మెహరున్నీసా అంటే అర్థం? | Indian History | Sakshi
Sakshi News home page

మెహరున్నీసా అంటే అర్థం?

Mar 9 2017 12:12 AM | Updated on Sep 5 2017 5:33 AM

బాబర్‌ పూర్తి పేరు?

1.    బాబర్‌ పూర్తి పేరు?
    1) ఉమర్‌ షేక్‌ మీర్జా
    2) జహీరుద్దీన్‌ మహ్మద్‌ బాబర్‌
    3) దౌలత్‌– ఖాన్‌– లోడీ
    4) సుల్తాన్‌ అహ్మద్‌ మీర్జా

2.    టర్కీ భాషలో బాబర్‌ అంటే అర్థం?
    1) సింహం    2) పులి
    3) వీరుడు    4) ధైర్యశాలి

3.    మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన తేదీ?
    1) 1526 జనవరి 20
    2) 1526 ఫిబ్రవరి 7
    3) 1526 మార్చి 20
    4) 1526 ఏప్రిల్‌ 21

4.    ‘జిందాఫీర్‌’ అని ఎవరిని పిలిచేవారు?
    1) బాబర్‌    2) అక్బర్‌
    3) షాజహాన్‌    4) ఔరంగజేబు

5.    కిందివారిలో బాబర్‌ ఎవరి భక్తుడు?
    1) షేక్‌ సలీం చిష్ఠి
    2) బాబా ఫరీద్‌ ఉద్దీన్‌
    3) భక్తియార్‌ కాకి    4) షేక్‌ ఉబైదుల్లా

6.    బాబర్‌కు సమకాలీనుడైన దక్షిణాది విజయనగర పాలకుడు ఎవరు?
    1) ఫ్రౌడ దేవరాయలు
    2) శ్రీకృష్ణదేవరాయలు
    3) మొదటి బుక్కరాయలు
    4) రెండో వేంకటపతిరాయలు

7.    షాజహాన్‌ కాలాన్ని నిర్మాణాల పరంగా ఎవరితో పోలుస్తారు?
    1) జూలియస్‌ సీజర్‌    
    2) మొదటి చార్లెస్‌
    3) మొదటి జేమ్స్‌    4) అగస్టస్‌


8.    హుమాయూన్‌ అంటే అర్థం?
    1) దురదృష్టవంతుడు
    2) అదృష్టవంతుడు
    3) విజ్ఞానవంతుడు    4) అజ్ఞాని

9.    గ్రంథాలయం మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు హుమాయూన్‌ 1556 జనవరి 24న జారిపడ్డాడు. ఆ గ్రంథాలయం ఉన్న భవనం పేరు?
    1) దీన్‌పణ్‌ లేదా షేర్‌ మండల్‌
    2) దివాన్‌ – ఇ – ఆమ్‌
    3) దివాన్‌ – ఇ – ఖాస్‌
    4) లాల్‌ ఖిల్లా

10.    షేర్షా అసలు పేరు?
    1) నాజీరుద్దీన్‌    2) జహీరుద్దీన్‌
    3) ఫరీద్‌    4) సలీం

11.    మీనా బజార్లు, ఖుషీ బజార్లు ఏర్పాటు చేసిన మొఘల్‌ రాజు?
    1) బాబర్‌
    2) హుమాయూన్‌    3) అక్బర్‌    
    4) జహంగీర్‌

12.    షేర్షా కాలంలో కలింజర్‌ కోట పాలకుడు?
    1) రాణా ఉదయ్‌సింగ్‌
    2) రతన్‌సింగ్‌
    3) రాజా కిరాత్‌ సింగ్‌
    4) మాల్థేవ్‌ రాథోడ్‌

13.    కలింజర్‌ కోటను షేర్షా ఏ సంవత్సరంలో ఆక్రమించాడు?
    1) క్రీ.శ. 1543    2) క్రీ.శ. 1544
    3) క్రీ.శ. 1545    4) క్రీ.శ. 1546

14.    షేర్షా బెంగాల్‌ను ఎన్ని సర్కార్లుగా విభజించాడు?
    1) 40        2) 47    
    3) 52        4) 57

15.    షేర్షా నిర్మించిన గ్రాండ్‌ ట్రంక్‌రోడ్‌ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది?
    1) కోల్‌కతా నుంచి తక్షశిల
    2) ముర్షీదాబాద్‌ నుంచి ఆగ్రా
    3) సోనార్‌గావ్‌ నుంచి అట్టక్‌
    4) లాహోర్‌ నుంచి ముల్తాన్‌

16.    జీలం నది ఒడ్డున షేర్షా నిర్మించిన నిర్మాణం?
    1) ససారం సమాధి     2) లాల్‌ ఖిల్లా
    3) రోహటస్‌ ఘర్‌    4) పురానా ఖిల్లా

17.    మెహరున్నీసా అంటే అర్థం?
    1) మహిళా లోకానికి సూర్యబింబం    2) అంతఃపుర సుందరి
    3) భూమిలో స్వర్గం    
    4) ప్రపంచ సుందరి

18.    అక్బర్‌ గుజరాత్‌పై దండెత్తినప్పుడు గుజరాత్‌ పాలకుడు ఎవరు?
    1) మూడో ముజఫర్‌ షా
    2) బాజ్‌ బహదూర్‌
    3) బహదూర్‌ ఖాన్‌    
    4) బైజూబావారా

సమాధానాలు
1) 2    2) 2    3) 4    4) 4    5) 4
6) 2    7) 4    8) 2    9) 1    10) 3
11) 2    12) 3    13) 3    14) 2    15) 3
16) 3    17) 1   18) 1

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement