breaking news
Glassdoor website
-
పనిచేయడానికి బెస్ట్ ప్లేస్ ఇదే..
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, అమెరికాలో పనిచేయడానికి బెస్ట్ ప్లేస్‌గా ముందంజలో నిలుస్తోంది. కూపర్టినోకి చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ మాత్రం తన ర్యాంకును కోల్పోయింది. గతేడాది 36వ స్థానంలో నిలిచిన ఆపిల్, ఈ ఏడాది 84వ స్థానానికి పడిపోయింది. దిగ్గజ ఉద్యోగ వెబ్సైట్ గ్లాస్‌డోర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ''100 బెస్ట్ ప్లేసెస్ టూ వర్క్ ఇన్ ది యూఎస్'' పేరుతో గ్లాస్‌డోర్ ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఆపిల్ ఇప్పటికీ అత్యధిక రేటు కలిగిన ఎంప్లాయిర్గానే నిలుస్తోంది. గ్లాస్‌డోర్ రేటింగ్స్‌లో ఇది 5కి 4.3 రేటు సంపాదించుకుంది. పనిచేయడానికి ఉన్నతమైన ప్లేస్‌లో ఫేస్బుక్ అనంతరం గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ చోటు దక్కించుకుంది. దీని తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఇన్-అండ్-అవుట్ బర్గర్, గూగుల్‌లు ఉన్నాయి. '' ఉద్యోగులు ఎక్కువగా ఫేస్బుక్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. సంస్థ మిషన్ ఆధారిత సంస్కృతి, పారదర్శక నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది'' అని గ్లాస్‌డోర్ సీఈవో రోబర్ట్ హన్మాన్ చెప్పారు. అయితే టెక్ దిగ్గజం ఆపిల్ అత్యంత చెత్త వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను ఆఫర్ చేస్తుందని గ్లాస్‌డోర్ తెలిపింది. ఈ కారణంతో ఆపిల్ తన స్థానాలను కోల్పోయినట్టు పేర్కొంది. గ్లాస్‌డోర్ వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో ఎస్ఏపీ 11వ స్థానం, సేల్స్‌ఫోర్స్ 15వ స్థానం, లింక్డిన్ 21వ స్థానం, అడోబ్ 31వ స్థానం, మైక్రోసాఫ్ట్ 39వ స్థానం, స్పేస్ఎక్స్ 50వ స్థానాన్ని సంపాదించుకున్నాయి. 2016 నవంబర్ 1 నుంచి 2017 అక్టోబర్ 22 వరకు ఉద్యోగులు అందించిన కంపెనీ సమీక్షల ఆధారంగా గ్లాస్‌డోర్ ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించింది. -
అమెరికాలో ఏ ఉద్యోగానికి ఎంత జీతం?
వాషింగ్టన్: అమెరికాలో ఏయే రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తారనే విషయం ఎప్పుడు ఆసక్తికరమే. గ్లాస్‌డోర్ వెబ్సైట్ తాజా అంచనాల ప్రకారం అందరికన్నా డాక్టర్లకు ఎక్కువ వేతనాలు అందుకుంటున్నారు. ఆ తర్వాత లాయర్లకు. తదనంతరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేస్తున్న వారికి ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగులు వేతనాల చెల్లింపుల్లో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి నైపుణ్యాన్నిబట్టి ఎక్కువ, తక్కువ వేతనాలు ఉంటాయి. గ్లాస్‌డోర్ వెబ్సైట్ సగటు లెక్కలను మాత్రమే తీసుకొని వివిధ రంగాల్లోని ఉద్యోగాలకు చెల్లిస్తున్న వేతనాలు ఎంతో లెక్కగట్టింది. ఈ వెబ్సైట్ ఉద్యోగస్తులు తమతో షేర్ చేసుకున్న సాలరీ వివరాల ఆధారంగానే ఈ అంచనాలు వేసింది. వాటిలో టాప్ 20 స్థానాల్లో ఉన్న ఉద్యోగాలు, వాటి వేతనాల వివరాలు...... 1. ఏడాదికి ఫిజిషియన్‌కు సగటున 1.80,000 డాలర్లు 2. న్యాయవాదులకు రూ. 1.44,500 డాలర్లు 3. రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్‌కు 1.42,120 డాలర్లు 4. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్‌కు 1,32,000 డాలర్లు 5. ఫార్మసీ మేనేజర్‌కు 1,30,000 డాలర్లు 6. స్ట్రాటజీ మేనేజర్‌కు 1,30,000 డాలర్లు 7. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్‌కు 1,28,250 డాలర్లు 8. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైనర్ ఇంజనీర్‌కు 1,27, 500 డాలర్లు 9. ఐటీ మేనేజర్‌కు 1,23,152 డాలర్లు 10, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్‌కు 1.20,000 డాలర్లు 11. అప్లికేషన్ డెవలప్మెంట్ మేనేజర్ 1,20,000 డాలర్లు 12. సిస్టమ్స్ ఆర్కిటెక్ట్‌కు 1,16,920 డాలర్లు 13. ఫైనాన్స్ మేనేజర్‌కు 1,15,000 డాలర్లు 14. డేటా సైంటిస్ట్‌కు 1,15,000 డాలర్లు 15. రిస్క్ మేనేజర్ 1,15,000 డాలర్లు 16. క్రియేటివ్ డెరైక్టర్‌కు 1,15,000 డాలర్లు 17. డేటా ఆర్కిటెక్ట్‌కు 1,13,000 డాలర్లు 18. టాక్స్ మేనేజర్‌కు 1,10,000 డాలర్లు 19. ప్రాడక్ట్ మేనేజర్‌కు 1,07.000 డాలర్లు 20. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్‌కు 1,06,000 డాలర్లు.