breaking news
Free textbooks
-
‘జెమిని నోట్‌బుక్’లో ఉచితంగా వందలాది పుస్తకాలు!
టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఏఐ విద్యార్థుల అభ్యాసన పద్ధతులను పూర్తిగా మార్చేస్తోంది. డిజిటల్ బోధనా రంగంలో మరో మైలురాయిగా నిలుస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త సంచలనానికి తెరతీసింది. విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఎంతో సులభంగా పరీక్షలకు సన్నద్ధమయ్యేలా తన ‘జెమిని నోట్‌బుక్’ (గతంలో నోట్‌బుక్‌ఎల్‌ఎం) ప్లాట్‌ఫారమ్‌లో వందలాది ఉచిత పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది.‘ఎక్స్పర్ట్ ఇంటెలిజెన్స్’లో భాగంగా అప్డేట్గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఎక్స్పర్ట్ ఇంటెలిజెన్స్’ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ అప్డేట్ను తీసుకొచ్చారు. భారత్, అమెరికా దేశాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు అధికారులు చెప్పారు. కేవలం ఇంటర్నెట్లో దొరికే సాధారణ సమాచారమే కాకుండా, విద్యార్థులు ప్రామాణికమైన పుస్తకాలను ఏఐ సాయంతో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. గతంలో గూగుల్ ప్లే బుక్స్ ద్వారా కొనుగోలు చేసిన ఈ-బుక్స్‌ను మాత్రమే జెమిని నోట్‌బుక్‌లో జోడించడానికి అనుమతి ఉండేది. కానీ తాజా అప్డేట్తో ఈ పరిమితి తొలగిపోయింది.ప్రముఖ విద్యా ప్రచురణకర్తలైన ‘ఓపెన్స్టాక్స్’, ‘ఓపెన్ టెక్స్ట్ బుక్ లైబ్రరీ’తో పాటు భారత్‌కు చెందిన ప్రముఖ పబ్లిషర్ ‘ఎస్ చంద్ పబ్లిషింగ్’ వంటి సంస్థలకు చెందిన వందలాది పుస్తకాలను నేరుగా ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఉచితంగా పొందుపరిచారు.విద్యార్థులకు లభించే ప్రయోజనాలుసాధారణంగా విద్యార్థులు పరీక్షల సమయంలో రివిజన్ నోట్స్ తయారు చేసుకోవడానికి, ముఖ్యమైన అంశాలను వెతకడానికి గంటల తరబడి సమయం వెచ్చిస్తుంటారు. అయితే గూగుల్ జెమిని నోట్‌బుక్ ఈ కష్టాన్ని తగ్గిస్తుంది. విద్యార్థులు విడివిడిగా పుస్తకాలను పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఈ డిజిటల్ లైబ్రరీ నుంచి పుస్తకాలను ఎంచుకోవచ్చు. దీని ద్వారా కింది ప్రయోజనాలుంటాయి.విద్యార్థులు తమ సిలబస్‌కు తగినట్లుగా కీలక అంశాలను క్రోడీకరించి వ్యక్తిగత స్టడీ గైడ్లను క్షణాల్లో తయారు చేసుకోవచ్చు.వివిధ చాప్టర్లు, సబ్జెక్టులపై తమకున్న అవగాహనను పరీక్షించుకోవడానికి ఏఐ సాయంతో ఆటోమేటిక్‌గా ప్రాక్టీస్ క్విజ్‌లను సృష్టించుకోవచ్చు.ముఖ్యమైన నిర్వచనాలు, శాస్త్రీయ వాస్తవాలు, ప్రాథమిక భావనలను త్వరగా గుర్తుంచుకోవడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్లాష్‌కార్డ్స్ ఉపయోగపడతాయి.విద్యార్థులు అడిగే ప్రశ్నలకు జెమిని కేవలం ఏఐ జనరేటెడ్ సమాధానాలనే కాకుండా అసలు పాఠ్యపుస్తకంలో ఆ సమాచారం ఎక్కడ ఉందో సూచించే ఒరిజినల్ లింకులు, సైటేషన్లను కూడా అందిస్తుంది. దీనివల్ల సమాచార ప్రామాణికతను సరిచూసుకునే అవకాశం ఉంటుంది.జెమిని నోట్‌బుక్‌ను ఎలా ఉపయోగించుకోవాలి?మొదటగా (https://notebook.google/) వెబ్‌సైట్‌ను సందర్శించి మీ గూగుల్ ఖాతాతో సైన్-ఇన్ కావాలి.ఒక కొత్త నోట్‌బుక్‌ను సృష్టించాలి లేదా ఇప్పటికే ఉన్న దాన్ని ఓపెన్ చేయాలి.ఆపై ‘Add sources’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.అందుబాటులో ఉన్న కేటగిరీల నుంచి ‘Textbooks’ ఆప్షన్‌ను క్లిక్ చేసి మీకు కావలసిన పాఠ్యపుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి.ఆ పుస్తకాన్ని మీ నోట్బుక్కు జోడించిన తర్వాత దానికి సంబంధించిన చాప్టర్లపై ప్రశ్నలు అడుగుతూ లెర్నింగ్ ప్రాసెస్ ప్రారంభించవచ్చు.నిపుణుల హెచ్చరికఈ టెక్నాలజీ విద్యార్థులకు మేలు చేస్తున్నప్పటికీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా పుస్తకాలు చదవడం లేదా తరగతి గదిలో నేర్చుకునే పద్ధతులకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏఐ అందించే సమాధానాల్లో కొన్నిసార్లు పొరపాట్లు ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఎల్లప్పుడూ ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్‌తో సరిపోల్చుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: మాదేశం వచ్చినవారికి గుడ్‌న్యూస్! -
93 పాఠశాలలు మూత?
విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోరుుంది. ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పేంచేందుకు కృషి చేశారు. అయినప్పటికీ ఆశించనంతగా ఎన్రోల్మెంట్ జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడి యం ప్రవేశపెట్టినట్లు పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫాం వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని విస్తృత ప్రచారం చేశారు. ఎక్కడైతే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారో... ఆయూ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగింది. కానీ...తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగకపోవడమే కాకుండా... తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లాలో అన్ని కేటగిరీల్లో 15,602 ఉపాధ్యాయ పోస్టులుండగా... సుమారు 14,426 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 1,176 ఉపాధ్యాయ వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా... జిల్లాలో 3,266 ప్రభుత్వ పాఠశాలలున్నట్లు విద్యాశాఖ రికార్డులు చెబుతున్నారుు. ఇందులో విద్యార్థుల్లేని పాఠశాలలు 93 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 129 పాఠశాలల్లో పది మందిలోపు, 377 స్కూళ్లలో 20 మంది లోపు, 631 పాఠశాలల్లో 30 లోపు విద్యార్థులున్నట్లు అధికారులు తనిఖీల్లో తేలింది. గత ఏడాది విద్యాశాఖ చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియను గమనిస్తే... ఈ సారి విద్యార్థుల్లేని పాఠశాలలు 93 కచ్చితంగా మూతపడినట్లే. రేషనలైజేషన్ జరిగితే వీటితోపాటు పది మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలు సైతం మూతపడే అవకాశం ఉంది. కాగా, 93 పాఠశాలలు అనధికారికంగా ఇప్పటికే మూతపడగా... ఇందులో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట వేరే పాఠశాలలకు పంపినట్లు సమాచారం. మండలాల వారీగా విద్యార్థుల్లేని బడులు... ఆత్మకూరు 2, భూపాలపల్లి 7, చెన్నారావుపేట 4, చిట్యాల 1, డోర్నకల్ 4, దుగ్గొండి 2, గీసుకొండ 1, స్టేషన్ఘనపూర్ 1, ఘనపూర్ (ములుగు) 2, గోవిందరావుపేట 4, గూడూరు 1, హన్మకొండ 2, జఫర్‌గఢ్ 3, కేసముద్రం 2, ఖానాపూర్ 4, కొడకండ్ల 2, కొత్తగూడ 4, మద్దూరు 1, మహబూబాబాద్ 5, మంగపేట 1, మరిపెడ 3, మొగుళ్లపెల్లి 2, ములుగు 3, నల్లబెల్లి 5, నర్మెట 1, నర్సింహులపేట 1, పరకాల 1, పర్వతగిరి 2, రాయపర్తి 3, రేగొండ 1, సంగెం 4, తొర్రూరు 1, వెంకటాపూర్ 7, వరంగల్ 4, వర్ధన్నపేట 2 293 పాఠశాలల్లో సింగిల్ టీచర్లు జిల్లాలోని 293 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో విద్యాబోధన జరుగుతోంది. 