అరువు తెచ్చుకున్న పోల్‌తో జాతీయ రికార్డు!
భువనేశ్వర్ వేదికగా జరిగిన 65వ జాతీయ అంతరాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కర్నాటకలోని శివమొగ్గకు చెందిన 25 ఏళ్ల సింధుశ్రీ పోల్‌వాల్ట్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది. అరువు తెచ్చుకున్న పోల్‌ను ఉపయోగించి మహిళల పోల్ వాల్ట్‌లో 4.25 మీటర్ల ఎత్తును అధిగమించి సింధుశ్రీ చరిత్ర సృష్టించింది. దీంతో ఇప్పటివరకు ఉన్న 4.23 మీటర్ల జాతీయ రికార్డు బద్దలుకావడమే గాక , 2026 ఆసియా క్రీడల కోసం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన అర్హత మార్కును సునాయాసంగా అధిగమించిన సింధు శ్రీ ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించింది. అదే సమయంలో అంతర్జాతీయ వేదికపై ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని చూడాలని కలలు కన్న తన దివంగత తండ్రికి ఇచ్చిన మాటను కూడా నెరవేర్చి ఔరా అనిపించింది సింధుశ్రీ.పోల్‌వాల్ట్‌లో ఆమె సాధించిన 25 సెంటీమీటర్ల ఎత్తు ఇప్పటికీ సింధుశ్రీ పర్సనల్ బెస్ట్‌గా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో ఒక భారతీయ పోల్ వాల్టర్ చేసిన అత్యంత ముఖ్యమైన జంప్స్లో ఇది ఒకటిగా నిలిచింది. తన సొంతంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పోల్ అందుబాటులో లేకపోవడంతో, ఆమె ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడుతున్న మరో అథ్లెట్ నుంచి అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది.ఆమె 4.10 మీటర్ల ఎత్తును విజయవంతంగా అధిగమించి 2026 ఆసియా క్రీడలకు అర్హత సాధించింది. ఆ తర్వాత 4.25 మీటర్ల ఎత్తును ఎలాంటి ఫౌల్ లేకుండా దూకి జాతీయ రికార్డును అధిగమించింది. ఇప్పటివరకు 4.23 మీటర్ల ఎత్తుతో ఉన్న పాత రికార్డును సింధుశ్రీ బద్దలుకొట్టింది. గేమ్ అనంతరం సింధుశ్రీ మాట్లాడుతూ.. ‘నేను ఒకరోజు దేశం తరపున అంతర్జాతీయ వేదికపై పోటీపడతానని తన దివంగత తండ్రి ఎల్లప్పుడూ చెప్పేవాడని గుర్తుచేశారు. అయితే నా తండ్రి మూడేళ్ల క్రితం గుండెపోటుతో కన్నుమూశారు, కానీ ఆయన ‘బిడ్డా నువ్వు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఆడడం చూడాలి’ అని పేర్కొన్న మాటలు ఇప్పటికీ నాకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. నా సామర్థ్యాలపై ఆయనకు ఉన్న నమ్మకమే ఇవాళ నా విజయానికి కారణమైందని, అందుకే ఈ విజయాన్ని నా తండ్రికి అంకితం చేస్తున్నా’ అని సింధు శ్రీ గేమ్ అనంతరం పేర్కొంది. ఇక 2022 ఆసియా గేమ్స్‌లో సింధు శ్రీ 4.30 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్యం ఒడిసిపట్టింది.Sindhushree flys into the record books! 🚀#IndianAthletics #AFI pic.twitter.com/GAHRIDWIco— Athletics Federation of India (@afiindia) June 25, 2026