Gundu Sudha Rani
-
తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు
హైదరాబాద్: తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ ఐదవరోజు ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి యాదవ్, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయా రెడ్డి, మాజీ రీజినల్ ఆఫీసర్లు సుశీల రెడ్డి, సువర్ణలతోపాటు వందల సంఖ్యలో మహిళలు పాల్గొని ఆడిపాడారు. -
బాబుతో అప్రమత్తంగా ఉండాలి: కర్నె ప్రభాకర్
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభ తగ్గిందని సర్వేలు చెబుతున్నాయని.. అక్కడ ముఖ్యమంత్రి పదవి పోతుండటంతో తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తు న్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలం గాణ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన చంద్రబాబు విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ నేతల ఫోన్లను ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలపైనో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందలేదని, చంద్రబాబు కట్టిన హైటెక్ సిటీ గబ్బిలాల మందిరంగా తయారైందని చెప్పారు. చంద్రబాబు మరోసారి తెలంగాణలో కుట్రలు చేసే ప్రమాదం ఉందనే టీడీపీతో పొత్తులు పెట్టుకోలేదు. రాష్ట్ర ఏర్పాటు కోసమే పొత్తు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని కర్నె తెలి పారు. టీఆర్ఎస్ బహిరంగసభలకు ప్రజలు భారీగా స్వచ్ఛందంగా తరలి రావడాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేయకుం డా కాంగ్రెస్ అడ్డుకోవడం నీతిమాలిన చర్యని, ఇది ఆడపడుచులను అవమానపరచడమేనని విమర్శించారు. మిషన్ భగీరథ పనులను ఆపా లని కేసు కూడా వేస్తారేమోనన్నారు. ఇలాంటి ప్రతిపక్షం భవిష్యత్తులో అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు కీడు జరుగుతుందన్నారు. కేసీఆర్‌కు రాఖీ కట్టినప్పుడు గుర్తు లేదా? గుండు సుధారాణి సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టినప్పుడు విజ యశాంతికి దొర పదం గుర్తుకు రాలేదా అని టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి విమర్శించారు. ప్రభుత్వ పథకాలు విజయశాంతికి సంపాదన పథకాలుగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ చేనేత వర్గాలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం బతుకమ్మ చీరల పం పిణీ చేపట్టిందని, మహిళలు కట్టుకునే చీరలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. ‘తెలం గాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ. తరతరా ల నుంచి సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం చీరలను ఇస్తోం ది. మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడం కాంగ్రెస్ నీచ సంస్కృతి. కేసీఆర్ అమలు చేసిన ప«థకాలను, ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
'జరగబోయేది మీరే చూస్తారు'
న్యూఢిల్లీ: టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పే దిశగా ఆ పార్టీ ఎంపీ గుండు సుధారాణి అడుగులు వేస్తున్నారు. బుధవారం ఆమె ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి, తెలంగాణ బిడ్డగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనను కలిసినట్టు ఆమె తెలిపారు. వాటర్ గ్రిడ్ లాంటి పథకాలను అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. వరంగల్ ను అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపేందుకే కేసీఆర్ ను కలిశానని అన్నారు. పదవులు శాశ్వతం కాదని, వాటి కోసం తాను పాకులాడడం లేదని ఆమె అన్నారు. టీడీపీలో తనకు అన్యాయం జరగలేదని, తనకు ఎవరూ వెన్నుపోటు పొడవలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పలేదు. ' జరగబోయేదాన్ని మీరే చూస్తారు. బ్రాహ్మలకు తెలవకుండా పెళ్లైతే కాదు కదా' అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే గురువారం టీఆర్ఎస్ పార్టీలో సుధారాణి చేరతారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ పదవి చేపడితే టీడీపీ పార్టీ మారాల్సిందేనా ?
