breaking news
gvmc election
-
జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి షాక్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కౌన్సిల్లో కూటమికి పూర్తి ఆధిక్యత ఉన్నా.. బుధవారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌తో అనూహ్యంగా ఒక స్థానాన్ని దక్కించుకుంది. పది స్థానాలకు కూటమి నుంచి 10 మంది, వైఎస్సార్సీపీ నుంచి 10 మంది కార్పొరేటర్లు పోటీ పడ్డారు. వాస్తవానికి కౌన్సిల్లో 63 మంది కార్పొరేటర్ల బలం ఉన్న కూటమికే ఈ పది స్థానాలు దక్కడం లాంఛనమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే అనూహ్యంగా వైఎస్సార్సీపీ 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి 50 ఓట్లతో స్థాయీ సంఘం సభ్యురాలిగా ఎన్నికయ్యారు.కూటమిపై అసంతృప్తికి నిదర్శనంకూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రలోభాలు, బెదిరింపులతో 27 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను లాక్కుంది. దీంతో జీవీఎంసీలో వైఎస్సార్సీపీ బలం 32కు తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ సీటునూ అనైతికంగా కూటమి సొంతం చేసుకుంది. అదే తరహాలో డిప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది.ఒకవైపు కూటమి ప్రభుత్వంపైనే కాకుండా మేయర్ పీఠాన్ని దక్కించుకున్న మూడు నెలల్లోనే జీవీఎంసీ పరిధిలో కూటమి పాలనపై వ్యతిరేకత మొదలైంది. వైఎస్సార్సీపీ నుంచి కూటమిలోకి వెళ్లిన కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో స్థాయీ సంఘం ఎన్నికల్లో వారు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పోటీ చేసిన పది మందికి 32 ఓట్లు కంటే అధికంగా పడడమే ఇందుకు నిదర్శనం. వైఎస్సార్సీపీ విజయం..జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి విజయం సాధించారు. 97 మంది కార్పొరేటర్లలో 92 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 50 మంది కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డికి అనుకూలంగా ఓటు వేశారు. వాస్తవానికి జీవీఎంసీలో వైఎస్సార్ సీపీ బలం 32 ఉండగా.. అధికార కూటమికి చెందిన 18 మంది కార్పొరేటర్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం విశేషం. కాగా, తొలుత ఫలితం ప్రకటించలేదు వైఎస్సార్ సీపీ నేతలు అడిగిన తరువాతే ఫలితాన్ని ప్రకటించారు. -
దొడ్డిదారిలో గెలుపు కోసం కూటమి.. వైఎస్సార్సీపీ పోరాటం (ఫొటోలు)
-
10 మంది కూటమి కార్పొరేటర్లు ఓటమి GVMC ఓట్ల లెక్కింపులో కుట్ర
-
జీవీఎంసీ ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం
సమైక్య ప్రజారైతు సంక్షేమ సంఘం నాయకుల హెచ్చరిక పంచగ్రామాల సమస్య పరిష్కారంపై ఎమ్మెల్యే నిలదీత సింహాచలం : ఎన్నికల సమ యంలో పంచగ్రామాల సమస్యను ఆరునెలల్లో పరిష్కరిస్తామని చెప్పి న నేతలకు వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని సమైక్య ప్రజారైతు సం క్షేమ సంఘం నాయకు లు హెచ్చరించారు. జీవీఎంసీ 69వ వార్డు పరిధి వేపగుంట హై స్కూల్ మైదానంలో మం గళవారం నిర్వహించిన జన్మభూమి–మా ఊరు సభా ప్రాంగణం వద్ద సంఘం నాయ కులు టి.వి.కృష్ణంరాజు, రమణి తదితరులు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడంలో ఎమ్మెల్యే బండారు విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. రెండున్నరేళ్లు గడిచినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. భూసమస్యపై ఇప్పటికి మూడు కేబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు చేసినా ఎలాంటి పరిష్కారం చూపలేదేమని ప్రశ్నించారు. నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం అధికంగా నగదు వసూలు చేసేందుకు పూనుకున్నారన్నారు. రైతుల భూములను, ఖాళీ స్థలాలను దేవస్థానానికి అప్పగించేందుకు పూనుకున్నారని దుయ్యపట్టారు. భూ సమస్యకు కమ్యూనిస్టులే కారణం : ఎమ్మెల్యే పంచగ్రామాల భూసమస్య రావడానికి కారణం కమ్యూనిస్టులే అని బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. జన్మభూమి సభలో సమైక్య ప్రజారైతు సంక్షేమ సంఘం నాయకులు భూసమస్యపై ప్రశ్నించడంతో ఆయన ఆగ్రహంతో మాట్లాడారు. భూసమస్య కోర్టులో ఉందని, హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం అయిపోయిందని, దమ్ముంటే కోర్టు జడ్జిని ప్రశ్నించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏ క్షణాన్నయినా ఎన్నికలు..
సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు ప్రారంభించాలని రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. నగర ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను సిద్ధం చేసుకోవాలని.. ఏ క్షణాన ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా.. ఆ మరుక్షణమే నోటిఫికేషన్ ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి కావాలని ఆయన సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఎన్నికల అధికార్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ 12న జాతీయ స్థాయిలో రాష్ర్ట ఎన్నికల అధికార్లతో భారత ఎన్నికల ప్రధాన అధికారి సమీక్ష సమావేశం జరుగనుందన్నారు. 11వ తేదీ నాటికి ఆయా నగరాలు, పట్టణాలకు చెందిన పోలింగ్ కేంద్రాలు, వాటి ప్రాంతాలను అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి ఏటా ఇంటింటి సర్వే చేపట్టి ఆధార్ అనుసంధానం చేపట్టాలన్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా గుర్తించిన పోలింగ్ కేంద్రాలు, వాటి పరిధిలోని ఇళ్ల సరిహద్దుల గుర్తింపు ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. ట్యాబ్‌ల ద్వారా జియో ట్యాగింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సాంకేతిక కారణాల దృష్ట్యా పోలింగ్ కేంద్రం నెంబర్, వార్డు నెంబర్ మార్పు చేయలేక పోతున్నట్టు విశాఖ కలెక్టర్ ఎన్.యువరాజ్ సీఈవో దృష్టికి తీసుకొచ్చారు. సవరణలు చేసుకునే విధంగా సాంకేతిక మార్పులు చేయిస్తామని సీఈవో హామీ ఇచ్చారు. ఎనిమిది నియోజవర్గాల్లో విస్తరించిన విశాఖ మహానగరంలో 4.50 లక్షల గృహాలున్నాయని, 556 ట్యాబ్‌లను ఉపయోగిస్తూ నజరీనక్షా అప్ లోడ్ చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పది పోలింగ్ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ముందు చేపట్టినట్టు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల ఎన్నికల నోడల్ అధికార్లు వారు చేపడుతున్న చర్యలను వివరించారు. జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, విజయనగరం ఎన్నికల అధికారి ఎస్.డిల్లీశ్వరరావు, డీఆర్వో జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.