breaking news
Grilled chicken
-
అంతరిక్షంలో వంట.. అదెలా!
న్యూయార్క్: అంతరిక్ష కేంద్రం. ఏ చిన్నపాటి నిప్పురవ్వ అంటుకున్నా రోదసీలోనే అంతా అంటుకుని అగ్నిగోళంగా మండిపోయే అత్యంత సున్నిత ప్రాంతం. అలాంటి అంతరిక్ష కేంద్రంలోనూ వేడివేడి చికెన్ వింగ్స్‌ను అది కూడా ఎలాంటి పొగరాని ప్రత్యేక ఓవెన్‌ను వండుకుని చైనా వ్యోమగాములు చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోని ఓ ప్రైవేట్ స్పేస్‌స్టేషన్‌లో ఇలా ఓవెన్లో చికెన్‌ను వండుకుని తినడం ఇదే తొలిసారి. అసలు అంతరిక్ష కేంద్రంలో వంటచేయడం కూడా ఇదే ప్రప్రథమం. తాము అభివృద్ధి చేసిన స్పేస్ కిచెన్ సాంకేతికతను చైనా ఇలా విజయవంతంగా పరీక్షించింది. పరీక్షించడమేకాదు పనిలోపనిగా ఆ వేడివేడి చికెన్‌ను వ్యోమగాములంతా తిని భారరహిత స్థితిలో మాంసాహార వంటకంలోని మజాను ఆస్వాదించారు. ఇందుకు తియాంగాంగ్ స్పేస్‌స్టేషన్ ( Tiangong Space Station) వేదికైంది. కనీసం 500 సార్లు భూమి మీద విస్తృతస్థాయిలో పరీక్షించాక దానిని తియాంగాంగ్ స్పేస్స్టేషన్కు తీసుకొచ్చారు. తాజాగా ఆహారం దిశగా పయనం వ్యోమనౌక ద్వారా తీసుకొచ్చిన అతిశీతల ఆహార పదార్థాలకు మళ్లీ వేడి చేసి తినడానికి బదులుగా అప్పుడే వండిన వేడివేడి ఆహారం తినాలనే ఆశ నుంచి హాట్–ఎయిర్ ఓవెన్ ఆలోచన పుట్టుకొచ్చింది. ఓవెన్లో పెట్టే వస్తువులను పట్టి ఉంచే పట్టీ, వేడిచేసే మెష్, ఉడికించే ట్రే, సమంగా కాల్చే రోటేటింగ్ బుట్టలతో వినూత్న ఓవెన్‌ను తయారుచేశారు. ‘‘ఓవెన్ గరిష్ట ఉష్ణోగ్రతను 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 190 డిగ్రీ సెల్సియస్‌కు పెంచాం. దీంతో చికెన్, మటన్ వంటి పదార్థాలను అప్పటికప్పుడు వేడివేడిగా తినొచ్చు’’అని చైనా శాస్త్రవేత్త, చైనా ఆస్ట్రోనాట్ రీసెర్చ్, ట్రైనింగ్ సెంటర్లో పరిశోధకుడు యువాన్ యోంగ్ చెప్పారు. ఈ ఓవెన్‌ను ఇటీవల షెంజువాన్–21 వ్యోమనౌక ద్వారా భూమి నుంచి తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తాజాగా దీనిని చికెన్, మటన్ ముక్కలను బేక్ చేసి పరీక్షించారు. చికెన్ వింగ్స్‌ను చైనా షెంజువాన్–21, షెంజువాన్–22ల వ్యోమగాములు (astronauts) ఎంచక్కా ఆరగిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.పొగరాకుండా ఏర్పాట్లు భారరహిత స్థితిలో పొగ కమ్మితే అది ఎప్పటికీ బయటకు పోదు. దాంతో వ్యోమగాముల ఆరోగ్యంపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వంటలను వండినప్పుడు పొగ వెలువడకుండా ఓవెన్లో ప్రత్యేక ఏర్పాటుచేశారు. బహుళ పొరల ఫిల్టర్లను దానిలో అమర్చారు. అత్యధిక వేడిమిని ఇచ్చే రసాయన చర్యలు, సాంకేతికత మేళవింపుతో ఓవెన్‌ను తయారుచేశారు. భారరహిత స్థితిలోనూ అది సవ్యంగా పనిచేయడం విశేషం. అంతరిక్ష కేంద్రంలోనూ వాడగల ప్రపంచంలోనే మొట్టమొదటి ఓవెన్ ఇదేనని ఆస్ట్రోనాట్స్ సిస్టమ్‌లో డెప్యూటీ చీఫ్ డిజైనర్ లూ వీబో చెప్పారు. మొక్కజొన్న పొత్తులు వేయించుకునేందుకూ ఇందులో ఏర్పాటు ఉంది. కేక్ (Cake) సైతం తయారు చేసుకోవచ్చు.