breaking news
Girls boarding school
-
విధుల్లోంచి ఉపాధ్యాయుడి తొలగింపు
కురవి : పదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా వ్యవహరించిన స్థానిక ఏకలవ్య బాలికల గురుకుల విద్యాలయం ఉపాధ్యాయుడు వికాస్‌ను విధుల నుంచి తొలగించినట్లు మహబూబాబాద్ డీటీడబ్ల్యూఓ రామ్మూర్తి, ఏటీడబ్ల్యూ రమాదేవి, ఎంఈవో లచ్చిరాం తెలిపారు. ‘గురురూప రాక్షసుడు’ శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. ఈమేరకు శనివారం పాఠశాలకు చేరుకుని బా ధిత బాలికల నుంచి వివరాలు సేకరించారు. ఉపాధ్యాయు డు వికాస్తోనూ అధికారులు మాట్లాడారు. అరుుతే, తాను పాఠాలు బోధించడంలో కటువుగా ఉండడంతోనే బాలికలు తనపై నిందలు వేస్తున్నారని ఉపాధ్యాయుడు తెలిపారు. తా ను ఎలాంటి తప్పుచేయలేదన్నారు. అధికారులు మాట్లాడు తూ, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని విధుల్లోంచి తొలగించామన్నారు. సంఘటనపై విచారణ కొనసాగిస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి, మేట్రిన్ శోభారాణి పాల్గొన్నారు. కాగా, శుక్రవారం రాత్రే సీఐ కరుణాకర్‌రెడ్డి గురుకులంలో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని బాలికలతో చెప్పారు. -
ఘనంగా కార్గిల్ దివస్
తాండూరు టౌన్ : పట్టణ శివారులోని బాలికల గురుకుల పాఠశాల (ఏపీఆర్ఎస్) విద్యార్థినులు శనివారం ఘనంగా కార్గిల్ దివస్‌ను నిర్వహించారు. విద్యార్థినులు సైనిక దుస్తుల్లో జాతీయ జెండాను చేతపట్టుకుని విజయోత్సాహంతో పరుగులు తీశారు. పలు విన్యాసాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కార్గిల్ ప్రాంతంలో జరిగిన పోరాటంలో మన దేశ సైనికులు విజయబావుటా ఎగురవేశారన్నారు. నాటి యుద్ధంలో మరణించిన వీరులకు జోహార్లు అర్పిస్తూ ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ దివస్‌ను జరుపుకుంటామన్నారు. దేశ సేవకు మించిన కార్యం ఏదీ లేదని, యువత సైన్యంలో చేరి దేశ రక్షణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంబాపూర్ ఎస్ఎంసీ చైర్మన్ వెంకటయ్య, ఉపాధ్యాయులు రాజేశ్వరి, బాలకృష్ణ, శ్రీధర్, రఘు పాల్గొన్నారు.