బుడిబుడి అడుగులు ఆగిపోయాయి | 11months baby death in home tv stand accidentally | Sakshi
Sakshi News home page

బుడిబుడి అడుగులు ఆగిపోయాయి

Sep 15 2017 7:54 PM | Updated on Jul 12 2019 3:02 PM

ప్రమాదస్థలంలో కిందపడిన టీవీ వద్ద రోదిస్తున్న బంధువులు  ముప్పిడి దుర్గాపవన్‌ మృతదేహం - Sakshi

ప్రమాదస్థలంలో కిందపడిన టీవీ వద్ద రోదిస్తున్న బంధువులు ముప్పిడి దుర్గాపవన్‌ మృతదేహం

అప్పటిదాకా ఎత్తుకు తిరిగి.. పాలబుగ్గల మీద ముద్దులు కురిపించి.. ఆడించిన కన్నపేగుకు కడుపుకోత మిగిలింది.

టీవీ మీదపడి 11 నెలల బాలుడి దుర్మరణం
నిడదవోలు మండలం గోపవరంలో ఘటన


నిడదవోలు రూరల్‌ : అప్పటిదాకా ఎత్తుకు తిరిగి.. పాలబుగ్గల మీద ముద్దులు కురిపించి.. ఆడించిన కన్నపేగుకు కడుపుకోత మిగిలింది. పసివాడి బుడిబుడి అడుగులు ఆగిపోయాయి. నిడదవోలు మండలం గోపవరం గ్రామానికి చెందిన ముప్పిడి పృధ్వీ, కుమారి దంపతుల 11 నెలల బిడ్డ దుర్గాపవన్‌ స్టాండ్‌పై ఉన్న టీవీ పడి తలకు తీవ్ర గాయమై మృతిచెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి కుమారి మంచంపై పడుకుని ఉండగా బాలుడు దుర్గాపవన్‌ నేలపై పాకుతూ వచ్చి టీవీ స్టాండ్‌ లాగాడు.

దీంతో టీవీ కిందపడగా స్టాండ్‌ తగిలి బాలుడు అదిరిపడ్డాడు. నేలకు తల వెనుక భాగంలో బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో హుటాహుటిన స్థానికులు నిడదవోలులో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీ కరించారు. గుండెలమీద ఆడించిన కుమారుడు లేడన్న నిజం తెలిసి తండ్రి పృ«ధ్వీ గుండెలవిసేలా రోదించాడు. బాలుడి మృతదేహాన్ని చూసి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

తల్లికి కడుపుకోత
పృధ్వీ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. నందిగంపాడు గ్రామానికి చెందిన కుమారితో నాలుగేళ్ల క్రితం వి వాహమైంది. రెండేళ్లకు తొలికాన్పుగా పుట్టిన బాలుడు అనారోగ్యంతో మూడువారాల్లోపే కన్నుమూశాడు. దీం తో ఆ కుటుంబం తల్లడిల్లింది. అప్పటినుంచి మనోవేదనకు గురైన కుమారికి రెండో కాన్పుగా దుర్గాపవన్‌ జన్మించాడు. ప్రమాదవశాత్తూ ఈ బిడ్డకూడా తిరిగిరాని లో కాలకు వెళ్లిపోవడంతో దంపతులిద్దరూ దుఃఖంతో కుమి లిపోతున్నారు. కుమారుడు దుర్గాపవన్‌ క్షేమంగా ఉండాలని భవానీ మాల వేసుకుని మొక్కుతీర్చుకునేందుకు పృధ్వీ సిద్ధమవుతుండగా విధి మరోలా తలచిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement