breaking news
Frendly policing programs
-
ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్య్వస్థను తీసుకొస్తాం: హోంమంత్రి
-
పబ్లిక్ కాంటాక్ట్ ద్వారా సేవలు
నల్గొండ : నల్గొండ జిల్లా ఎస్పీగా వెంకట రంగనాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నేరుగా కలుసుకోవడం ద్వారా ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ఎఫెక్టివ్ పోలీసింగ్ ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీస్ ఉక్కు పాదం మోపుతుందన్నారు. అక్రమ భూ దందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రత్యేక సోషల్ కార్యక్రమాలు కొనసాగుతాయని నూతన ఎస్పీ వెంకట రంగనాథ్ వివరించారు. -
పోలీసులంటే ప్రజల్లో భయం పోవాలి
చేవెళ్ల రూరల్: చేవెళ్ల పోలీస్ స్టేషన్లో గురువారం ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఆలూరు జట్టు, పోలీస్ జట్టు మధ్య జరిగిన ఈ పోటీలను సీఐ ఉపేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనాలని చెప్పారు. ప్రజలతో కలిసి పనిచేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పోలీసులు అంటే ప్రజల్లో ఉన్న భయం పోవాలన్నారు. ప్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల యువతలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వారితో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెస్ట్ ఆఫ్ త్రీ మ్యాచ్‌లో ఆలూరు జట్టుపై పోలీసుల జట్టు 1-2 తేడాతో విజయం సాధించింది. కార్యక్రమంలో ఎస్ఐలు రాజశేఖర్, ఖలీల్, గొల్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు రాములు, శివలింగం, రమేశ్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పెంటయ్య, పాండు, శ్రీను, ఫరూక్, అంజయ్య, ప్రవీణ్, నాగరాజు, ఆలూరు యూత్‌సభ్యులు పాల్గొన్నారు.