breaking news
Harmeet Kaur Dhillon
-
అమెరికా అసిస్టెంట్ అటార్నీ జనరల్హర్మీత్ ధిల్లాన్ రాజీనామా
వాషింగ్టన్: అమెరికన్ న్యాయవాది, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, భారత సంతతికి చెందిన హర్మిత్ ధిల్లాన్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ పదవికి, న్యాయ శాఖ పౌర హక్కుల విభాగం అధిపతిగా రాజీనామా చేశారు. అమెరికాలో పౌర హక్కులు, వాక్ స్వాతంత్య్రం, ఎన్నికల చట్టాలకు సంబంధించిన కేసులను వాదించడంలో గుర్తింపు పొందిన ఆమె.. అమెరికా న్యాయ వ్యవస్థలో పౌర హక్కుల విభాగానికి అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా 2025 ఏప్రిల్ నుంచి సేవలందించారు. ఈ పదవిని చేపట్టిన మొదటి రిపబ్లికన్ మహిళగా, మొదటి భారతీయ సంతతి రిపబ్లికన్గానూ నిలిచారు. అయితే, అమెరికా మధ్యంతర ఎన్నికల అనంతరం, ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ప్రైవేట్ న్యాయ రంగంలోకి తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతోనే తాను స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తాను ఎన్నికలకు ముందే స్వచ్ఛందంగా రాజీనామా చేశానని, వైట్ హౌస్ స్టాఫ్ చీఫ్ సూసీ వైల్స్ అభ్యర్థన మేరకు, ఎన్నికల ఫలితాల తర్వాత వరకు ప్రకటనను నిలిపివేశానని ఆమె తెలిపారు. పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా దేశానికి సేవ చేయడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవమని అన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎక్స్ వేదికగా అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. మధ్యంతర ఎన్నికల తర్వాత ట్రంప్ ప్రభుత్వం నుంచి వైదొలగిన మొదటి ఉన్నతాధికారి ఈమె. అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే సోషల్ మీడియా పోస్ట్‌లో ఆమె రాజీనామాను ప్రకటించారు. పౌర హక్కుల విభాగానికి దృఢ సంకల్పంతో ధిల్లాన్ నాయకత్వం వహించారని, ఆమె ప్రతి అమెరికన్ పౌర స్వేచ్ఛను పరిరక్షించారని, భయం, పక్షపాతం లేకుండా చట్టాన్ని అమలు చేశారని కొనియాడారు. అమ్మా, నాన్న ఇచ్చిన గొప్ప బహుమతి చండీగఢ్‌లో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన ధిల్లాన్ తల్లిదండ్రులు మొదట లండన్‌కు వెళ్లి, ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్లో స్థిరపడ్డారు. రిపబ్లికన్ అయిన ధిల్లాన్, న్యాయ శాఖలో చేరడానికి ముందు శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా సంవత్సరాలు తన సొంత న్యాయ సంస్థను నడిపారు. ఆమె సంప్రదాయవాద పాడ్‌కాస్ట్‌లలో తరచుగా అతిథిగా పాల్గొంటారు. సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటారు. తన విభాగం చేపడుతున్న పనుల గురించి ఎప్పటికప్పుడు వీడియోలను పోస్ట్ చేయడానికి తరచుగా సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ, అమెరికాకు వలస రావడం తన తల్లిదండ్రులు తనకు ఇచ్చిన గొప్ప బహుమానమని అభివర్ణించారు. ‘మా నాన్న ఆర్థోపెడిక్ సర్జన్. 1970వ దశకంలో మా అమ్మ, నాన్న భారతదేశాన్ని వదిలి వచ్చేశారు. వియత్నాం యుద్ధ సమయంలో వైద్యుల కొరత ఉండటంతో, అప్పట్లో అమెరికా ప్రభుత్వం వైద్య నిపుణులను ఆహా్వనించింది. ఆ సమయంలోనే వారు అమెరికాకు వచ్చారు. నాకు జీవితాన్ని ఇవ్వడమే కాకుండా, మా అమ్మ, నాన్న నాకు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి నన్ను అమెరికాకు తీసుకురావడం. నా పదో ఏటనే నాకు అమెరికా పౌరసత్వం లభించేలా చేయడం’అని ధిల్లాన్ చెప్పారు. -
సిక్కు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సిక్కు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. చంఢీగఢ్ కు చెందిన హర్మీత్ కౌర్ ధిల్లాన్ రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీలో సభ్యురాలిగా ఎన్నికైంది. లాయర్ గా పనిచేసిన అనుభవం ఉన్న ధిల్లాన్.. గతంలో కాలిఫోర్నియా రిపబ్లికన్ పార్టీకి వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవిలో కొనసాగిన తొలి మహిళగానూ ఆమె అందరికీ సుపరిచితురాలు. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు అమెరికాకు వలసవచ్చారు. నార్త్ కరోలినాలో ఆమె కుటుంబుం నివాసం ఉంటోంది. కాలిఫోర్నియాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైంది. ఈ కమిటీలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉంటారు. జూలై చివర్లో ఆమె ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ విధానాలకు మరింత ముందుకు తీసుకెళ్తానని, మరో నాలుగేళ్లు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు హర్మీత్ కౌర్ ధిల్లాన్ తెలిపారు.


