breaking news
govardan giri
-
గోవర్ధన తీర్థం: ఒకానొకప్పుడు జాబాలి అనే..
ఒకానొకప్పుడు జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు ఉండేవాడు. వ్యవసాయంలో పొలం దున్నడానికి నాగలికి జోడెద్దులను కట్టేవాడు. అతడు ఎడ్లను సరిగా చూసుకునేవాడు కాదు సరికదా, నీరసించిన ఆ ఎడ్లు వడి వడిగా పొలం దున్నలేకపోతే, చీటికి మాటికి వాటిని మునికోలతో కొడుతూ, పొడుస్తూ హింసించేవాడు. పాపం! నోరులేని ఆ మూగజీవాలు అతడు పెట్టే బాధలకు భరిస్తూ, లోలోన దుఃఖిస్తూనే పనిచేస్తుండేవి.ఒకనాడు గోమాత అయిన కామధేనువు ఆ ఎద్దుల బాధను చూసింది. వాటి బాధలకు కలత చెందింది. ఆమె నందీశ్వరుడి వద్దకు వెళ్లి, ఆ ఎద్దులు పడే బాధలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కామధేనువు ద్వారా అంతా విన్న నందీశ్వరుడు ఆ వృషభాలపై జాలి చెందాడు. తన ప్రభువైన పరమశివుని వద్దకు వెళ్లి, జాబాలి వద్దనున్న ఎద్దులు పడే బాధలు చెప్పాడు. ‘నందీ! నువ్వేమీ దిగులు చెందకు. ఈ విషయంలో నువ్వు తలచినది జరిగేలా వరమిస్తున్నాను. నీకు ఇష్టమైన రీతిలో నీ కోరిక నెరవేర్చుకో’ అన్నాడు పరమశివుడు.నందీశ్వరుడు వెంటనే ముల్లోకాలలో ఉన్న గోజాతిని సమావేశపరచాడు. ‘మీరెవ్వరూ ఇక్కడి నుంచి మరెక్కడికీ పోవద్దు. మీరు ఎవ్వరికీ కనిపించవద్దు’ అని ఆదేశించాడు.రోజులు గడుస్తున్నా, గోజాతి కనిపించకపోవడంతో ముల్లోకాలలోనూ గగ్గోలు మొదలైంది. దేవతలందరూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, మొరపెట్టుకున్నారు.‘బ్రహ్మదేవా! ఏమైందో ఏమో గోజాతి అంతా ఒక్కసారిగా మాయమైంది. ముల్లోకాలలోనూ ఒక గోవూ కనిపించడం లేదు. గోవులు లేకుండా ముల్లోకాలలో జనులు జీవించడమెలా?’ అని వాపోయారు.‘దేవతలారా! ఇందులో నేను చేయగలిగినదేమీ లేదు. మీరంతా పశుపతి అయిన పరమశివుని వద్దకు వెళ్లి ప్రార్థించండి. అతడే తరుణోపాయం చెప్పగలడు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.దేవతలంతా కైలాసానికి చేరుకున్నారు. పరమశివుని స్తుతించి, ముల్లోకాలలోనూ గోగణాలు కనిపించకుండా పోయిన సంగతిని విన్నవించుకున్నారు.‘గోగణాల సంగతి నాకేం తెలుసు? నా వాహనం నందీశ్వరుడిని అడగండి’ అని చిద్విలాసంగా చెప్పాడు పరమశివుడు.దేవతలు నందీశ్వరుడి వద్దకు వెళ్లారు.‘నందీశ్వరా! పరోపకారీ! దయచూపి, మాకు గోప్రదానం చేసి, లోకాలను రక్షించు’ అని వేడుకున్నారు.‘దేవతలారా! గోసంతతికి చెందిన వృషభాలను జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు బాధలు పెడుతున్నాడు. అందుకు ప్రతిగానే నేను గోగణాలను నా ఆశ్రయంలో ఉంచాను. మీరందరూ గోమతీ తీరానికి వెళ్లి, అక్కడ గోసవన యాగం చేయండి. గోహింసను పాపంగా ప్రకటించండి. అక్కడకు ముల్లోకాలకు చెందిన గోవులన్నీ వచ్చి, మిమ్మల్ని సంతుష్టులను చేస్తాయి’ అని పలికాడు.