breaking news
fresh firing
-
Manipur: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు
ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో మళ్లీ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల ఘటన జరిగింది. గల్లంతైన నలుగురిని ఓయినమ్ రోమెన్ మైతేయి (45), అహంతేమ్ దారా మైతేయి (56), తౌడమ్ ఇబోమ్చా మైతేయి (53), తౌడం ఆనంద్ మైతేయి (27)గా గుర్తించారు. ఘటన తర్వాత కుంబి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. కాల్పులు జరగడానికి ముందు ఆరు రౌండ్ల మోర్టార్ కాల్పులు జరిగాయని స్థానిక నివేదికలు తెలిపాయి. అంతకుముందు జనవరి 1న, తౌబల్స్ లిలాంగ్ ప్రాంతంలో గుర్తుతెలియని సాయుధ దుండగులు, స్థానికుల మధ్య ఘర్షణలు చెలరేగింది. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. మరుసటి రోజే గస్తీలో ఉన్న సాయుధ బలగాలపై దుండగులు కాల్పులు జరిపారు. మణిపూర్‌లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి అడపాదడపా హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
పారిస్‌లో మళ్ళీ కాల్పులు!
-
ప్యారిస్‌లో మళ్లీ కాల్పులు: మహిళా పోలీసు మృతి
పత్రికా కార్యాలయంపై కాల్పుల ఘటనను ఇంకా ఎవరూ మర్చిపోకముందే మరోసారి ప్యారిస్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. హై ఎలర్ట్ ఉన్నా కూడా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని, ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళా పోలీసు అధికారి మరణించారు. అనుమానితుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి ఫ్రాన్స్ హోం మంత్రి బెర్నార్డ్ కాజెన్యూవ్ హుటాహుటిన చేరుకున్నారు. ఈ ఘటన ప్యారిస్ దక్షిణ ప్రాంతంలోని పోర్ట్ డి షాటిల్లన్ ప్రాంతంలో జరిగింది. చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంలో కాల్పులు జరిపి 12 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఈ కాల్పులు జరిగాయి.