1 నుంచి 5వ తరగతి వరకు ఉండే ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచర్‌తో విద్యాబోధన చేయాల్సి రావడం కష్టసాధ్యం. ఏవైనా కారణాలతో ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుంటే.. ఆ రోజు విద్యార్థులకు సెలవే. సింగిల్ టీచర్ పాఠశాలల్లో మరొక ఉపాధ్యాయుడిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నచోట విద్యావలంటీర్‌ను నియమించే వారు. గత విద్యాసంవత్సరం నుంచి విద్యావలంటీర్ల వ్యవస్థను ఎత్తివేశారు. అవసరమైన చోట అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ఈ విద్యాసంవత్సరంలో అకడమక్ ఇన్స్ట్రక్టర్లను కూడా నియమించలేదు. ఫలితంగా ఆయూ పాఠశాలల్లో విద్యాబోధన సరిగ్గా సాగడం లేదు. మండలాలవారీగా ఏకోపాధ్యాయ పాఠశాలలు... ఆత్మకూరు 4, బచ్చన్నపేట 3, దేవరుప్పల 11, చేర్యాల 3, ధర్మసాగర్ 2, డోర్నకల్ 5, దుగ్గొండి 4, గీసుకొండ 4, స్టేషన్ఘనపూర్ 3, ఘనపూర్ (ములుగు) 6, గోవిందరావుపేట 4, గూడూరు 7, హన్మకొండ 7, హసన్‌పర్తి 2, జనగామ 7, కేసముద్రం 3, ఖానాపూర్ 3, కొడకండ్ల 5, కొత్తగూడ 4, కురవి 3, లింగాల ఘనపూర్ 2, మద్దూరు 3, మహబూబాబాద్ 12, మంగపేట 2, మరిపెడ 20, భూపాలపెల్లి 7, చెన్నారావుపేట 13, మొగుళ్లపల్లి 2, ములుగు 10, నల్లబెల్లి 6, నర్మెట 6, నర్సంపేట 6, నర్సింహులపేట 4, నెక్కొండ 4, నెల్లికుదురు 10, పాలకుర్తి 13, పరకాల 3, పర్వతగిరి 11, రఘునాథపల్లి 5, రాయపర్తి 10, రేగొండ 6, సంగెం 6, శాయంపేట 4, తాడ్వారుు 3, తొర్రూరు 2, వెంకటాపూర్ 8, వరంగల్ 6, వర్ధన్నపేట 1, జఫర్‌గఢ్ 9, చిట్యాల 4 -
చక్కని చదువుకు పంచ సూత్రాలు
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు 12న తెరుచుకోనున్న 3,350 పాఠశాలలు 5 నుంచి విజయభేరి యాత్ర ‘సాక్షి’తో డీఈవో దేవానందరెడ్డి మాటామంతీ చక్కని చదువుల కోసం ఈసారి జిల్లాలో ఐదు సూత్రాలు అమలు చేయనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) డి.దేవానందరెడ్డి చెప్పారు. ఈ నెల 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో డీఈవోను ‘సాక్షి’ సోమవారం పలకరించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో పంచ సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు డీఈవో దేవానందరెడ్డి స్పష్టం చేశారు. కీలకమైన ఐదు అంశాలకు ప్రతి పాఠశాలలో ప్రాధాన్యత ఇస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఉప విద్యాశాఖ అధికారి (డీవైఈవో), మండల విద్యాశాఖ అధికారి(ఎంఈవో) రోజుకు పదేసి పాఠశాలలు చొప్పున తనిఖీ చేసి తనకు రోజువారీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 12న ప్రభుత్వ పాఠశాలలు తెరుస్తున్నందున అదేరోజు ప్రతి విద్యార్థికి ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలు అందినదీ లేనిదీ పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజనం అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు యూనిఫాం అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పాఠశాలలు తెరిచేసరికి ఆయా విద్యాలయాలు, పరిసరాలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థి పైతరగతికి ప్రమోట్ అయ్యాడా లేదా అనే విషయాన్ని పరిశీలించేలా జూన్ 12 నుంచి ప్రతిరోజు ప్రత్యేక పర్యవేక్షణ తీసుకుంటామన్నారు. ఈ ఐదు అంశాల పరిశీలన సమయంలో సమయానికి ఉపాధ్యాయులు బడికి వస్తున్నారా? విద్యాబోధన ఎలా ఉంది? విద్యార్థుల హాజరు ఎలా ఉంది? తదితర అంశాలను కూడా ప్రత్యేకంగా పరిశీలన చేస్తామన్నారు. జిల్లాలో ఐదేళ్లు నిండిన బాలబాలికలు సుమారు 65 వేల మంది ఉన్నారని డీఈవో చెప్పారు. వారి వివరాలను ఎంఈవోలు, అంగన్వాడీలతో సేకరిస్తామన్నారు. వారిలో ప్రతి ఒక్కరిని బడిలో చేర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు వస్తున్నారు... జిల్లాలో ఈసారి కొత్తగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు వచ్చే అవకాశం ఉందని, విద్యా వాలంటీర్ల నియామకం ఉండకపోవచ్చని డీఈవో వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారని, ఇంకా సుమారు 1200 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 6, 7, 8 తరగతులకు పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్ వంటి విభాగాల్లో పార్ట్‌టైం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరుగుతుందన్నారు. పూర్తిస్థాయిలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరిపే విషయం పరిశీలనలో ఉందని తెలిపారు. 20.06 లక్షల పుస్తకాల పంపిణీ... జిల్లాలో ఈసారి 20.06 లక్షల పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్టు డీఈవో చెప్పారు. గతేడాది లక్ష పాఠ్యపుస్తకాలు మిగిలాయని, వాటికి తోడు 19.06 లక్షల పాఠ్యపుస్తకాలు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న 7 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తిచేసినట్టు చెప్పారు. పాఠశాలలు తెరవగానే ఒకటి నుంచి ఆరో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తామని తెలిపారు. సిలబస్ మారడంతో ఈసారి బట్టీ పట్టే విధానం కాకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) పద్ధతిలో విద్యాబోధన ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇంగ్లిషు, తెలుగు, హిందీల్లో చదవడం, రాయడం, లెక్కల్లో బేసిక్స్ నేర్చుకోవడం వంటి పద్ధతులను అవలంబించడంలో ఉపాధ్యాయులే విద్యార్థులకు గైడ్‌గా ఉపయోగపడాలని తెలిపారు. ఇందుకోసం ప్రతి ఉపాధ్యాయుడూ పాఠశాలలు తెరిచేనాటికే సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాల బోధనకు యాన్యువల్ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉండాలని డీఈవో సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్టు డీఈవో చెప్పారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిపారు. జిల్లాలో ప్రతి పాఠశాలలోను బాలికలకు ఇబ్బంది లేకుండా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించినట్టు చెప్పారు. సుమారు 20 పాఠశాలలకు స్థల సమస్య కారణంగా సొంత భవనాలు లేవన్నారు. జిల్లాలో 800 బడులకు ప్రహరీ గోడలు లేవని, పట్టణ ప్రాంతాల్లోని 300 పాఠశాలలకు ఆట స్థలాల కొరత ఉందని తెలిపారు. ఈ వివరాలను ఉన్నతాధికారులకు నివేదించినట్టు ఆయన చెప్పారు. 200 హైస్కూళ్ల పరిధిలో విజయభేరి... జిల్లాలో ఈ నెల 5 నుంచి 15 వరకు విజయభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డీఈవో చెప్పారు. పదోతరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను సన్మానిస్తామన్నారు. ప్రత్యేకంగా ప్రచారం రథం ఏర్పాటు చేసి పది రోజులపాటు జిల్లాలోని సుమారు 200 ఉన్నత పాఠశాలల పరిధిలో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, ఉత్తీర్ణత శాతాలు, విద్యా హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రచార రథం వెళ్లే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు నిర్వహించి పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా బోధనపై సమాచారాన్ని తెలుసుకుని లోపాలు చక్కదిద్దుతామన్నారు. విద్య గొప్పతనాన్ని వివరిస్తూ మానవహారాలు, ర్యాలీలు చేపడతామని డీఈవో వివరించారు.