నందీశ్వరుడు చెప్పినట్లే దేవతలు గోమతీ తీరంలో గోసవన యాగం ప్రారంభించారు. యాగం మొదలైన కొద్దిసేపటిలోనే ముల్లోకాల గోగణాలన్నీ లెక్కకు మిక్కిలిగా అక్కడకు చేరుకున్నాయి. నేల ఈనినట్లు గోమతీ తీరమంతా ఎటు చూసినా గోగణాలతో కళకళలాడింది. దేవతలు, మానవులు ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. గోవులు తిరిగి కనిపించడంతో వారంతా పరమానందం చెందారు.దేవతలు చేపట్టిన గోసవన యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. నాటి నుంచి ముల్లోకాలలోను గోవులకు పూజ్యత హెచ్చింది. దేవతలు గోసవన యాగం చేపట్టిన ప్రదేశం గోవర్ధన తీర్థంగా ప్రసిద్ధి పొందింది.పురావిశేషం..ఈశాన్య రాష్ట్రాల్లోని అరుదైన పురాతన దేవాలయాల్లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని మహాబలి ఆలయం ఒకటి. దీనిని క్రీస్తుశకం 1725లో నాటి రాజు గరీబ్ నివాజ్ నిర్మించాడు. అతడిని స్థానికంగా ‘మహారాజా పామ్హీబా’ అని పిలుస్తారు. అప్పట్లో మణిపూర్‌లోని సన్యాసి శాంతిదాస్ గోసాయి బోధనలకు ఆకర్షితుడైన గరీబ్ నివాజ్, ఆయన వద్ద రాముడిని ఆరాధించే ‘రామానంది’ మతాన్ని స్వీకరించాడు. రామదూత హనుమంతుడు మూలవిరాట్టుగా ‘మహాబలి’ ఆలయాన్ని ఇంఫాల్ నది ఒడ్డున నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం బెంగాలీ ‘దో–చాలా’ శైలిలో ఉంటుంది. ఆలయ గర్భగుడిలోని హనుమంతుడి విగ్రహం నృత్యభంగిమలో ఉండటం విశేషం. గరీబ్ నివాజ్ మరణానంతరం మణిపూర్‌లో రామానంది మతం కనుమరుగై, గౌడీయ వైష్ణవం ప్రాబల్యం పుంజుకుంది. ఈ ఆలయంలో ఏటా హనుమజ్జయంతి, దీపావళి, హోలీ వేడుకలు విశేషంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
పాట పాడు.. పదవి కొట్టు
న్యూస్‌లైన్ నెట్వర్క్ : జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు వేలం పాటలు జోరందుకున్నాయి. గ్రామాలలో ఈ స్థానాలకు పోటీ ఏర్పడిన నేపథ్యంలో గ్రామ పెద్దలు వేలం పాటలు నిర్వహించ టం, ఎక్కువ డబ్బులు చెల్లించినవారికి పదవులు కట్టబెట్టడం సర్వ సాధారణంగా మారింది. గ్రామస్తులు తీర్మానం చేసుకున్న ప్ర కారం వేలం పాటలో పదవిని దక్కించుకు న్న వ్యక్తికి పోలింగ్ రోజు ఓట్లు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా పలు గ్రామాలలో సోమవా రం ఎంపీటీసీ స్థానాలకు వేలం పాటలను నిర్వహించారు.సమాచారం అందుకున్న పోలీ సులు, అధికారులు వెళ్లేలోపు చాలా గ్రామాల లో వేలంపాట తంతును పూర్తి చేసుకున్నట్లు స మాచారం. పలు గ్రామాలలో జరిగిన వేలం పాటల వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 3.50 లక్షలకు బాల్కొండ : బాల్కొండ మండలం నాగంపేట్ ఎంపీటీసీ స్థానానికి సోమవారం గ్రామస్తులు వేలం నిర్వహించినట్లు తెలిసింది. ఈ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో గ్రా మానికి చెందిన టీడీపీ నాయకుడు తన తల్లిని అభ్యర్థిగా నిలబెడుతూ రూ. 