చదవండి: షట్‌డౌన్ తెచ్చిన ఆహార సంక్షోభంతయాంగాంగ్ స్పేస్‌స్టేషన్‌లో ఉన్నప్పుడు ఏదైనా చైనా జాతీయ ప్రత్యేక దినోత్సవాలు వచ్చినప్పుడు వేడుకల్లో భాగంగా ఈ వంటకాలను ఇందులో తయారుచేయొచ్చు. దీర్ఘకాల అంతరిక్ష ప్రాజెక్టుల్లో వ్యోమగాములకు రుచికరమైన ఆహారం అందించే లక్ష్యంతో ఈ ఓవెన్‌ను తయారుచేసినట్లు చైనా తెలిపింది. స్పేస్ బార్బెక్యూతో పసందైన వంటకాలను తినబోతున్నామని చైనా వ్యోమగాములు చెప్పారు. గతంలో రష్యా, అమెరికా, చైనా సంయుక్తంగా నిర్మించిన, ప్రస్తుతం విధుల్లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చాక్లెట్చిప్ కుకీలను బేక్ చేసినా అందుకు చాలా సమయం పట్టింది. కానీ చైనా వ్యోమగాములు కేవలం 28 నిమిషాల్లోనే చికెన్ వింగ్స్‌ను సంపూర్ణంగా ఉడికించి శెభాష్ అనిపించుకున్నారు. మటన్ ముక్కలనూ బేక్ చేశారు. -
ఇల్లు తుడిచే మాప్ కాదు, బీబీక్యూ మాప్ సాస్: వీడియో వైరల్
ఇంటర్నెట్లో ఫుడ్‌కు సంబంధించిన అనేక వీడియోలు సందడి చేస్తూ ఉంటాయి. వీటిల్లో కొన్ని ఆకర్షణీయంగా ఉంటే, మరికొన్ని మాత్రం యాక్.. అనిపిస్తుంటాయి కదా. అలాంటి ఇంట్రస్టింగ్ వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Chef Matt Cooper (@stadiumchef) దోసల పెనం మీద చీపురు కట్టతో తుడవడం చూశాం. మొన్నఒక వ్యక్తి అనేక చికెన్ కాల్చడం కోసం పొడవైన తుడుపుకర్రను వాడేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. తాజాగా ఒక మహిళ మాంసాన్ని గ్రిల్ చేస్తూ, మాప్ స్టిక్ వాడడం నెటిజన్లకు షాకిచ్చింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియో 45 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకంది. 47వేలకు పైగా కామెంట్లు వెల్లువెత్తాయి.stadiumchef ఇన్స్టాగ్రామ్ రీల్లో ఒక మహిళా చెఫ్ సాస్ కంటైనర్‌లో తుడుపుకర్రను ముంచి, తరువాత బీబీక్యూలోని మీట్‌పై పూసింది. బీబీక్యూ మాప్ సాస్ అనే క్యాప్షన్‌తో షేర్ ఈ చేసిన వీడియోపై వివరణ కూడా ఇచ్చింది. ఇలాంటి మాప్స్ గ్రిల్డ్ మాంసాన్ని చేసేందుకు స్పెషల్‌గా తయారు చేస్తారని వివరణ ఇచ్చింది. పెద్దమొత్తంలో స్మోక్డ్ మీట్ చేసేటపుడు ఇవి ఉపయోగపడతాయి. మీరు దక్షిణాదికి చెందినవారు కాకపోతే, అర్థం కాదు అని కూడా ఆమె తెలిపింది. ఇంత వివరణ ఇచ్చినా ఇది చూసి వెంటనే కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘‘అస్సలు హైజీనిక్‌గా లేదు..బాబోయ్ బాక్టీరియా మయం రా బాబూ.. నేను తిన’’ అని ఒక యూజర్ కమెంట్ చేయగా, చాలామంది బీబీక్యూ మాప్‌ను సమర్ధించారు. -
కొత్త కొత్తగా స్టయిలిష్ బార్బెక్యూ..
