ఇకపై తెలుగులో వరుస సినిమాలు చేస్తా : గోవింద్ వరాహ
ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గూగుల్ మై ఫ్రెండ్. ఈ చిత్రాన్ని డాలర్స్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దివాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బహు భాషల్లో పలు హిట్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోవింద్ వరాహ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘గూగుల్ మై ఫ్రెండ్’ సినిమాకు టి. వెంకటేష్ రెడ్డి, బి.ప్రసన్నాంజనేయులు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, మరాఠీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, సాయి రాజేశ్, వి సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ చిత్ర సాంగ్స్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సాయిరాజేశ్ మాట్లాడుతూ - ‘మా దర్శకుల సంఘం సభ్యులు, మా ఆత్మీయులు గోవింద్ డైరెక్ట్ చేస్తున్న గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్, టీజర్ ఇతర కంటెంట్ చూశాం. ఈ కంటెంట్ అంతా ప్రామిసింగ్ గా ఉంది. ఒకేసారి తెలుగు, మరాఠీ భాషల్లో ఆయన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మంచి రిలీజ్ కుదిరి ప్రొడ్యూసర్ కు డబ్బులు, గోవింద్‌కి పేరు రావాలని కోరుకుంటున్నా’అన్నారు.డైరెక్టర్ గోవింద్ వరాహ మాట్లాడుతూ - నేను తెలుగులో బాల, నేను నాన్న అబద్ధం, మనుషులతో జాగ్రత్త వంటి చిత్రాలు రూపొందించాను. మలయాళంలో కొన్ని చిత్రాలు రూపొందించాను. మరాఠీలో ఓ సినిమా తెరకెక్కించాను. తెలుగుతో పాటు ఇతర భాషల్లో గూగుల్ మై ఫ్రెండ్ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఎన్నికైన నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు మా మూవీ సాంగ్స్ రిలీజ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి దూరమవుతున్నానేమో అనిపించిన టైమ్ లో గూగుల్ మై ఫ్రెండ్ అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఇకపైనా తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తాను. మా నిర్మాతలు ఇస్తున్న సపోర్ట్ వల్లే వరుసగా సినిమాలు చేయగలుగుతున్నాను. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేస్తున్న నిర్మాతలు ఏఎం రత్నం, కెకె రాధమోహన్, చిట్టూరి శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా’అన్నారు.