3.50 లక్షలకు వే లం పాటలో పదవి దక్కించుకున్నట్లు తెలిసిం ది. అయితే సమాచారం అందుకున్న తహశీల్దార్ పండరీనాథ్, ఆర్మూర్ రూర ల్ సీఐ గోవర్ధనగిరి, ఎస్ఐ సురేశ్ గ్రామానికి వెళ్లి విచారించగా ఎలాంటి వేలం నిర్వహిం చలేదని గ్రామస్తులు తెలిపారు. రామేశ్వర్పల్లిలో భిక్కనూరు : భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి ఎంపీటీసీ స్థానానికి సోమవారం వేలం పాడినట్టు తెలిసింది. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వు కాగా ఆ సామాజిక వర్గానికి చెం దిన నలుగురు అభ్యర్థులు పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో గ్రామ బీసీ సం ఘం నేతలు సమావేశమై వే లం ఎంపీటీసీ స్థానానికి వేసినట్టు తెలిసింది. వేలంలో అత్యధికంగా రూ.3.09 లక్షలు చెల్లించడానికి ముం దుకు వచ్చిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. సదరు మహిళ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని కులపెద్ద లు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయమై గ్రామానికి చెందిన బీసీ సంఘం నేతలను సం ప్రదించగా అలాంటిదేమీ లేదని పేర్కొన్నా రు. అధికారులు అడ్డుకున్నారు ధర్పల్లి : ధర్పల్లి మండలం మైలారం గ్రామం లో సోమవారం ఎంపీటీసీ పదవికి వేలం పాటను అధికారులు అడ్డుకున్నారు. మైలా రం, కేశా రం గ్రామాలకు కలిపి ఒకే ఎంపీటీసీ స్థానం ఉంది. మైలారంలో 1,233 మంది, కేశారంలో 532 మంది ఓటర్లు ఉన్నారు. అయితే మైలారం వాసులు తమ గ్రామానికి చెందిన వ్యక్తినే ఎంపీటీసీ సభ్యుడిగా గెలిపిం చుకోవాలని భావించారు. ఇందుకోసం గ్రామ సమీపంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకుని వేలం పాటలు నిర్వహించారని సమాచారం. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నాయకులు కొం దరు పోటీ పడినట్లు తెలిసింది. విషయం తెలిి సన వెంటనే ఎస్ఐ అంజయ్య, తహశీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ మదన్మోహన్ హుటాహుటిన అక్కడకు చేరుకుని వేలం జరుగకుండా నిలిపివేశారు. గ్రామపెద్దల నుంచి హా మీ పత్రాన్ని తీసుకున్నారు. వేలం పాటతో అ భ్యర్థిని బరిలోకి దింపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే, అప్పటికే ఎం పీటీసీ స్థానానికి ఓ అభ్యర్థి రూ. 4.50 లక్షలు వేలం పాడి ఖరారు చేసుకున్నట్లు సమా చారం. తహశీల్దార్ రాకతో ఆగిన వేలం కోటగిరి : కోటగిరి మండలంలోని రాయకూర్ గ్రామంలో ఓప్రధాన రాజకీయపార్టీకి చెందిన నాయకులు ఎంపీటీసీ స్థానానికి వేలం వేసేం దుకు యత్నించారు. సమా చారం తెలుసుకున్న తహశీల్దార్ వెంకటేశ్వర్రావ్ గ్రామానికి చేరుకునే లోగా అక్కడి నుంచి నాయకులు చిత్తగించారు. దీంతో తహశీల్దార్ గ్రామంలో వేసిన టెంటును సిబ్బందిచే తొలగించారు.