శ్రమ తెలియకుండా రుచి, ఆరోగ్యం రెండు అందించే ఫుడ్ మేకర్స్‌కి ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉంది. చిత్రంలోని ఈ డివైజ్‌లో ఒకే సమయంలో నాలుగైదు వెరైటీలను వండుకోవచ్చు. ఎడమవైపు ఉన్న హాట్ పాట్లో.. సూప్స్, రైస్ ఐటమ్స్, కర్రీస్ వంటివి చేసుకుంటే.. కుడివైపు పైభాగంలో బార్బెక్యూ గ్రిల్ లేదా ఫ్రైయిడ్ పాన్ పెట్టుకుని నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్‌ని గ్రిల్ చేసుకోవచ్చు. ఇక దాని కింద భాగంలో ఉన్న ఖాళీలో రెండు పాన్ ప్లేట్స్ అమర్చుకునే వీలుంటుంది. వాటిపైన పాన్ కేక్స్, ఆమ్లెట్స్, దోసెలు ఎట్సెట్రా వేసుకోవచ్చు. ఇరువైపులా టెంపరేచర్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి విడివిడిగా రెండు రెగ్యులేటర్స్ ఎడమవైపు ఉంటాయి. కుకింగ్ హాట్ పాట్‌కు ట్రాన్స్పరెంట్ మూతతో పాటు.. ప్రత్యేకమైన హ్యాండిల్స్ ఉంటాయి. అలాగే పాన్ ప్లేట్స్కి కూడా పొడవాటి హ్యాండిల్స్ ఉంటాయి. ధర 179 డాలర్లు (రూ.13,383) హైక్వాలిటీ మల్టీఫంక్షనల్ మేకర్ ఈ తరానికి ‘సింపుల్ అండ్ ఈజీ’ పద్ధతిని అలవాటు చేసిన టెక్నాలజీ.. నిత్యం ‘అంతకు మించి’ అనే పాలసీని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త సౌకర్యాలను అందిస్తూనే ఉంటుంది. అందులో భాగమే ఈ మేకర్. ఇందులో పెద్దపెద్ద నాన్ వెజ్ ముక్కలతో పాటు.. రకరకాల రైస్ ఐటమ్స్, గ్రిల్ ఐటమ్స్ ఎక్కువ మోతాదులో తయారు చేసుకోవచ్చు. అలాగే కట్లెట్స్, శాండ్‌విచ్‌లతో పాటు.. చికెన్, మటన్, రొయ్యలు వంటివి క్రిస్పీగా గ్రిల్ చేసుకోవచ్చు. ఒకే సమయంలో మూడు వెరైటీలను తయారు చేసుకునేందుకు వీలుగా పాన్ బౌల్, ఫ్రైయిడ్ పాన్లతో పాటు.. పొంగనాల పాన్ కూడా లభిస్తుంది. టెంపరేచర్ పెంచుకోవడానికి మేకర్ కిందభాగంలో సెటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక బౌల్స్ అండ్ పాన్స్ గాడ్జెట్ నుంచి విడిగా తీసుకుని క్లీన్ చేసుకోవడం తేలిక. ధర 344 డాలర్లు (రూ.25,720) కంఫర్ట్ చార్కోల్ గ్రిల్ ఎన్ని సదుపాయాలొచ్చినా.. ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. రోటి పచ్చడిలానే బొగ్గులపైన చేసే వంటకీ ఓ ప్రత్యేకత ఉంది. మెషిన్స్ అందివ్వలేని ఏదో కమ్మని రుచి అందులో ఉందంటారు కొందరు భోజనప్రియులు. అలాంటి వారికోసమే ఈ చార్కోల్ గ్రిల్. చిత్రంలోని ఇంతపెద్ద మేకర్ని.. సులభంగా ఫోల్డ్ చేసి చిన్న బ్యాగ్‌లో పెట్టుకుని.. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. కింద భాగంలో బొగ్గులు రాజేసి.. గ్రిల్ మీద కావాల్సినవన్నీ కుక్ చేసుకోవచ్చు. వంటకు కావాల్సిన వస్తువులతో పాటు తయారైన ఫుడ్‌ని పక్కన పెట్టుకోవడానికి వీలుగా.. ఇరువైపులా ప్రత్యేకమైన స్టోరేజ్ బాస్కెట్స్ ఉంటాయి. కుడివైపు స్టెయిన్లెస్ స్టీల్ బేకింగ్ నెట్, ఎడమవైపు ఫ్రైయిడ్ పాన్ అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ డివైజ్ కింద భాగంలో పెద్ద సొరుగు ఉంటుంది. వంటకు కావాల్సిన బాక్స్‌లు, పాత్రలు అందులో పెట్టుకోవచ్చు. ఇక నాలుగువైపులా ఉండే స్టాండ్స్ కావాల్సిన హైట్‌ని బట్టి అడ్జెస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. ధర 79 డాలర్లు (రూ.5,906) -
టేస్ట్ గ్రిల్లేయండి!
రొటీన్ వంటల కంటే... గ్రిల్డ్ చికెన్, గ్రిఫ్డ్ ఫిష్ చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలామంది వీటికోసం రెస్టారెంట్లకు వెళ్తుంటారు. ఇకపై అలా బయటికి పరుగులు తీయకుండా, ఇంట్లోనే చికెన్, మాంసం, ఫిష్‌ను గ్రిల్‌పై వేయించొచ్చు. ఎలా అంటారా? ఫొటోలో కనిపిస్తున్నది ‘స్మార్ట్ గ్రిల్’. దీన్ని మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఎంత టెంపరేచర్‌పై మాంసం కాలాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ గ్రిల్ పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో పని చేస్తుంది. కేవలం నాన్ వెజ్‌నే కాదు... కూరగాయలను కూడా వీటిపై ఫ్రై చేసుకోవచ్చు. వీటిపై వండటం వల్ల నూనె వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాంతో రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం. వంట త్వరగా కావాలంటే... టెంపరేచర్‌ను బాగా పెంచుకోవచ్చు (315 డిగ్రీల వరకు). అలాగే ఎంత టైమ్‌లో కావాలో కూడా సెట్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం... వెంటనే గ్రిల్డ్ ఫుడ్‌ను ఇంట్లోనే తయారు చేసుకొని లాగించండి.


