-
పట్టు సాధిస్తేనే మెట్టెక్కేది... లక్ష్యం నెరవేరాలంటే పట్టు తప్పనిసరి
సాక్షి హైదరాబాద్: సర్కారు ఉద్యోగం నిరుద్యోగుల కల. ఆ స్వప్నం సాకారం కావాలంటే పట్టుదల తప్పనిసరి. చదవడం.. సమీక్షించుకోవడం.. పట్టు సాధించడం ఇవే ప్రభుత్వ ఉద్యోగానికి తొలిమెట్టు. ఈ మెట్టు ఎక్కడానికి ప్రణాళిక అవసరం. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భర్తీ చేస్తున్న గ్రూప్–1, 2, ఉపాధ్యాయ, పోలీసు, ఇతర శాఖల పోస్టుల సాధనలో పైచేయి సాధించడానికి అభ్యర్థులు సంసిద్ధులవుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణులు సూచనలు అందిస్తున్నారు. సిలబస్ ముఖ్యం.. పరీక్ష ఏదైనా సిలబస్‌ను ఔపోసన పట్టాలని.. సిలబస్ ప్రామాణిక పత్రంగా పెట్టుకొని సన్నద్ధం కావాలని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు రాయబోయే పరీక్ష సిలబస్, పరీక్ష స్వరూపాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు గత పరీక్ష ప్రశ్న పత్రాలు పరిశీలించి, వాటిపై కసరత్తు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయి. ‘తెలంగాణ’కు ప్రాధాన్యం రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోటీ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సిలబస్‌లో మార్పులు చేసింది. పోటీ పరీక్షల్లో తెలంగాణ ప్రాంత రాజకీయ–సామాజిక చరిత్రకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ సిలబస్ రూపొందించారు. తెలంగాణ చారి త్రక నేపథ్యం మొదలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు చోటుచేసుకున్న అనేక అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమం, నక్సలిజం, రాష్ట్ర ఏర్పాటులో వివిధ రాజకీయ పార్టీల పాత్ర, టీఆర్ఎస్ ఏర్పా టు మొదలైన అంశాలపై కూడా పట్టు సాధించాలి. జనరల్ స్టడీస్‌పై పట్టు రాబోతున్న ఉద్యోగ పరీక్షల్లో ‘జనరల్ స్టడీస్’ ప్రతి పరీక్షలోనూ కనిపించే సబ్జెక్ట్. జీఎస్‌పై పట్టు సాధిస్తే గ్రూప్ –1 నుంచి మొదలు పంచాయతీ సెక్రటరీ పోస్టుల వరకు సగం సన్నద్ధత లభించినట్లే. అభ్యర్థులు తాము రాయబోయే పరీక్షల సిలబస్‌లో జీఎస్‌కు ఎలాంటి సిలబస్ ఇచ్చారో ఒకసారి క్షుణ్నంగా పరిశీలించి ప్రామాణిక పుస్తకాలు ఎంచుకొని సన్నద్ధమవ్వాలి. పాలిటీ, ఎకానమీ, చరిత్ర, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ మొదలైన జనరల్ స్టడీస్ సబ్జెక్టులకు సమకాలీన అంశాలను జోడిస్తూ చదువుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక పుస్తకాల ఎంపికలోనూ జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో లభించే ప్రతి పుస్తకం కాకుండా తెలుగు అకాడమీ పుస్తకాలు, ఏదైనా ప్రముఖ రచయితల పుస్తకాలు సేకరించుకొని చదువుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు ఏదైనా ఒక్కటే పుస్తకాన్ని పలుమార్లు రివిజన్ చేయడం మేలు. ఇటీవల కాలంలో యూట్యూబ్‌లో కొన్ని చానల్స్ ఉచితంగా పోటీ పరీక్షల సిలబస్‌ను బోధిస్తున్నాయి. ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి పోటీ పరీక్ష ఏదైనా సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్, గత ప్రశ్నపత్రాలు చూడాలి. ముఖ్యంగా పోలీసు పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి. కానిస్టేబుల్, ఎస్సైలకు ప్రిలిమ్స్ వరకు సిలబస్ కామన్‌గా ఉంటుంది కాబట్టి ఒకేసారి సన్నద్ధమవ్వచ్చు. ప్రధాన పరీక్ష సిలబస్ కూడా ఒకేలా కనిపిస్తున్నా మరింత లోతుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈవెంట్స్‌లో మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను సులువుగా దక్కించుకోవచ్చు. – రాజశేఖర్, ఐరైజ్ ఫౌండర్ పీవీ స్మారక గ్రంథాలయంలో ప్రిపేర్ కండి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ కమిటీలో పీవీ నరసింహారావు స్మారక గ్రంథాలయంలో ఉద్యోగార్థులు చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ, కమిటీ చైర్పర్సన్ వాణీదేవి తెలిపారు. కమిటీ ప్రాంగణంలోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇక్కడి గ్రంథాలయంలో అవసరమైన సమాచారం, పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రంథాలయంలో చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పీవీ స్మారక గ్రంథాలయం తెరిచి ఉంటుందని ఆమె తెలిపారు. సమావేశంలో సురభి సోలార్ ఎనర్జీ కేంద్రం డైరెక్టర్ శేఖర్ మారంరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వాణీదేవి -
మెహరున్నీసా అంటే అర్థం?
