విభజన దిశగా గోద్రెజ్‌ గ్రూప్‌ కుటుంబం

Godrej Group All Set For A Split Between The Brothers - Sakshi

న్యూఢిల్లీ: సబ్బులు, గృహోపకరణాల నుంచి రియల్‌ ఎస్టేట్‌ దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీ దిగ్గజం గోద్రెజ్‌ గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న గోద్రెజ్‌ కుటుంబం విభజన దిశగా సాగుతోంది. సానుకూల పరిష్కార మార్గంపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం గోద్రెజ్‌ గ్రూప్‌నకు ఆది గోద్రెజ్‌ (79) చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన తోడబుట్టిన సోదరుడు నాదిర్‌ గోద్రెజ్‌.. గోద్రెజ్‌ ఇండస్ట్రీస్, గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఇక గోద్రెజ్‌ అండ్‌ బాయిస్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీకి వారి కజిన్‌ జంషీద్‌ ఎన్‌ గోద్రెజ్‌ సారథ్యం వహిస్తున్నారు. సంబంధిత వర్గాల ప్రకారం ఆది, నాదిర్‌ ఒక గ్రూపుగా, జంషిద్, ఆయన సోదరి స్మితా గోద్రెజ్‌  మరో గ్రూపుగా .. వ్యాపార సామ్రాజ్యాన్ని విభజించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top