breaking news
G. Jagadeesh reddy
-
బాబు ఏజెంటు.. తెలంగాణ ద్రోహి: జగదీశ్‌రెడ్డి
రేవంత్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ సాక్షి, హైదరాబాద్: బ్లాక్ మెయిల్ చేయడానికే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నాడని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, గువ్వల బాలరాజుతో కలిసి బుధవారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఆంధ్రా ప్రభుత్వానికి, చంద్రబాబుకు ఏజెంటుగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. ‘ఆంధ్రా ప్రయోజనాల కోసం తెలంగాణలో పనిచేస్తున్న రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టుగా అబద్ధాలు చెబుతున్నాడు. దుష్ర్పచారానికి దిగుతున్నాడు. ఆంధ్రా ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాడు’ అని ధ్వజమెత్తారు. నిండు శాసనసభలో అసత్యాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకుండా శాసనసభలో ఎలా మాట్లాడతాడని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హెరిటేజ్ పాలపై పరీక్షలు జరిపి, చట్టపరమైన చర్యలను తీసుకుంటామని చెప్పారు. హెరిటేజ్ పాలలో విషపూరితమైన రసాయనాలున్నాయంటూ కేరళ ప్రభుత్వం గతంలో నిషేధం విధించిందన్నారు. దీనిపై సభలో చర్చ జరిగితే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడంలేదన్నారు. హెరిటేజ్‌లో రేవంత్ రెడ్డి కూడా భాగస్వామేనా అని మంత్రి ప్రశ్నించారు. -
మే 16నే అపాయింటెడ్ డేగా ప్రకటించాలి!
హైకోర్టులో నేడు టీఆర్ఎస్ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అపాయింటెడ్ డేగా జూన్ 2నికాకుం డా మే 16ని ప్రకటింపచేసుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 16న వెలువడుతున్నందున, ఆ రోజునే అపాయింటెడ్ డేని ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరనుంది. టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి జి. జగదీష్‌రెడ్డి మంగళవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారు. ఈ పిటిషన్‌ను సోమవారమే హౌజ్ మోషన్ రూపంలో దాఖలు చేసేందుకు ప్రయత్నించగా.. అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల నేపథ్యంలో మంగళవారం ఎలాగూ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు. దీంతో ఆ రోజున రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 8న విచారించనుంది.