1. బాబర్ పూర్తి పేరు? 1) ఉమర్ షేక్ మీర్జా 2) జహీరుద్దీన్ మహ్మద్ బాబర్ 3) దౌలత్– ఖాన్– లోడీ 4) సుల్తాన్ అహ్మద్ మీర్జా 2. టర్కీ భాషలో బాబర్ అంటే అర్థం? 1) సింహం 2) పులి 3) వీరుడు 4) ధైర్యశాలి 3. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన తేదీ? 1) 1526 జనవరి 20 2) 1526 ఫిబ్రవరి 7 3) 1526 మార్చి 20 4) 1526 ఏప్రిల్ 21 4. ‘జిందాఫీర్’ అని ఎవరిని పిలిచేవారు? 1) బాబర్ 2) అక్బర్ 3) షాజహాన్ 4) ఔరంగజేబు 5. కిందివారిలో బాబర్ ఎవరి భక్తుడు? 1) షేక్ సలీం చిష్ఠి 2) బాబా ఫరీద్ ఉద్దీన్ 3) భక్తియార్ కాకి 4) షేక్ ఉబైదుల్లా 6. బాబర్‌కు సమకాలీనుడైన దక్షిణాది విజయనగర పాలకుడు ఎవరు? 1) ఫ్రౌడ దేవరాయలు 2) శ్రీకృష్ణదేవరాయలు 3) మొదటి బుక్కరాయలు 4) రెండో వేంకటపతిరాయలు 7. షాజహాన్ కాలాన్ని నిర్మాణాల పరంగా ఎవరితో పోలుస్తారు? 1) జూలియస్ సీజర్ 2) మొదటి చార్లెస్ 3) మొదటి జేమ్స్ 4) అగస్టస్ 8. హుమాయూన్ అంటే అర్థం? 1) దురదృష్టవంతుడు 2) అదృష్టవంతుడు 3) విజ్ఞానవంతుడు 4) అజ్ఞాని 9. గ్రంథాలయం మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు హుమాయూన్ 1556 జనవరి 24న జారిపడ్డాడు. ఆ గ్రంథాలయం ఉన్న భవనం పేరు? 1) దీన్పణ్ లేదా షేర్ మండల్ 2) దివాన్ – ఇ – ఆమ్ 3) దివాన్ – ఇ – ఖాస్ 4) లాల్ ఖిల్లా 10. షేర్షా అసలు పేరు? 1) నాజీరుద్దీన్ 2) జహీరుద్దీన్ 3) ఫరీద్ 4) సలీం 11. మీనా బజార్లు, ఖుషీ బజార్లు ఏర్పాటు చేసిన మొఘల్ రాజు? 1) బాబర్ 2) హుమాయూన్ 3) అక్బర్ 4) జహంగీర్ 12. షేర్షా కాలంలో కలింజర్ కోట పాలకుడు? 1) రాణా ఉదయ్‌సింగ్ 2) రతన్‌సింగ్ 3) రాజా కిరాత్ సింగ్ 4) మాల్థేవ్ రాథోడ్ 13. కలింజర్ కోటను షేర్షా ఏ సంవత్సరంలో ఆక్రమించాడు? 1) క్రీ.శ. 1543 2) క్రీ.శ. 1544 3) క్రీ.శ. 1545 4) క్రీ.శ. 1546 14. షేర్షా బెంగాల్‌ను ఎన్ని సర్కార్లుగా విభజించాడు? 1) 40 2) 47 3) 52 4) 57 15. షేర్షా నిర్మించిన గ్రాండ్ ట్రంక్‌రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? 1) కోల్‌కతా నుంచి తక్షశిల 2) ముర్షీదాబాద్ నుంచి ఆగ్రా 3) సోనార్గావ్ నుంచి అట్టక్ 4) లాహోర్ నుంచి ముల్తాన్ 16. జీలం నది ఒడ్డున షేర్షా నిర్మించిన నిర్మాణం? 1) ససారం సమాధి 2) లాల్ ఖిల్లా 3) రోహటస్ ఘర్ 4) పురానా ఖిల్లా 17. మెహరున్నీసా అంటే అర్థం? 1) మహిళా లోకానికి సూర్యబింబం 2) అంతఃపుర సుందరి 3) భూమిలో స్వర్గం 4) ప్రపంచ సుందరి 18. అక్బర్ గుజరాత్‌పై దండెత్తినప్పుడు గుజరాత్ పాలకుడు ఎవరు? 1) మూడో ముజఫర్ షా 2) బాజ్ బహదూర్ 3) బహదూర్ ఖాన్ 4) బైజూబావారా సమాధానాలు 1) 2 2) 2 3) 4 4) 4 5) 4 6) 2 7) 4 8) 2 9) 1 10) 3 11) 2 12) 3 13) 3 14) 2 15) 3 16) 3 17) 1 18) 1 -
రసాయన శాస్త్రం.. అనువర్తనాలు
జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్స పాత్ర కీలకం. అందులో అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా రసాయన శాస్త్రానికి సంబంధించి పరిభాష, వివిధ పదార్థాల సంఘటనం, అనువర్తనాలు, శాస్త్రవేత్తలు-వారి ఆవిష్కరణలపై నేరుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటిని పట్టికల రూపంలో చదువుకుంటే తేలిగ్గా, ఎక్కువకాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. అటువంటి కొన్ని అంశాల ప్రత్యేకం. మూలకాల సంకేతాలు చాలావరకు మూలకాలను వాటి ఆంగ్ల నామంలోని మొదటి అక్షరంతో సూచిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మూలకాల మొదటి అక్షరాలు ఒకేవిధంగా ఉంటే.. మూలకంలోని రెండో అక్షరాన్ని లేదా ప్రస్ఫుటమైన అక్షరాన్ని మొదటి అక్షరానికి కలిపి సంకేతంగా సూచిస్తారు. వీటిని గుర్తించటం