-
'జరగబోయేది మీరే చూస్తారు'
-
మనోళ్లు.. మనకే
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో చేపట్టిన రాజ్యసభ సభ్యుల కేటాయింపు ప్రక్రియపై నెలకొన్న టెన్షన్ తొలగిపోయింది. జిల్లాకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్‌రావు తెలంగాణ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజ్యసభ సభ్యుల కేటాయింపు కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియలో.. జిల్లాకు చెందిన ముగ్గురు సభ్యులు తెలంగాణకే కేటాయించబడ్డారు. రాష్ట్రం యూనిట్‌గా లాటరీ పద్ధతి నిర్వహించడంతో ఎవరు ఏ ప్రాంతానికి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై రాజ్యసభ సభ్యుల్లోనూ టెన్షన్ నెలకొంది. లాటరీ పక్రియ ముగియడంతో ఉత్కంఠకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌లో 18 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వీరిలో జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాపోలు ఆనందభాస్కర్, టీడీపీ నుంచి గుండు సుధారాణి, గరికపాటి మోహన్‌రావులు రాజ్యసభ సభ్యులుగా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడే తరుణంలో 11 మంది సభ్యులను ఆంధ్రప్రదేశ్‌కు, ఏడుగురిని తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్నారు. ఎవరిని ఏ ప్రాంతానికి కేటాయించాలనే విషయంపై తేల్చేందుకు లాటరీ పద్ధ నిర్వహించారు. రాజ్యసభ సభ్యుల కేటాయింపు కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో లాటరీ ప్రక్రియను పూర్తి చేశారు. 2016లో ఐదుగురు సభ్యుల పదవీకాలం ముగియనుంది. వీరిలో ఇద్దరిని తెలంగాణకు కేటాయించారు. జిల్లాకు చెందిన గుండు సుధారాణి పదవీకాలం 2016 లోనే ముగియనుంది. లాటరీ కావడంతో ఎలా ఉంటుందోనన్న సందేహం వీడింది.సుధారాణి తెలంగాణకే ప్రాతినిధ్యం వహించేలా లాటరీలో నిర్ణయించారు. 2018లో పదవీకాాలం ముగియనున్న వారిలో ముగ్గురిని తెలంగాణకు కేటాయించారు. జిల్లాకు చెందిన రాపోలు ఆనందభాస్కర్ పదవీకాలం 2018లోనే ముగుస్తోంది. లాటరీలో ఆనందబాస్కర్ తెలంగాణకే వచ్చారు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గరికపాటి మోహన్‌రావు పదవీకాలం 2020లో ముగియనుంది. ఇంకా బాధ్యతలు చేపట్టని మోహన్‌రావు లాటరీలో ఏ రాష్ట్రానికి ఎంపికవుతారనే సందేహం వీడింది. లాటరీలో మోహన్‌రావు తెలంగాణకే వచ్చారు. -
పెద్దల సభలో ఎవరేమన్నారంటే...
ప్రత్యేక ప్యాకేజీలివ్వాలి: డి.రాజా, సీపీఐ ‘బిల్లుకు సీపీఐ మద్దతిస్తోంది. అంటే మేం చిన్న రాష్ట్రాలకు మద్దతిస్తున్నట్టు కాదు. విభజన శాంతి సామరస్యాలతో జరగాల్సింది. కానీ కాంగ్రెస్, కేంద్రం గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సీమాంధ్ర ప్రజల భయాందోళనలు పోగొట్టాలి. కొత్త రాజధానికి చాలినన్ని నిధులివ్వాలి. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి’. సుదీర్ఘ ఉద్యమం: పాశ్వాన్, లోక్‌జనశక్తి ‘‘తెలంగాణ ఉద్యమం చాలా ఏళ్లుగా సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సీమాంధ్రకూ న్యాయం జరగాలి’. సమాఖ్య స్ఫూర్తికి భిన్నం: కనిమొళి ‘ఏకాభిప్రాయం రావాలని అడుగుతున్నాం. కానీ నాలుగేళ్లుగా అది జరగలేదు. అసెంబ్లీ అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విభిన్నం. మేం బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నాం’. మేం వ్యతిరేకం: సీపీఎం నేత సీతారాం ఏచూరి ‘కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. మేం విభజన బిల్లుకు వ్యతిరేకం. దాన్ని లోక్‌సభకు తిప్పి పంపండి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. అందుకే చాలా రోజులుగా వ్యతిరేకిస్తున్నాం. