breaking news
flop show
-
ట్రంప్ మద్దతుదారుల అట్టర్‌ఫ్లాప్ షో
శాన్ఫ్రాన్సిస్కో: ఎన్నికల్లో ఓడిపోయినా ఎలాగైనా పదవిని పట్టుకుని వేలాడాలనుకున్న వ్యక్తి డొనల్డ్ ట్రంప్. అధ్యక్ష పదవిలో ఉండేందుకు అడ్డదారులు తొక్కి ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశంగా ఉన్న అమెరికాను అభాసుపాలయ్యేలా చేశాడు. అలాంటి వ్యక్తిని సోషల్ మీడియా బహిష్కరించింది. ఈ క్రమంలోనే మొన్న ట్విట్టర్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించింది. అయితే ఈ ఖాతా తొలగింపుపై కూడా ట్రంప్ మద్దతుదారులు బీభత్సం చేయాలని భావించారు. కానీ వారు చేయాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టాల్సిన నిరసన కార్యక్రమం అట్టర్ ఫ్లాపయ్యింది. క్యాపిటల్ హౌస్‌పై దాడిని ప్రేరేపించారని తెలియడంతో 88 మిలియన్ల మంది ఫాలోయింగ్ ఉన్న ట్రంప్ ఖాతాను నిలిపివేసిన విషయం తెలిసిందే. శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం (జనవరి 11) ట్రంప్ మద్దతుదారులు, అభిమానులు ఆందోళన చేయాలని సిద్ధమయ్యారు. ఈ విషయం ముందే తెలుసుకున్న అక్కడి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలని ట్రంప్ అభిమానులు డిమాండ్‌పై నిరసనకు దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి తక్కువ సంఖ్యలో ట్రంప్ అభిమానులు హాజరయ్యారు. పోలీస్ బందోబస్తు చూసి చాలామంది భయపడి విరమించుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. డొనల్డ్ ట్రంప్ ఖాతాలను ఫేసుబుక్, స్నాప్‌చాట్ కూడా నిషేధించింది. మిగతా సోషల్ మీడియా సంస్థలు ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమెరికా చరిత్రలో అత్యంత పరువు పోగొట్టుకున్న అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారని పలువురు పేర్కొంటున్నారు. -
ఫ్లాప్‌లతో హిట్ షో
జస్పాల్ భట్టీ :80–90ల కాలంలో దూరదర్శన్ చూసేవారికి జస్పాల్ భట్టీ పరిచయమే. అమృతసర్ వాసి అయిన జస్పాల్ ‘కింగ్ ఆఫ్ కామెడీగా, కింగ్ ఆఫ్ సెటైర్’గా పేరొందారు. ‘ఫ్లాప్ షో’ తో పాటు ‘ఉల్టా పల్టా’, ‘ఫుల్ టెన్షన్’ లోనూ జస్పాల్ నటించి మెప్పించారు. వ్యంగ్య, హాస్య నటుడు, రచయిత, దర్శకుడు అయిన జస్పాల్ 2012లో మరణించారు. జస్పాల్ మరణించిన ఏడాదికి పద్మభూషణ్ అవార్డ్, అత్యున్నత పౌరపురస్కారాలతో భారత ప్రభుత్వం జస్పాల్ని గౌరవించింది. ఇవన్నీ చదువుతుంటే ఇప్పటికీ ఇలాంటి ఎన్నో సంఘటనలు మనమధ్యే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇందులో కొన్ని మనం ఫేస్ చేసినవే అయుంటాయి. ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే ఈ స్ట్రాంగ్ కథనాలను 80ల కాలంలోనే దూరదర్శన్ ప్రేక్షకుడి కళ్లకు కట్టింది. ‘ఫ్లాప్ షో’ హిట్ ఫార్ములాగా ప్రజల మనసులను గెలుచుకుంది.– ఎన్.ఆర్ ఓ గవర్నమెంట్ డాక్టర్.. పేషంట్‌కి ఆపరేషన్ చేసి కత్తిని అతని కడుపులోనే మరిచిపోతాడు. ఓ ప్రొఫెసర్..తను చెప్పింది వినకపోతే విద్యార్థిని ఎంతకాలమైనా పాస్ చేయడు. ఓ అధికారి..చేయి తడపకపోతే ఫైల్ పైన సంతకం చేయనే చేయడు..ఇవన్నీ మనదేశంలో ఎప్పుడూ తాజాగా వినిపించే వార్తలు. గవర్నమెంటు ఆఫీసులలో ఉద్యోగులు, కళాశాలలో ప్రొఫెసర్లు, ఆసుపత్రులలో డాక్టర్లు, పెద్ద పెద్ద ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లు.. ఇలా ప్రభుత్వ ఉన్నతఅధికారుల నిర్లక్ష్య ధోరణిని వ్యంగ్యాత్మకంగా ఎండగట్టిన మొట్టమొదటి సీరియల్ ‘ఫ్లాప్ షో.’ ఈ దేశంలో సామాన్యుడు సామాజిక సమస్యలను ఏ విధంగా ఎదుర్కొంటున్నాడో కళ్లకు కట్టిన షో కూడా ఇదే. పదే పది ఎపిసోడ్స్ అయినా పదికాలాల పాటు అందరి మదిలో నిలిచిపోయిన ‘ఫ్లాప్ షో’ని దూరదర్శన్ 1989లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి పెద్ద సాహసమే చేసింది. బుల్లితెర చేసిన ఈ ఆలోచన ప్రేక్షకుడి మదిని తట్టిలేపింది. ‘ఫ్లాప్ షో’ని కాస్తా హిట్ షోగా మార్చింది. ఈ వ్యంగ్య హాస్య సీరియల్‌కి మూలకర్త ఇండియన్ టెలివిజన్ పరిశ్రమలో ప్రముఖుడిగా పేరొందిన జస్పాల్ భట్టి. ప్రభుత్వ యంత్రాంగ తీరుతెన్నులను వ్యంగ్యంగా చూపుతూనే వారు సమయాన్ని, డబ్బును ఎలా దుర్వినియోగం చేస్తుంటారో ఈ సీరియల్ ద్వారా ప్రజలకు తెలిసేలా పూనుకున్నారు జస్పాల్. మొత్తం పది ఎపిసోడ్లు. ప్రతీ ఎపిసోడ్ లో ఓ ప్రభుత్వ అధికారి కుట్రపూరిత చర్యలు, నిర్లక్ష్యంతో కూడిన కథనం ఉంటుంది. ఈ సీరియల్‌కి దర్శకుడు, రచయిత మాత్రమే కాదు ఇందులోని ప్రధాన పాత్రధారి కూడా జస్పాల్ భట్టీయే. జస్పాల్ భార్యా సవితా భట్టి ఈ సీరియల్లో నటించడడమే కాకుండా నిర్మాతగానూ ఉన్నారు. తప్పిపోయిన కుక్క తప్పిపోయిన తన పెంపుడు కుక్కను వెతకడానికి ఓ అధికారి ప్రభుత్వ వనరులను వాడుకున్న విధం, అతని వృధా ఖర్చును ఈ షోలో చూపించడం విశేషం. నకిలీ మెడికల్ బిల్స్‌తో బురిడీ ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ కింద నగదు మొత్తం చెల్లిస్తుంది. దీని కోసం వీరు నకిలీ పత్రాలను సృష్టిస్తారనే వాదనను వ్యంగ్యాత్మకంగా తీసుకున్నారు జస్పాల్ భట్టి. ఇందులో జస్పాల్ గవర్నమెంట్ ఆఫీసర్. జస్పాల్ స్నేహితుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరుతాడు. అతని మెడికల్ బిల్స్‌తో జస్పాల్ రీయింబర్స్మెంట్ కోసం నకిలీ పత్రాలను సృష్టిస్తాడు. అయితే, చికిత్స పొందుతూ జస్పాల్ స్నేహితుడు చనిపోతాడు. దీంతో అంతా జస్పాల్ చనిపోయినట్టు భావిస్తారు. హాస్యంగా భావించినా ఇందులోని వాస్తవాన్ని అంతా గుర్తించారు. కాంట్రాక్టర్ల ఆస్తులు రియల్ ఎస్టేట్ యజమానుల కష్టాలన్నీ డబ్బు చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. రకరకాల వెంచర్ల పేరుతో కొత్త కొత్త స్కీములు సృష్టించడం వాటిలో ప్రజలను ఇరికించడం.. ఏ విధంగా ఉంటాయో వ్యంగ్యాత్మకంగా తీసుకున్నారు ఈ ఎపిసోడ్లో. ఇతరులకు చెందిన ఆస్తులను కబ్జా చేయడం, వారు సృష్టించే కొన్ని వంచక పథకాలను ఈ ఎపిసోడ్ హైలైట్ చేసింది. అంతేకాదు నాణ్యత లేకుండా ప్రభుత్వ భవననిర్మాణాలను చేపట్టే కాంట్రాక్టర్ల పనికిమాలిన చర్యలను ఇందులో చూపించారు. కాంట్రాక్టర్లు నిర్మించిన ఈ నాణ్యతలేని భవనాలను ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడం, ఆ గృహసముదాయాలలో నివాసితులు ఎలాంటి ఇబ్బందుల పాలవుతుంటారో చూపుతుంది ఈ ఎపిసోడ్. బెదిరింపుల పీహెచ్‌డి పోస్టుగ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులు తమ గ్రంథ రచనకు ప్రొఫెసర్ల వద్ద చేరుతుంటారు. ప్రొఫెసర్ల చేతిలో ఆ విద్యార్థులు పడే పాట్లను ‘ప్రొఫెసర్ అండ్ పీహెచ్డీ స్టూడెంట్స్ గైడ్’ ఎపిసోడ్లో చూపింది. ప్రొఫెసర్ తన వద్ద రీసెర్చ్ స్టూడెంట్‌గా చేరిన అతని చేత తన ఇంటిపనులన్నీ చేయించుకుంటుంటాడు. చివరికి తన మరదలిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకునేట్లయితేనే పాస్ చేస్తానని బెదిరిస్తాడు. ఇప్పటికీ ఇలాంటి ప్రొఫెసర్ల గురించి కథనాలు వెలువడుతూనే ఉండటం గమనార్హం. పనికిమాలిన