breaking news
	
		
	
  gandikota Project Expats
- 
  
      2013 భూ సేకరణ చట్టానికి ఏడు సవరణలు
- 
      
                   
                                 2013 భూ సేకరణ చట్టానికి ఏడు సవరణలు
 విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం 2013 భూ సేకరణ చట్టానికి ఏడు సవరణలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం శనివారం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భూ సేకరణ చట్టాన్ని గుజరాత్ తరహాలో అమలు చేయాలని నిర్ణయించింది.
 అలాగే వైఎస్ఆర్ జిల్లా గండికోట నిర్వాసితుల సమస్యలపై చర్చించిన కేబినెట్ రూ.4,029 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపింది. అలాగే రెవెన్యూ రికార్డుల్లో చుక్కల భూముల సమస్యకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని మంత్రివర్ణం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ’ప్రతి ఒక్కరికి ఆరోగ్యం’ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాదికి ఒక్కొక్కరికి రూ.1200 చొప్పున వైద్య బీమా సౌకర్యం కల్పించనుంది.
 