తేలిక. ఉదా: హైడ్రోజన్ (ఏ), కాల్షియం (ఇ్చ), కాడ్మియం (ఇఛీ). అయితే కొన్ని మూలకాల సంకేతాలను వాటి లాటిన్ పేర్ల నుంచి తీసుకున్నారు. వాటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మూలకం లాటిన్ పేరు సంకేతం సోడియం నేట్రియం (Natrium) పొటాషియం కాలియం ఇనుము (ఐరన్) ఫై (Ferrum) రాగి (కాపర్) క్యుప్రం (Cuprum) బంగారం(గోల్డ్) ఆరమ్ (Aurum) Au పాదరసం (మెర్క్యురీ) హైడ్రార్జిరం (Hydrargyrum) సీసం (లెడ్) ప్లంబం (Plumbum) తగరం(టిన్) స్టానమ్ (Stannum) ఆంటిమొని స్టిబియం (Stibium) టంగ్స్టన్ వోల్ఫ్రం (Wolfram) W మూలకాలు - ప్రత్యేకత ప్రత్యేకతలు కలిగిన మూలకాలు: ప్రతి మూలకానికి ఏదో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. అటువంటి వాటిలో కొన్ని.. మూలకం {పత్యేకత హైడ్రోజన్ అత్యంత తేలికైన వాయువు; న్యూట్రాన్లు లేని ఏకైక మూలకం; సాధారణ ఆమ్లాల్లో తప్పనిసరిగా ఉండే మూలకం లిథియం ఠీ అత్యంత తేలికైన లోహం పాదరసం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే లోహం బ్రోమిన్ ఠీ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే అలోహం సిల్వర్ అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం ఆక్సిజన్ భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం (అలోహం) అల్యూమినియం ఠీ భూపటలంలో అత్యధికంగా ఉండే లోహం సిలికా శిలలు, ఇసుకలో అత్యధికంగా ఉండే మూలకం నైట్రోజన్ గాలిలో అత్యధిక శాతం గల మూలకం కాల్షియం మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం సీసియం అత్యధిక లోహ స్వభావం గలది ఫ్లోరిన్ అత్యధిక రుణవిద్యుదాత్మకత గలది క్లోరిన్ అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గలది హీలియం అత్యధిక అయనీకరణ శక్మం; అత్యల్ప చర్యాశీలత; అత్యంత జడత్వం గల మంద వాయువు; ద్రవ రూపంలో పాత్రలపైకి ఎగబాకుతుంది (సూపర్ ఫ్లూయిడ్) రాగి మానవుడు ఉపయోగించిన మొదటి లోహం బంగారం ఠీ రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉన్న లోహం గాలియం వేసవి ద్రవంగా పిలిచే లోహం (చేతి ఉష్ణోగ్రతకు కరుగుతుంది) టైటానియం ఉక్కులో సగం బరువు, సమాన గట్టిదనం గల లోహం {V>Oఫెట్ రూపం అలోహమైనప్పటికీ విద్యుత్ లోని కార్బన్ వాహకత కలిగిన మూలకం మూలకాలు - అనువర్తనాలు నిత్యజీవితంలో అనేక మూలకాలు వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. శరీరంలో జరిగే వివిధ ప్రక్రియలలో, పరిశ్రమలలో, పరికరాలలో ప్రత్యేక పాత్రను పోషిస్తాయి. మూలకం అనువర్తనం ఇనుము ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్లో ఉంటుంది. ఇది లోపిస్తే రక్తహీనత కలుగుతుంది. హేబరు పద్ధతిలో ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. నికెల్ నూనెల హైడ్రోజనీకరణంలో ఉత్ప్రే రకం కోబాల్ట్ విటమిన్ బి12లో ఉండే లోహం మెగ్నీషియం మొక్కల్లోని పత్రహరితంలో ఉంటుంది మాంగనీస్ స్త్రీ, పురుషుల్లో ప్రత్యుత్పత్తి హార్మోన్లకు అవసరమైంది. కాల్షియం ఠీ ఎముకల నిర్మాణంలోని లోహం ఫ్లోరిన్ దంతక్షయాన్ని నివారిస్తుంది. ఇది ఎక్కువైతే ఫ్లోరోసిస్ వస్తుంది. సిలికాన్ సోలార్ ప్యానల్లు, కంప్యూటర్ల ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల తయారీలో క్లోరిన్ నీటిని క్రిమిరహితం చేసేందుకు {V>Oఫెట్ యంత్రాలలో కందెనగా, డ్రెసైల్లో, అణువిద్యుత్ కేంద్రాల్లో మితకారిగా పొటాషియం శరీరంలో నీటి సమతౌల్యత కాపాడటంలో, రక్తపోటు నియంత్రణలో సోడియం రక్తపోటును పెంచుతుంది. నీటి సమతౌల్యత కాపాడటంలో {దవ సోడియం అణు రియాక్టర్లలో శీతలీకరణి టంగ్స్టన్ విద్యుత్ బల్బులలో ఫిలమెంట్‌గా సల్ఫర్ రబ్బరు వల్కనీకరణ ప్రక్రియలో కాల్షియం, మెగ్నీషియం: కఠిన జలంలో ఉండే అయాన్లు అయొడిన్ థైరాయిడ్, గాయిటర్ నియంత్రణలో మెర్క్యురీ థర్మామీటర్, భారమితిలలో జింక్ గాల్వనైజేషన్ ప్రక్రియలో కోబాల్ట్-60 ఇది రేడియోధార్మికత గల ఐసోటోప్. ఇది విడుదల చేసే గామా కిరణాలతో కేన్సర్‌కు చికిత్స చేస్తారు. యురేనియం-238 అణు ఇంధనం సీసం (లెడ్) రేడియోధార్మికతకు రక్షణ కవచం; ఠీ వాయుకాలుష్యంలో ముఖ్యలోహం. రసాయనాలు-సాధారణ నామాలు అనేక రసాయనిక పదార్థాలను సాధారణ పేర్లతో పిలుస్తారు. వాటిలో కొన్ని.. సాధారణ నామం రసాయన నామం తినే సోడా, వంట సోడా, బేకింగ్ సోడా సోడియం బైకార్బొనేట్ వాషింగ్ సోడా సోడియం కార్బొనేట్ కాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్సైడ్ వాటర్ గ్లాస్ సోడియం సిలికేట్ లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్ స్మెల్లింగ్ సాల్ట్ అమ్మోనియం క్లోరైడ్ సున్నపు రాయి కాల్షియం కార్బొనేట్ టేబుల్ సాల్ట్ సోడియం క్లోరైడ్ వెనిగర్ ఎసిటికామ్లం మార్ష వాయువు ఠీ మీథేన్ మిల్క్ ఆఫ్ లైమ్, తడి సున్నం కాల్షియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఠీ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఠీ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ హైపో సోడియం థయోసల్ఫేట్ {దవరాజం గాఢ హైడ్రోక్లోరికామ్లం + (ఆక్వారీజియం) గాఢ నత్రికామ్లం (3:1) గన్ కాటన్ సెల్యులోజ్ నైట్రేట్ రసాయనాలు - ఉపయోగాలు రసాయన పదార్థాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.. రసాయన పదార్థం ఉపయోగం కార్బన్‌డైఆక్సైడ్ మంటలను ఆర్పటానికి టెఫ్లాన్ నాన్‌స్టిక్ వంటపాత్రలు అల్యూమినియం ఇస్త్రీపెట్టెల వంటి విద్యుత్ సిలికేట్ (మైకా) సాధనాలలో విద్యుత్ నిరోధకంగా సల్ఫ్యూరికామ్లం బ్యాటరీలలో ఎర్ర భాస్వరం అగ్గిపుల్లల తయారీలో హైపో ఫొటోగ్రఫీలో జింక్ ఫాస్ఫైడ్ ఎలుకల మందు బొరాక్స్ యాంటీ సెప్టిక్ కాల్షియం ఫాస్ఫేట్ పంటి ఎనామిల్‌లో ఉంటుంది. ఫాస్ఫారికామ్లం శీతలపానీయాలలో వాడతారు ఐరన్ ఆక్సైడ్ టేప్ రికార్డర్ టేపు పైపూతలో, రంగుటద్దాలు, గాగుల్స్‌లో బేకింగ్ సోడా, మిల్క్ ఆఫ్ లైమ్ ఆమ్ల విరోధి (యాంటాసిడ్) పొటాష్ ఆలం నీటి శుద్ధికి, గాయం అయినపుడు రక్తస్రావం ఆపటంలో సిల్వర్ అయొడైడ్ కృత్రిమ వర్షం కురిపించటానికి (మేఘ బీజనానికి) ఓజోన్ నీటి శుద్ధి, స్ట్రాటోవరణంలో ్ఖగ కిరణాల వడపోత కార్బోనికామ్లం సోడానీటిలో, శీతలపానీయాల్లో సెలినియం సల్ఫైడ్ చుండ్రు నివారించే షాంపూల తయారీలో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ నీటిని క్రిమిరహితం చేయటానికి బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్ రైడె క్లీనింగ్ పొటాషియం పర్మాంగనేట్ యాంటీసెప్టిక్ సోడియం బెంజోయేట్ ఆహార నిల్వకారిణి ట్రైక్లోరోకార్బానిలైడ్ (టీసీసీ): మెడికేటెడ్ సబ్బులలో, క్రిమి సంహారిణిగా హైడ్రోజన్ పెరాక్సైడ్: తైలవర్ణ చిత్రాల రంగులను పునరుద్ధరించటానికి, పెర్‌హైడ్రాల్ రూపంలో యాంటిసెప్టిక్‌గా ఉపయోగిస్తారు. శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు రసాయన శాస్త్రగతిని మార్చిన ఆవిష్కరణలు ఎన్నో జరిగాయి. అందులో మానవాళికి ఉపయోగకరమైనవి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని.. శాస్త్రవేత్త ఆవిష్కరణ రూథర్‌ఫర్‌డ పరమాణు కేంద్రకం, ఆల్ఫా, బీటా కిరణాలు జె.జె.థామ్సన్ ఎలక్ట్రాన్ గోల్డ్‌స్టీన్ ఠ ప్రోటాన్ జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ హెన్రీ బెక్వరల్ సహజ రేడియోధార్మికత మేరీ క్యూరీ కృత్రిమ రేడియోధార్మికత రాంట్జన్ కిరణాలు జోహాన్ రిట్టర్ అతినీలలోహిత (్ఖగ) కిరణాలు విలియం హర్షెల్ పరారుణ కిరణాలు విల్లార్ గామా కిరణాలు ఐన్‌స్టీన్ ద్రవ్య-శక్తి నిత్యత్వ నియమం, కాంతి విద్యుత్ ఫలితం ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఫారడే విద్యుద్విశ్లేషణ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు.. శాస్త్రవేత్త కనుగొన్న అంశం మేరీ క్యూరీ కృత్రిమ రేడియోధార్మికత మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఐన్‌స్టీన్ కాంతి విద్యుత్ ఫలితం నీల్స్ బోర్ పరమాణు నిర్మాణం వెంకటరామన్ రామకృష్ణన్ ఠీ రైబోజోమ్ నిర్మాణం 1. పరారుణ కిరణాల ఆచూకీ తెలిపిన మొదటి శాస్త్రవేత్త? 1) బెకరల్ 2) బెల్ 3) హర్షెల్ 4) మాక్స్వెల్ 2. ఐన్‌స్టీన్‌కు ఏ ఆవిష్కరణకు నోబెల్ బహుమతి లభించింది? 1) గామా కిరణాలు 2) అతినీలలోహిత కిరణాలు 3) కాంతి-విద్యుత్ ఫలితం 4) కాంతి ద్వంద్వ స్వభావం 3. ఆమ్లతకు విరుగుడు (యాంటాసిడ్)గా వాడే మిల్క్ ఆఫ్ మెగ్నేషియా ఏది? 1) మెగ్నీషియం అసిటేట్ 2) మెగ్నీషియం హైడ్రాక్సైడ్ 3) మెగ్నీషియం క్లోరైడ్ 4) మెగ్నీషియం నైట్రేట్ 4. కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల తయారీలో ఉపయోగించే మూలకం? 1) ఐరన్ 2) మెగ్నీషియం 3) అల్యూమినియం 4) సిలికాన్ 5. విటమిన్ ఆ12లో గల లోహ అయాన్ ఏది? 1) కోబాల్ట్ 2) జింక్ 3) మెగ్నీషియం 4) ఐరన్ సమాధానాలు: 1) 3; 2) 3; 3) 2; 4) 4; 5) 1 -
తెలుగులో ఏఈఈ జనరల్ స్టడీస్ పేపరు
హైదరాబాద్ : ఏఈఈ పరీక్షల్లో భాగంగా జనరల్ స్టడీస్ పేపర్ తెలుగులో ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్పీఎస్పీ ఛైర్మన్ ప్రొ. గంటా చక్రపాణి వెల్లడించారు. ఆదివారం జరగనున్న ఈ ఏఈఈ ఆన్లైన్ పరీక్షపై శుక్రవారం హైదరాబాద్‌లో టీఎస్పీఎస్పీ ఛైర్మన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ ప్రొ. గంటా చక్రపాణి తెలిపారు. ఆదివారం నిర్వహించే ఈ ఆన్ లైన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయి. -
నిరంతర పునశ్చరణ.. అన్వయ సామర్థ్యమే కీలకం
గ్రూప్-1, 2 జనరల్ స్టడీస్‌లో కీలకమైన విభాగం జనరల్ సైన్స్. ఇందులో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం నుంచి ప్రశ్నలు ఉంటాయి. మన శరీరంతో మొదలుకుని, చుట్టూ ఉన్న ప్రతీ వస్తువు రసాయన అనువర్తనాలతో తయారైనప్పటికీ వాటిని అవగాహన చేసుకోవడం అంత సులభం కాదు. దీనికి ప్రధాన కారణం రసాయన నామాలు, రసాయన ఫార్ములాలు. అయితే ఒక క్రమ పద్ధతిలో తార్కికత జోడించి ప్రిపరేషన్ సాగిస్తే రసాయన శాస్త్రంలో కూడా మెరుగైన మార్కులు సాధించవచ్చు. - డాక్టర్ బి. రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. గ్రూప్-1, 2 జనరల్ స్టడీస్‌లో రసాయన శాస్త్రం నుంచి సగటున 10-15 ప్రశ్నలు వస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా ఈ విభాగం నుంచి అడుగుతున్న ప్రశ్నల సంఖ్య కూడా పెరుగుతోంది. 2012 గ్రూప్-1లో 17 ప్రశ్నలు, గ్రూప్-2లో 21 ప్రశ్నలు ఇచ్చారు. ఈ ప్రశ్నలన్నీ విస్తృతంగా కాకుండా.. మనచుట్టూ, నిత్య జీవితంలో ఎదురయ్యే విషయాలకు, ఉపయోగించే పదార్థాలకు సంబంధించిన అనువర్తనాలపై ఉండటాన్ని గమనించవచ్చు. విభజించి చదువుకోవాలి: రసాయన శాస్త్రాన్ని ప్రధానంగా మూలక రసాయన శాస్త్రం, కర్బన రసాయన శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం, సాధారణ రసాయన శాస్త్రంగా విభజించి చదువుకోవాలి. ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు: పరమాణు నిర్మా ణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధం, రేడియోధార్మికత, కేంద్రక రసాయనశాస్త్రం, వివిధ కుటుంబాలకు చెం దిన మూలకాలు-ఆవర్తనాలు, లోహశాస్త్రం, జీవాణువులు, పాలీమర్లు, ఇంధనాలు, హైడ్రోకార్బన్లు, కొల్లాయిడ్లు, ఆమ్లాలు-క్షారాలు, వాయు నియమాలు, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, ఎరువులు, క్రిమి సంహారిణులు, ఔషధాలు, వివిధ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు, నోబెల్ బహుమతులు, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే రసాయనాలు, గాజు, సిమెంట్, వివిధ పదార్థాల రసాయన నామాలు. రెండు రకాలు ప్రశ్నలు: రసాయన శాస్త్రంలో సాధారణంగా రెండు రకాలు ప్రశ్నలు అడుగుతున్నారు. అవి.. కంటెంట్ ప్రశ్నలు. అనువర్తనాల ఆధారంగా అడిగే ప్రశ్నలు (అప్లికేషన్ టైప్). కంటెంట్ ప్రశ్నలు: ఇటువంటి ప్రశ్నలు జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయి. సాధారణంగా వివిధ రసాయన నామాలపై ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. వీటిని గుర్తు పెట్టుకోవాలంటే నిరంతర పునశ్చరణ (Repeated Revision)అవసరం. అంతేకాకుండా కెమిస్ట్రీని Chemistry is a volatile subject అని కూడా అంటారు. కాబట్టి ప్రిపరేషన్లో పునశ్చరణకు అధిక ప్రాధాన్యత నివ్వాలి. ఉదా: కఠిన జలంలో ఉండే అయాన్లు? (గ్రూప్ -1, 2012) 1) కాల్షియం, మెగ్నీషియం 2) సోడియం, పొటాషియం 3) కాల్షియం, బేరియం 4) సోడియం, జింక్ సమాధానం: 1 వివరణ: నీటి కాఠిన్యత రెండు రకాలు. అవి.. తాత్కాలిక కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత. కాల్షియం, మెగ్నీషియం బై కార్బోనేట్ తాత్కాలిక కాఠిన్యతను, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్లు, సల్ఫేట్లు శాశ్వత కాఠిన్యతను కలిగిస్తాయి. ఈ ప్రశ్న లవణాలలోని కేటయాన్లు కాల్షియం, మెగ్నీషియంలపై ఆధారపడి ఉంది. అంటే సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు ఉంటే తప్ప ఇటువంటి ప్రశ్నకు సమాధానం గుర్తించడం కష్టం. కాబట్టి ప్రిపరేషన్ సమయంలో ఆయా అంశాలకు సంబంధించి సినాప్సిస్ రాసుకోవడంతోపాటు వీలైనన్నిసార్లు పునశ్చరణ చేసుకోవాలి. అనువర్తనాల ఆధారంగా అడిగే ప్రశ్నలు: ఇటువంటి ప్రశ్నలు అన్వయ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. అంటే సబ్జెక్ట్‌ను చదవడం ద్వారా వచ్చిన అవగాహనను వివిధ అంశాలకు అన్వయించే ప్రయత్నం చేయాలి. ఈ అనువర్తనాలన్నీ దాదాపుగా నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో ముడిపడి ఉంటాయి. ఉదా: నిప్పును ఆర్పివేసే ప్రయత్నంలో ఉపయోగించే వాయువు? (గ్రూప్-2, 2012) 1) హైడ్రోజన్ 2) కార్బన్ డై ఆక్సైడ్ 3) సల్ఫర్ డై ఆక్సైడ్ 4) హైడ్రోజన్ సల్ఫైడ్ సమాధానం: 2 వివరణ: ఈ ప్రశ్న కార్బన్ డై ఆక్సైడ్ ధర్మంపై ఆధారపడిన అనువర్తనానికి సంబంధించింది. కార్బన్‌కు ప్రధానంగా రెండు వాయువులు ఉంటాయి. అవి.. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ దహనశీలి, విషపూరితమైంది. కార్బన్ డై ఆక్సైడ్ మంటలనార్పుతుంది. గ్రీన్‌హౌజ్ వాయువు. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొని మొక్కల్లో కార్బోహైడ్రేట్ల తయారీకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక సమ్మేళనం గురించి చదివేటప్పుడు దానికి సంబంధించిన అన్ని అనువర్తనాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. రసాయన శాస్త్రంలో అన్ని అంశాలను కాకుండా కొన్ని ముఖ్యమైన వాటిని పరీక్ష క్లిష్టత మేరకు ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. ఈ క్రమంలో అంశాల వారీగా దృష్టిసారించాల్సినవి. మూలాధారం: రసాయన శాస్త్రానికి మూలాధారంగా భావించే పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక-ఆవర్తన ధర్మాలు, రసాయన బంధం వంటి అంశాల్లోంచి కచ్చితంగా ఒకటి-రెండు ప్రశ్నలు రావచ్చు. పరమాణు నిర్మాణంలో భాగంగా పరమాణు నమూనాలు, విద్యుదయస్కాంత వర్ణపటంలోని