breaking news
Glamour heroine
-
Divi Vadthya: గ్లామర్ లుక్స్ తో అందాల డోస్ పెంచిన బిగ్ బాస్ బ్యూటీ దివి..
-
ముక్కుసూటి బ్యూటీలు
హీరోల హీరోయిజానికి ఫ్లాటైపోయే ఆడియెన్స్... హీరోయిన్ల గ్లామర్‌కి ఫిదా అయిపోతుంటారు. అందుకే అందమంతా పోత పోసినట్టు ఉండే సుందరాంగులను తెచ్చి తెరమీద చూపిస్తుంటారు దర్శకులు. అయితే గ్లామర్ క్వీన్స్‌లా వెలిగిపోతోన్న కొందరు బాలీవుడ్ నటీమణుల అందాలు ఒరిజినల్ కాదు. సర్జరీలతో సరి చేసుకున్నవి. కత్తిగాట్లతో తీర్చిదిద్దుకున్నవి. దానికి సాక్ష్యం వీరే! కత్రినా కైఫ్ ఏ కాస్మొటిక్ యాడ్‌కి అయినా కరెక్ట్‌గా సరిపోయే ఫిగర్ అంటూ అందరూ కితాబిస్తారు కత్రినాకి. అయితే సూటిగా చెక్కినట్టుండే ఆమె ముక్కు, లేత తమలపాకుల్లాంటి ఆమె పెదాలు కత్తి గాట్లకు గురయ్యాకే అంత అందంగా తయారయ్యాయి. కాస్త ఉబ్బెత్తుగా ఉండే పై పెదవి, కొంచెం వంకరగా ఉన్న ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది క్యాట్. శ్రీదేవి అసలు ప్లాస్టిక్ సర్జరీతో అందాన్ని ఇనుమడింపజేసుకోవచ్చు అన్న విషయం చాలామందికి తెలిసిందే శ్రీదేవి వల్ల. చప్పిడిగా ఉండే తన ముక్కుని ప్లాస్టిక్ సర్జరీతో అందంగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపర్చిందామె అప్పట్లో. రెట్టింపైన ఆమె గ్లామర్‌ని చూసి చాలామంది స్టార్లు కాస్మొటిక్ సర్జరీ కోసం క్యూ కట్టారనడంలో అతిశయోక్తి లేదు. ప్రియాంకా చోప్రా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రియాంక ఫొటోని, ఇప్పుడు ప్రియాంక ఫొటోని చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది ఆమె ముఖంలో వచ్చిన మార్పు. బండగా ఉండే తన ముక్కుని రైనోప్లాస్టీ ద్వారా కొంచెం చిన్నగా చేసుకుంది ప్రియాంక. అలాగే ఫెయిర్‌గా కనిపించడం కోసం స్కిన్ ట్రీట్మెంట్లు కూడా తీసుకుందని అంటుంటారు మరి. శిల్పాశెట్టి మనిషేనా, ఏ శిల్పకారుడో చెక్కిన అద్భుత శిల్పమా అన్నట్టుగా ఉంటుంది శిల్ప ఆకృతి. అయితే ముఖంలో మాత్రం ఓ చిన్న వెలితి ఉండేదామెకి. తన ముక్కు అంత బాలేదేమో అని ఫీలయ్యేది శిల్ప. అందుకే తను కూడా కాస్మొటిక్ సర్జరీని ఆశ్రయించింది. ముక్కుని చెక్కుకుని అందాన్ని పెంచుకుంది. వహ్వా అనిపించుకుంది.