breaking news
head injured
-
Vinukonda: పోలీసుల అరాచకం బొల్లా బ్రహ్మనాయుడు తలకు గాయం
-
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
సాక్షి, రంగంపేట: మండల పరిధిలోని ఏడీబీ రోడ్డుపై వడిశలేరు శివారున శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. రంగంపేట ఎస్సై దుర్గా శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరానికి చెందిన సమ్మంగి సత్యవేణి (34) ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, రాజానగరంలోని జీఎస్ఎల్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. సమ్మంగి శ్రీనివాస్, సత్యవేణి దంపతులు స్కూటర్‌పై రాజమహేంద్రవరం నుంచి పెద్దాపురం వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న ఐషర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ వచ్చి స్కూటర్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సత్యవేణి స్కూటర్‌పై నుంచి పడిపోవడంతో తలకు రోడ్డు బలంగా తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బుడిబుడి అడుగులు ఆగిపోయాయి
♦ టీవీ మీదపడి 11 నెలల బాలుడి దుర్మరణం ♦ నిడదవోలు మండలం గోపవరంలో ఘటన నిడదవోలు రూరల్ : అప్పటిదాకా ఎత్తుకు తిరిగి.. పాలబుగ్గల మీద ముద్దులు కురిపించి.. ఆడించిన కన్నపేగుకు కడుపుకోత మిగిలింది. పసివాడి బుడిబుడి అడుగులు ఆగిపోయాయి. నిడదవోలు మండలం గోపవరం గ్రామానికి చెందిన ముప్పిడి పృధ్వీ, కుమారి దంపతుల 11 నెలల బిడ్డ దుర్గాపవన్ స్టాండ్‌పై ఉన్న టీవీ పడి తలకు తీవ్ర గాయమై మృతిచెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి కుమారి మంచంపై పడుకుని ఉండగా బాలుడు దుర్గాపవన్ నేలపై పాకుతూ వచ్చి టీవీ స్టాండ్ లాగాడు. దీంతో టీవీ కిందపడగా స్టాండ్ తగిలి బాలుడు అదిరిపడ్డాడు. నేలకు తల వెనుక భాగంలో బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో హుటాహుటిన స్థానికులు నిడదవోలులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీ కరించారు. గుండెలమీద ఆడించిన కుమారుడు లేడన్న నిజం తెలిసి తండ్రి పృ«ధ్వీ గుండెలవిసేలా రోదించాడు. బాలుడి మృతదేహాన్ని చూసి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తల్లికి కడుపుకోత పృధ్వీ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. నందిగంపాడు గ్రామానికి చెందిన కుమారితో నాలుగేళ్ల క్రితం వి వాహమైంది. రెండేళ్లకు తొలికాన్పుగా పుట్టిన బాలుడు అనారోగ్యంతో మూడువారాల్లోపే కన్నుమూశాడు. దీం తో ఆ కుటుంబం తల్లడిల్లింది. అప్పటినుంచి మనోవేదనకు గురైన కుమారికి రెండో కాన్పుగా దుర్గాపవన్ జన్మించాడు. ప్రమాదవశాత్తూ ఈ బిడ్డకూడా తిరిగిరాని లో కాలకు వెళ్లిపోవడంతో దంపతులిద్దరూ దుఃఖంతో కుమి లిపోతున్నారు. కుమారుడు దుర్గాపవన్ క్షేమంగా ఉండాలని భవానీ మాల వేసుకుని మొక్కుతీర్చుకునేందుకు పృధ్వీ సిద్ధమవుతుండగా విధి మరోలా తలచిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.