వికిరణాలు (కాస్మిక్, గామా, ఎక్స్-కిరణాలు, అతినీలలోహిత, పరారుణ), కాంతి విద్యుత్ ఫలితం దాని అనువర్తనాల గురించి క్షుణ్నంగా చదవాలి. ఆవర్తన పట్టికలోని వివిధ కుటుంబాలు అంటే క్షార లోహాలు, క్షార మృత్తిక లోహాలు, కార్బన్ కుటుంబం, నైట్రోజన్ కుటుంబం, చాల్కోజన్లు, హాలోజన్లు, జడవాయువులపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. వివిధ కుటుంబాలలోని మూలకాలను గుర్తించే నైపుణ్యం సాధించాలి. వాటిలో రేడియోధార్మికత కలిగిన వాటి పట్ల ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఆవర్తన పట్టికపై పట్టు పెంచుకోవాలంటే..ఆవర్తన పట్టికను మనం నిత్యం చూసే ప్రాంతం (రీడింగ్ టేబుల్ లేదా డ్రెస్సింగ్ టేబుల్, స్విచ్చ్ బోర్డు తదితర)లో స్టిక్ చేసి పరిశీలిస్తూండాలి. ఆవర్తన ధర్మాలైన పరమాణు సైజు, అయనీకరణ శక్మం, రుణ విద్యుదాత్మకత, రసాయన ధర్మం వంటి అంశాలకు కూడా ప్రిపరేషన్లో తగినంత ప్రాధాన్యతనివ్వాలి. రసాయన బంధంలో అయానిక, సమయోజనీయ పదార్థాలను గుర్తించే సామర్థ్యం పెంచుకోవాలి. ద్విబంధం, త్రిబంధం ఏ అణువులో ఉంటాయో గుర్తు పెట్టుకోవాలి. హైడ్రోజన్ బంధం అనువర్తనాలు, పదార్థాల ద్రావణీయత, అణువుల ఆకృతి, బంధ కోణం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రేడియోధార్మికత, కేంద్రక రసాయన శాస్త్రం: సహజ, కృత్రిమ రేడియోధార్మికత, ఆల్ఫా, బీటా, గామా వికిరణాలు-ధర్మాలు, కేంద్రక విచ్ఛితి, కేంద్రక సంలీనం -అనువర్తనాలు, అణు రియాక్టర్లకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలి. అంతేకాకుండా దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు, భారజల ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవడం ప్రయోజనకరం. రసాయన పదార్థాలు: వివిధ మూలకాల ధర్మాలతోపాటు ఆయా మూలకాలు ఏర్పరిచే ముఖ్యమైన సమ్మేళనాలపై తరచుగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ క్రమంలో పదార్థాల రసాయన నామాలు, వాటి ఉపయోగాలపై ప్రశ్నలు ఇస్తుంటారు. హైడ్రోజన్, సోడియం, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, అల్యూమినియం, కార్బన్, సిలికాన్, టిన్, లెడ్, నైట్రోజన్, ఫాస్పరస్, ఆక్సిజన్, సల్ఫర్, వివిధ హాలోజన్లు, జడవాయువులు, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ మొదలైన మూలకాలు, వాటి సమ్మేళనాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇంధనాలు: ఘన, ద్రవ, వాయు ఇంధనాల శ్రేష్టత, వివిధ ఇంధనాలలోని అనుఘటక రసాయన పదార్థాలపై ప్రశ్నలడిగే అవకాశం ఎక్కువ. ఇందులో సీఎన్జీ, ఎల్పీజీ, బయోగ్యాస్, గోబర్ గ్యాస్, వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్ ప్రధానమైనవి. అదే సమయంలో పెట్రోలియం గురించి కూడా నేర్చుకోవాలి. ఉదాహరణ-ఎల్పీజీలో ఉండే ప్రధాన వాయువు? (గ్రూప్-1, 2012). సమాధానం: బ్యూటేన్ లోహశాస్త్రం: రసాయన శాస్త్రంలో మరో ముఖ్యమైన విభాగం లోహశాస్త్రం. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం రాగి మొదలు కంచు, ఇత్తడి, స్టీల్ వంటి మిశ్రమ లోహాలు వాటి అనువర్తనాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వివిధ లోహాల ఖనిజాలు (ఉదాహరణ- అల్యూమినియం ఖనిజం-బాక్సైట్), లోహ నిష్కర్షణ ప్రక్రియలోని వివిధ సూత్రాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణ-భర్జనం, భస్మీకరణం. జీవాణువులు, పాలీమర్లు, ఔషధాలు: జీవవ్యవస్థ నిర్మాణం, పని చేయడంలోనూ వివిధ పదార్థాలు పాల్గొంటాయి. వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, లిపిడ్లు, హార్మోన్లు, విటమిన్లు ముఖ్యమైనవి. వీటిపై ప్రత్యేక దృష్టిసారించాలి. అవసరమైతే జీవశాస్త్రంతో