breaking news
Godrej Group Adi Godrej
-
విభజన దిశగా గోద్రెజ్ గ్రూప్ కుటుంబం
న్యూఢిల్లీ: సబ్బులు, గృహోపకరణాల నుంచి రియల్ ఎస్టేట్ దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీ దిగ్గజం గోద్రెజ్ గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న గోద్రెజ్ కుటుంబం విభజన దిశగా సాగుతోంది. సానుకూల పరిష్కార మార్గంపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం గోద్రెజ్ గ్రూప్‌నకు ఆది గోద్రెజ్ (79) చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన తోడబుట్టిన సోదరుడు నాదిర్ గోద్రెజ్.. గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ ఆగ్రోవెట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఇక గోద్రెజ్ అండ్ బాయిస్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీకి వారి కజిన్ జంషీద్ ఎన్ గోద్రెజ్ సారథ్యం వహిస్తున్నారు. సంబంధిత వర్గాల ప్రకారం ఆది, నాదిర్ ఒక గ్రూపుగా, జంషిద్, ఆయన సోదరి స్మితా గోద్రెజ్ మరో గ్రూపుగా .. వ్యాపార సామ్రాజ్యాన్ని విభజించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. -
పన్ను సమస్యలను విస్మరించిన ప్రధాని: ఆది గోద్రెజ్
న్యూఢిల్లీ: పాత కేసులకు వర్తిం చేలా పన్ను చట్టాలను సవరించడం అనేక సమస్యలు తెచ్చిపెట్టిందని గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ వ్యాఖ్యానించారు. భారత్‌లో వ్యాపారం చేయడమనేది మరింత కఠినతరంగా మారిందని ఆయన చెప్పారు. పలు విషయాలపై పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ అంశాలను ప్రస్తావించకుండా పక్కన పెట్టారని గోద్రెజ్ ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.