం 150 శాతం సాల్వెన్సీ రేషియోను నిరంతరం కొనసాగించాలి. ఉదాహరణకు ఒక సంస్థ చెల్లించాల్సిన క్లెయిమ్‌ల విలువ రూ.100 అనుకుంటే.. ఆ సంస్థ వద్ద కనీసం రూ.150 విలువైన ఆస్తులు సిద్ధంగా ఉండాలి. అయితే ప్రభుత్వ పెద్దలు ఎంపిక చేసుకున్న బీమా సంస్థ సాల్వెన్సీ రేషియో లోటులో ఉండటం గమనార్హం. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి టెండర్ నిబంధనల్లో మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది. -
ఏఐ ఇన్సూరెన్స్ టూల్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్ కంపెనీ
బీమా రంగాన్ని ఆధునీకరించే దిశగా హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ ఫోరేసాఫ్ట్, అమెరికాకు చెందిన ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్తో చేతులు కలిపింది. బీమా కంపెనీలు, వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత ఆటోమేషన్ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఫోరేసాఫ్ట్ తెలిపింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో రిస్క్ తగ్గించడం, మోసాలను గుర్తించేందుకు ఈ ఏఐ టూల్స్ వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చూకూరుస్తాయని పేర్కొంది.ఆరోగ్య బీమా క్లెయిమ్ దాఖలు చేయడం నుంచి ప్రమాదాన్ని నివేదించడం లేదా కొత్తగా క్లెయిమ్ కవరేజీ కోసం దరఖాస్తు చేయడం వరకు వినియోగదారులు ఈ ఏఐ టూల్స్ ద్వారా బీమా సంస్థలతో చర్చించే అవకాశం ఉందని ఫోరేసాఫ్ట్ తెలిపింది. ప్రధానంగా కింది అంశాలపై మెరుగైన సర్వీసులు పొందవచ్చని చెప్పింది.వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్: ప్రమాదం జరిగిన వెంటనే ఏఐ సిస్టమ్‌లు ప్రారంభ క్లెయిమ్ అప్లికేషన్‌ను ఆటోమేట్ చేస్తాయి. మాన్యువల్ పేపర్ వర్క్‌ను తగ్గిస్తాయి. దాంతో వినియోగదారుల సమయం ఆదా అవుతుంది.స్మార్ట్ రిస్క్ అసెస్మెంట్: కృత్రిమ మేధ ఇంజిన్లు నిర్మాణాత్మక డేటా (వినియోగదారుల వైద్య చరిత్ర వంటివి)ను విశ్లేషించి ఆ సమాచారాన్ని మదింపు చేస్తాయి.ఫ్రాడ్ డిటెక్షన్: ఏఐ టూల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ ఫ్రాడ్ డిటెక్షన్ మాడ్యూల్స్ అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే పర్యవేక్షిస్తాయి. నిజమైన పాలసీదారులను రక్షిస్తాయి.ఈ సందర్భంగా ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్ ప్రెసిడెంట్ మృదుల మునగాల మాట్లాడుతూ..‘ఈ ఏఐ టూల్స్ వల్ల మోసపూరిత క్లెయిమ్‌లను కట్టడి చేస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించవచ్చు’ అని చెప్పారు. ఫోరేసాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వాసు బాబు వజ్జా మాట్లాడుతూ..‘ఇన్సూరెన్స్ కంపెనీల పునరుద్ధరణకు తోడుగా తదుపరి తరం ఏఐ సర్వీసులు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ మరింత స్మార్ట్‌గా, వేగంగా, పారదర్శకంగా బీమాను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు.ఈ ఒప్పందంలో భాగంగా ఇరుకంపెనీలు ఇన్సూరెన్స్ ఏఐలో నిరంతర ఆర్ అండ్ డీకి మద్దతుగా హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా, మిడిల్ఈస్ట్లో పైలట్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని అధికారులు చెప్పారు. ఇందుకోసం ఇంజినీరింగ్, సర్వీస్ డెలివరీలో 100 మందికి పైగా నిపుణులను నియమించుకోవాలని ఫోరేసాఫ్ట్ యోచిస్తోంది.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే.. -
యూఎస్‌లో దీపక్ దేశాయికి ఆరేళ్ల జైలు శిక్ష
హోస్టన్: హెల్త్ ఇన్సురెన్స్‌లో మోసానికి పాల్పడినందుకు యూఎస్ లోని భారతసంతతికి చెందిన డాక్టర్‌కు 71 నెలల జైలు శిక్ష ఖరారైంది. అంతేకాకుండా అక్రమంగా వసూలు చేసిన 2.2 మిలియన్ డాలర్లని తిరిగి కట్టాల్సిందిగా శుక్రవారం కోర్టు ఆదేశించింది. భారత సంతతికి చెందిన దీపక్ దేశాయి(65) లాస్‌వెగాస్‌లో ఎండోస్కోపీ సెంటర్‌ని నడుపుతున్నాడు. అనిస్థీషియా సేవలకోసం సీనియర్ సిటిజన్స్, పేదల దగ్గర నుంచి యూఎస్ హెల్త్ ఇన్సురెన్స్ సిస్టమ్ నిర్ధారించిన నిబంధనలకి విరుద్ధంగా వసూళ్లకి పాల్పడ్డాడు. దేశాయి తన నేరాన్ని అంగీకరించడంతో జడ్జి 71నెలల శిక్ష విధించింది. అంతేకాకుండా అక్రమ వసూళ్లకు పాల్పడిన సొమ్మును తిరిగి కట్టాల్సిందిగా దేశాయిని కోర్టు ఆదేశించింది.


