రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న సత్యవేణి
సాక్షి, రంగంపేట: మండల పరిధిలోని ఏడీబీ రోడ్డుపై వడిశలేరు శివారున శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. రంగంపేట ఎస్సై దుర్గా శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరానికి చెందిన సమ్మంగి సత్యవేణి (34) ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, రాజానగరంలోని జీఎస్‌ఎల్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. సమ్మంగి శ్రీనివాస్, సత్యవేణి దంపతులు స్కూటర్‌పై రాజమహేంద్రవరం నుంచి పెద్దాపురం వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న ఐషర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ వచ్చి స్కూటర్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సత్యవేణి స్కూటర్‌పై నుంచి పడిపోవడంతో తలకు రోడ్డు బలంగా తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