అన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. రబ్బర్, సెల్యూలోజ్ ఉత్పన్నాలు, పీవీసీ, టెఫ్లాన్, బేకలైట్ వంటి పాలీమర్లు అనువర్తనాలను వివరంగా చదవాలి. యాంటీపెరైటిక్స్, అనాల్జెసిక్లు, యాంటీబయాటిక్స్, సెడెటివ్స్, యాంటాసిడ్స్ వంటి సాధారణ ఔషధాల గురించి తెలుసుకోవాలి. టీ, సిగరెట్, గంజాయి, శీతలపానీయాల్లో ఉండే పదార్థాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఆమ్లాలు-క్షారాలు: మన ఉదరంలో బలమైన హైక్రోక్లోరికామ్లం ఉంటుంది. తినే సోడా, తమలపాకుకు పూసే సున్నపు తేట క్షార ధర్మం కలిగి ఉంటుంది. వెనిగర్, నిమ్మ ఉప్పు, చీమల కాటు ద్వారా వచ్చే స్రవం అన్నీ ఆమ్లాలే. ఆమ్లాలు-క్షారాలు కలిసి తటస్థీకరణం జరిగితే ఏర్పడేది లవణం. ఇలా వివిధ ఆమ్లాలు- క్షారాలు, లవణాలపై సమాచారాన్ని సేకరించాలి. ముఖ్యంగా నిత్య జీవితంలో ఆయా అంశాలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే అంశాలను పరిశీలిస్తూ చదవడం ప్రయోజనకరం. వివిధ ప్రక్రియలు: బీర్, వైన్ తయారీ, సముద్రపు నీటి నుంచి స్వాదు జలం తయారీ, మొక్కలు నీటిని పీల్చుకోవడం వంటి వివిధ ప్రక్రియలకు సంబంధించిన కిణ్వప్రక్రియ, ద్రవాభిసరణం, తిరోగామి ద్రవాభిసరణం వంటి ప్రక్రియల గురించి ప్రశ్నలు అడగొచ్చు. ద్రావణాలు: ద్రావణం అంటే ద్రవం అని అందరూ భావిస్తుంటారు. కానీ గాలి వంటి వివిధ వాయువుల సజాతీయ మిశ్రమం కూడా ద్రావణమే. అసంతృప్త, సంతృప్త, అతి సంతృప్త ద్రావణాలు, నిజ ద్రావణం, అవలంబనం, కొల్లాయిడ్ల అనువర్తనాలపై ప్రశ్నలు రావచ్చు. మిశ్రమాలు, సమ్మేళనాలు: పదార్థ స్థితిగతుల ఆధారంగా మిశ్రమాలను వేరు చేసే పద్ధతులు, మిశ్రమాలు-సంయోగ పదార్థాల మధ్య భేదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వీటిపై అడిగే ప్రశ్నలు ప్రాథమిక భావనలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ముందుగా మిశ్రమం అంటే ఏమిటి? సంయోగ పదార్థం అంటే ఏమిటి? వంటి అంశాల పట్ల పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. కాలుష్యం: పెరుగుతున్న కాలుష్యం కారణంగా పోటీ పరీక్షల్లో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. హరిత గృహ ప్రభావం లేదా భౌగోళిక తాపం, ఓజోన్ పొరకు చిల్లులు, ఆమ్ల వర్షాలు, ఫ్లోరోసిస్, వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ఫార్మా పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు, అగ్ని పర్వతాలు, గాలి-నీటిలోకి విడుదలయ్యే కలుషితాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించాలి. సూచనలు: - బాయిల్, చార్లెస్ వంటి వాయు నియమాల అనువర్తనాలను పరిశీలించాలి. - రసాయన శాస్త్ర గతిని మార్చిన ఆవిష్కరణలు, సంబంధిత శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలపై కూడా దృష్టి సారించాలి. - నీటి కాఠిన్యతకు కారణమైన లవణాలు, కాఠిన్యతను పోగొట్టే పద్ధతులను తెలుసుకోవాలి. - ఎరువులు, పురుగు మందులు, గాజు, సిమెంట్, అగ్గి పెట్టెలు, టపాకాయల వంటి పరిశ్రమల్లో ఉపయోగించే పదార్థాలపై అవగాహన పెంచుకోవాలి. చదవాల్సినవి: 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫిజికల్ సైన్స్ పుస్తకాలు (పాతవి) ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రసాయన శాస్త్రం పుస్తకాలు ఆయా అంశాలను చదివేటప్పుడు లోతుగా వెళ్లకుండా ధర్మాలు, ఉపయోగాలు వరకు పరిమితమైతే సరిపోతుంది. చదివేటప్పుడు ప్రతి వాక్యాన్ని విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకుంటూ చదవాలి. ప్రతి అంశాన్ని ప్రశ్న కోణంలో ఊహించుకుంటూ ప్రిపేర్ కావడం మంచిది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement