breaking news
good friendship
-
నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు..
సమాజంలో మనిషి ఒంటరిగా జీవించలేడు. అనుక్షణం పరిచయాలు, సంబంధాలు, స్నేహాలతోనే అతని జీవితం ముడిపడి ఉంటుంది. అయితే, మనం ఎవరితో కలుస్తున్నాం, ఎవరితో కాలాన్ని గడుపుతున్నామనే అంశమే మన ఆలోచనలను, ప్రవర్తనను, అంతిమంగా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఇస్లామిక్ ధర్మం మంచి సాంగత్యాన్ని ఎంచుకోవడానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.పెద్దలు అంటారు ‘‘నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు’’ అని. ఇది కేవలం లౌకిక సత్యం మాత్రమే కాదు, దివ్యఖుర్ ఆన్ హదీసుల ఆత్మకూడా ఇదే!అత్తరు తావి కావాలి!చెడు ప్రభావం మనిషిపై ఒక్కసారిగా పడదు. కొవ్వొత్తి వెలుగు మాయమైనట్లు, అది నిశ్శబ్దంగా మనలోని మంచి గుణాలను హరిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు మంచి, చెడు సాంగత్యాల ప్రభావాన్ని ఎంతగానో హృదయానికి హత్తుకునేలా వివరించారు: ‘‘మంచి మిత్రుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారి (అత్తరు అమ్మే వ్యక్తి) లాంటివాడు; అత్తరు వ్యాపారి దగ్గర ఉంటే అతడు నీకు సుగంధాన్ని బహుమతిగా ఇస్తాడు, లేదా నీవు కొనుగోలు చేస్తావు... కనీసం ఆ సువాసననైనా ఆస్వాదిస్తావు.’’ (సహీహ్ అల్–బుఖారీ)చెడు అలవాట్లు, భావాలు ఉన్నవారి మధ్య గడిపితే ఎంతటి గట్టి మనస్కుడైనా ఏదో ఒక రోజు తప్పుదోవ పట్టే ముప్పు ఉంటుంది. అదే నైతిక విలువలు, దైవభీతి ఉన్నవారి సరసన ఉంటే మనలో నిశ్శబ్దంగా నైతిక పరిమళాలు వికసిస్తాయి.సత్యవంతుల సహవాసం‘‘ఓ విశ్వసించిన వారలారా! అల్లాహ్‌కు భయపడండి, సత్యవంతులతో (సజ్జనులతో) ఉండండి.’’ (దివ్య ఖుర్ఆన్ 9:119) మనిషి జీవన శైలి అతని మిత్రుని ప్రభావంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మనిషి తన స్నేహితుడి మార్గంలోనే ఉంటాడు. కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి‘ (అబూ దావూద్) అని హెచ్చరించారు.రేపటి పశ్చాత్తాపం వద్దు!తాత్కాలిక లౌకిక ప్రయోజనాల కోసం లేదా వ్యసనాల కోసం చేసే స్నేహాలు పరలోకంలో తీరని నష్టాన్ని మిగులుస్తాయి. ఆనాటి పశ్చాత్తాపాన్ని దివ్య ఖుర్ ఆన్ ఇలా కళ్లకు కడుతోంది: ‘‘ఆ రోజు పాపాత్ముడు తన చేతులను కొరుక్కుంటూ... ’అయ్యో! నేను ఫలానా వ్యక్తిని నా మిత్రుడిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది!’ అని వా΄ోతాడు.’’ (దివ్యఖుర్ ఆన్ 25:27–28)అందుకే స్నేహంలో కొన్ని కీలకమైన నియమాలు పాటించాలి:1. మితమైన స్నేహం: ఆత్మీయతలో సమతుల్యత ఉండాలి. రహస్యాలను, గతంలో చేసిన ΄÷రపాట్లను ఇతరుల ముందు విప్పకూడదు. తప్పులకు దేవుని సమక్షంలో పశ్చాత్తాపపడాలి (తౌబా చేయాలి) తప్ప, పబ్లిక్‌లో పరచడం వల్ల భవిష్యత్తులో అది బలహీనతగా మారుతుంది.2. గృహ రక్షణ: మన అంతరంగ వలయం లోకి ధర్మనిష్ఠ గలవారినే రానివ్వాలి. రకరకాల అలవాట్లు ఉన్న సాధారణ పరిచయస్తులను ఇంటి పరిధికి దూరంగా ఉంచడం వల్ల కుటుంబంలో, పిల్లలలో మంచి సంస్కారం నిలుస్తుంది.అద్దం లాంటి మిత్రుడుసచ్ఛీలుడైన మిత్రుడు ‘అద్దం’ లాంటివాడు. అద్దం ముఖంపై ఉన్న మచ్చను ఏ అసూయా లేకుండా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే నిజమైన మిత్రుడు మనలో లోపం ఉన్నప్పుడు దయతో, రహస్యంగా సరిదిద్దుతాడు. అటువంటి సద్విమర్శను అహంకారం విడిచి వినయంతో స్వీకరించడమే ఆత్మవికాసానికి తొలిమెట్టు.విశాల ప్రపంచంలో వేలాది పరిచయాలు ఉండవచ్చు. కానీ మనల్ని దైవ మార్గంలో నిలబెట్టే, మన ప్రవర్తనను సన్మార్గంలో నడిపించే కొద్దిమంది ‘సజ్జనుల’ సాంగత్యమే మన నిజమైన సంపద. మన చుట్టూ ఉన్నవారిని ఒకసారి పరిశీలించుకుందాం... వారు మనల్ని వెలుగు వైపు నడిపిస్తున్నారా, లేదా అంధకారం వైపు గుంజుతున్నారా?– ముహమ్మద్ ముజాహిద్నిర్వహణ: డి.వి.ఆర్. -
శతక నీతి – సుమతి ‘‘..సతాం సంగో...’’ పాటించండి
ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు. దుర్యోధనుడికన్నా ప్రమాదకారి. అంత పరమదుర్మార్గుడయిన ధృతరాష్ట్రుడికి శ్రీ కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా దృష్టినిచ్చి నిండు సభలో తన విశ్వరూప దర్శనానికి అవకాశం ఇచ్చాడు. అలా ఎందుకిచ్చాడంటే... ఆయనకున్న ఒకే ఒక అర్హత చూసి. ఆ ఒక్క సుగుణం ఏమిటి! ప్రతిరోజూ రాత్రి పరమ ధర్మాత్ముడయిన విదురుడిని పక్కన కూర్చోబెట్టుకుని మంచి మాటలు వింటాడు.. పాటించడు. కానీ విదురుడు లేకపోతే విలవిల్లాడిపోతాడు. ఆయన చెప్పేవన్నీ వింటాడు. ‘ఒక మహాత్ముడిని చేరదీసావు, ఆయనతో కలిసి ఉన్నావు, ఆయన చెప్పినవన్నీ వింటున్నావు.. ఈ ఒక్క కారణానికి నీకు విశ్వరూప సందర్శనకు అవకాశం ఇస్తున్నాను’ అన్నాడు కృష్ణ పరమాత్మ. సత్పురుషులతో సహవాసం అంత మేలు చేస్తుంది. మంచివారితో ప్రయత్నపూర్వకంగా స్నేహం చేస్తుండాలి. వారు నిన్ను పేరు పెట్టి పిలిచినా, బంధుత్వంతో పిలిచినా, నీవు వారింటికి వెళ్ళగలిగినా, వారు తరచుగా నీతో మాట్లాడుతున్నా నీవు చాలా అదృష్ట్టవంతుడివని జ్ఞాపకం పెట్టుకో... ఎందుకని అంటే... భగవంతుడు బాగా ఇష్టపడేది తనని పూజించే వాళ్లని కాదు, తాను చెప్పిన మాటలను ఆచరించేవారిని. మంచి వారితో కలిసుండే వారినే ఇష్టపడతాడు.. భాగవతంలో అజామిళోపాఖ్యానం– అనే అద్భుతమైన ఘట్టం ఒకటి ఉంది. ఎప్పుడూ మంచి పనులు చేసేవారిని.. వారినే కాదు.. వారి వారి వారి తాలూకు వారి జోలికి కూడా వెళ్ళవద్దు, వారినెవరినీ నా దగ్గరకు తీసుకుని రావద్దు–అంటాడు యమధర్మరాజు తన భటులతో...అందులో. అందుకే లోకంలో ఒక సామెత ఉంది... ‘‘అసారే ఖలు సంసారే సారమేతచ్చతుష్టయం కాశ్యం వాసః సతాం సంగో గంగభః శంభుసేవనమ్’’. ఈ నాలుగు విషయాలు చాలా గొప్పవని తెలుసుకుని బతుకు..అని బోధిస్తారు. ఇవి తెలుసుకోకపోతే అసారమైన జీవితంలో ఉండిపోతావు. అసారం..అంటే నీవెంట వచ్చేది కాదు, నీ ఆత్మోద్ధరణకు వచ్చేది కాదు, నీ జీవితాన్ని చక్కదిద్దేది కాదు. ఏవి చాలా గొప్పవి.. అంటే.. కాశీపట్టణానికి వెళ్ళి ఉండడం, సతాంసంగో–సత్పురుషులతో స్నేహం, గంగానదిలోస్నానం చేయడం, శంభుసేవనమ్–శివార్చన చేయడం. ఈ నాలుగింటికన్నా సారవంతమయినవి జీవితంలో ఉండవు. సతాంసంగో.. సత్పురుషులతో సహవాసం చాలా గొప్పది. ‘‘గంగాపాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపం చ దైన్యం చ ఘ్నన్నిత్ సంతో మహాశయః’’ అంటారు. గంగలో స్నానం చేస్తే పాపాలు మాత్రమే పోతాయి, ఎంత వేసవికాలంలో అయినా శరీరంలో ఎంత తాపం కలిగినా, ఒక్కసారి చంద్రుడిని చూసి వెన్నెలలోకి చేరారనుకోండి కేవలం తాపం మాత్రం పోతుంది. కల్పవృక్షం దగ్గరకు చేరితే దరిద్రం మాత్రమే పోతుంది. అదే సత్పురుషులతో కలిసి ఉంటే పాపాలు, తాపాలు, దరిద్రం అన్నీ పోతాయి. తమ కష్టాలను పక్కనబెట్టి ఇతరుల కష్టాలను తమవిగా పరిగణిస్తారు సజ్జనులు. మీ దగ్గర ఏవో ఆశించి అలా చేయరు. అది వారి సహజ లక్షణం. దీనుల విషయంలో వారి మనసు కరిగిపోతుంది. బద్దెన గారు సుమతీ శతకంద్వారా ఇస్తున్న సందేశం కూడా ఇదే .. ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ ...’’.. దుర్జనులతో స్నేహం చేయవద్దు అని. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శింబూ కోసం రైటర్‌గా..
గౌతమ్ మీనన్ మంచి దర్శకుడనే విషయం అందరికీ తెలుసు. ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేశావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. తమిళంలో తాను దర్శకత్వం వహించే చిత్రాలకు గౌతమ్ సంభాషణలు రాస్తుంటారు. ఇప్పుడు శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్న చిత్రానికి డైలాగ్స్ రాయడానికి అంగీకరించారు. అది కూడా ఇంగ్లిష్ డైలాగ్స్. ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌లో తీసి, ఆ తర్వాత తమిళ్, ఇతర దక్షిణాది భాషల్లోకి అనువదించాలనుకుంటున్నామని శింబు పేర్కొన్నారు. గౌతమ్ తీసిన ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో ‘ఏ మాయ చేశావె’)లో, ‘అచ్చమ్ ఎన్బదు మడమయడా’ (తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’) లోనూ శింబూనే హీరో. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న కారణంగానే శింబూకి గౌతమ్ డైలాగ్స్ రాస్తున్నారని ఊహించవచ్చు.


