breaking news
gets bail
-
చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తీన్మార్ మల్లన్న
సాక్షి, హైదరాబాద్: ‘క్యూ న్యూస్’ ఛానల్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌కు సోమవారం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్ గూడ జైలు నుంచి తీన్మార్ మల్లన్న బెయిల్‌పై విడుదలయ్యారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఓ జ్యోతిష్యుడు కొద్ది రోజుల క్రితం చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్ క్రైం పోలీసులు సోదాలు జరిపారు. కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. చదవండి: Q News Mallanna: తీన్మార్ మల్లన్నపై ఇన్ని కేసులా? బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. కాగా తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు అయ్యియి. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేయగా.. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇదివరకే బెయిల్ మంజూరైంది. అయితే పెండింగ్‌లో ఉన్న చిలకలగూడ కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే బెయిల్ కోసం తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
ఐసీఐసీఐ స్కాం : చందాకొచర్‌కు ఊరట
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ కొచర్‌కు భారీ ఊరట లభించింది. ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఎండీ చందాకొచర్ భర్త, దీపక్ కొచర్‌కు బొంబాయి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలతో గత ఏడాది సెప్టెంబర్‌లో దీపక్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే జైల్లో ఉండగానే కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19 చికిత్స నిమిత్తం అనుమతి కోరుతూ పెట్టుకున్న అర్జీని ముంబై ప్రత్యేక కోర్టు గతంలో పలుమార్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
బెయిల్ తీసుకున్న వెంకటగిరి ఎమ్మెల్యే
వెంకటగిరి ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కె.రామకృష్ణ నెల్లూరు పట్టణ వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో బెయిల్ తీసుకున్నారు. రామకృష్ణపై నమోదు అయిన నాన్‌బెయిల్‌బుల్ కేసులో నగర పోలీసులు సెక్షన్లు మార్చారు. దాంతో ఆయన బెయిల్ తీసుకోవడం సులువైంది. నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదైన ఎమ్మెల్యేకు బెయిల్ ఇచ్చారంటూ వైఎస్ఆర్ సీపీ నాయకలు పోలీసులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సెక్షన్లు మార్చామని పోలీసులు వెల్లడించారు.