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అన్నారు. ఆర్థిక సాయాన్ని దేశవ్యాప్తంగా వెనకబడ్డ అన్ని ప్రాంతాలకూ ఇవ్వాలి’ పెద్ద రాష్ట్రాలను విభజించాలి: మాయావతి ‘ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలవుతుండటం చాలా సంతోషం. పదేళ్ల ఉమ్మడి రాజధానంటే సుదీర్ఘ సమయం. ఎవరికీ ఉపయోగపడదు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు తెలంగాణను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అది చాలా వెనకబడిన ప్రాంతం. అక్కడ ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలు ఎక్కువ. అక్కడి అగ్ర వర్ణాల్లో కూడా పేదలున్నారు. కాబట్టి తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వకపోతే లాభముండదు. ఆర్థిక స్థితి బాగా లేని రాష్ట్రాలన్నింటికీ స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలి. పెద్ద రాష్ట్రాలన్నింటినీ విభజించాలి’ వ్యతిరేకిస్తున్నామంతే: సీఎం రమేశ్, టీడీపీ ‘ఇది మొత్తం రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు. వ్యతిరేకిస్తున్నాం. అంతే’ మా మద్దతుంది: దేవేందర్ గౌడ్, టీడీపీ ‘బిల్లుకు మేం మద్దతిస్తున్నాం. అయితే సీమాంధ్ర ప్రజల అవసరాలను తీర్చాలని కోరుతున్నా’’ ఆంక్షలొద్దు: గుండు సుధారాణి, టీడీపీ ‘మాకు ఆంక్షలు లేని తెలంగాణ కావాలి. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలి’ స్వాగతిస్తున్నాం: వై.ఎస్.చౌదరి, టీడీపీ ‘తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఆ విధానం పూర్తిగా అప్రజాస్వామికం. ఎన్నికల షెడ్యూలుకు 10 రోజుల ముందు విభ జిస్తారా? ఈ బిల్లు న్యాయ వ్యతిరేకం. దీన్ని స్టాండింగ్ కమిటీకి నివేదించాలి’ చండీగఢ్ ఇప్పటికీ రాలేదు: గుజ్రాల్, అకాలీదళ్ ‘45 ఏళ్ల క్రితం పంజాబ్ విడిపోయింది. చండీగఢ్ ఐదేళ్లే యూటీగా ఉంటుందని, తరవాత పంజాబ్‌కు చెందుతుందని చెప్పారు. అదిప్పటికీ రాలేదు’’ బిల్లును ఎన్.కే.సింగ్ (జేడీయూ), రాంగోపాల్ యాదవ్ (సమాజ్‌వాదీ), శశిభూషన్ బెహరా (బిజూ జనతాదళ్), బీరేంద్ర ప్రసాద్ బైశ్య (అసోం గణ పరిషత్) వ్యతిరేకించారు. జనార్దన్ వాగ్మారే (ఎన్సీపీ), రాం కృపాల్ యాదవ్ (రాష్ట్రీయ జనతాదళ్), బిశ్వజిత్ దైమారి (బీపీఎఫ్) సమర్థించారు. కేవీపీని హాస్పిటల్‌కు తీసుకెళ్లాలన్న డిప్యూటీ చైర్మన్ రాజ్యసభలో కొద్ది రోజులుగా రోజూ వెల్‌లో నిల్చొని, రెండు చేతులు పెకైత్తి ప్లకార్డు పట్టుకుని నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచంద్రారావు అనారోగ్యంతో ముందు వరసలో కింద ఒరిగిపోయారు. ఈ విషయాన్ని డిప్యూటీ చైర్మన్ గమనించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ను ‘ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లండి’ అని ఆదేశించారు. అయితే అందుకు నిరాకరించిన కేవీపీ సభ అయిపోయేవరకు అలాగే కింద కూర్చుండిపోయారు.