వొడాఫోన్ దీపావళి ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని తమ వినియోగదారులకు ఉచిత ఇంటర్నెట్ డేటాను అందిస్తున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది. నవంబర్ 11న 100 ఎంబీ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
దీనికి చేయాల్సిందల్లా వొడాఫోన్ వినియోగదారులు DIWALI అని టైప్ చేసి 199 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపితే చాలని, ఈ ఉచిత డేటాను వినియోగించుకోవచ్చని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.