మీటింగ్‌లు.. కొంతమంది ప్రభుత్వ ఉన్నతోద్యోగులు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా అర్థం లేని సమావేశాలను ఏర్పాటుచేసుకొని బాతాఖానీ కొడుతుంటారని ‘మీటింగ్’ అనే ఎపిసోడ్లో చూపుతారు జస్పాల్. పొట్టలో వాచీ ప్రభుత్వ ఆసుపత్రులలో కొంతమంది డాక్టర్లు తమ విధుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ‘డాక్టర్’ ఎపిసోడ్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. జస్పాల్ భట్టి ఇందులో డాక్టర్ పాత్ర పోషించారు. రోగికి ఆపరేషన్ చేసి అతని పొట్టలో తన వాచీని మర్చిపోయిన విధానాన్ని ఈ ఎపిసోడ్లో చూపించారు. ఇలాంటి సంఘటనలను ఇప్పటికీ వార్తల్లో చూస్తుంటాం. ముఖ్య అతిథి ఎప్పుడూ ఆలస్యమే... ప్రజా వేదికలలో పాల్గొనాల్సిన ముఖ్య అతిథి కోసం జనం అంతా గంటలతరబడి ఎదురుచూస్తూ ఉంటారు. అయితే, ఆ వ్యక్తి ఎప్పుడూ ఫంక్షన్ టైమ్‌కి హాల్‌కి చేరుకోడు. ఇది తన ఒక ముఖ్యమైన అర్హతగా భావిస్తుంటాడు. ప్రభుత్వ అధికారులలో ఇప్పటికీ ఇలాంటి వారు ఉండటం గమనార్హం. గజిబిజి కనెక్షన్ల లైన్‌మ్యాన్ ఇండియన్ టెలీఫోన్ డిపార్ట్మెంట్ని, అందులోని అధికారులను ఈ ఎపిసోడ్లో తూర్పారబట్టారు భట్టీ. ఇప్పుడంటే స్మార్ట్ఫోన్ల పరంపర వల్ల టెలీఫోన్ కనెక్షన్లు గురించి దిగుల్లేదు కానీ నాటి రోజుల్లో ఇదో పెద్ద తపస్సు. టెలీఫోన్ కనెక్షన్ కోసం అప్లయ్ చేసుకోవడం, నెలలు గడుస్తున్నా కనెక్షన్ రాకపోవడం, వచ్చినా నాణ్యతలేని టెలిఫోన్ పరికరాలను అమర్చడం.. వంటివెన్నో జరిగేవి. వాటన్నింటినీ ఈ ఎపిసోడ్లో చూపించారు. అర్హతలు లేనివారి చేతిలో సృజన సీరియల్ అన్నదే సృజన ఉన్న కంటెంట్. అయితే, దానిని కొంతమంది టీవీ నిర్మాతలు ఎలా విస్మరిస్తారో ఇందులో చూపించారు. ఎలాంటి అర్హతలు లేని డబ్బున్న వ్యక్తులు టెలివిజన్ కార్యక్రమాలు నిర్మించడం గురించి ఈ ఎపిసోడ్ చూపుతుంది. -
అమిత్ షా పర్యటన ప్లాప్ షో: ఉత్తమ్
హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఒక ఫ్లాప్‌షో అని తెలంగాణ పీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అమిత్ షా గత మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నప్పటికీ సామాన్య ప్రజల నుంచి స్పందన కరువైందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేక పోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఐటీఐఆర్తోపాటు ప్రధాన పథకాల్లో ఏమీ ఆచరణకు నోచుకోలేదని వివరించారు. గత మూడేళ్లలో కనీసం హైకోర్టును కూడా ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. ప్రస్తుతం అమిత్‌షా పర్యటించిన ప్రాంతాల్లో సామాన్యులకు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారని అన్నారు. స్థానిక పార్టీ నాయకులు నిర్ణయించిన ప్రకారం ముందుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకే ఆయన పర్యటన పరిమితమైందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. -
ధోనీసేనకు ఏమైంది?
లండన్: రాజు గుర్రం రాను రాను.. అన్నట్టుగా ఇంగ్లండ్‌లో టీమిండియా పరిస్థితి తయారైంది. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను భారత్ డ్రాగా ముగించింది. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో నెగ్గి ధోనీసేన ప్రశంసలు అందుకుంది. ఈ వేదికపై టీమిండియా సుదీర్ఘ విరామం తర్వాత నెగ్గడం విశేషం. ఇంగ్లండ్‌లో ధోనీసేన సిరీస్ గెలవడం ఖాయమని అభిమానులు, విశ్లేషకులు భావించారు. ఇంగ్లండ్ వాతావరణానికి అలవాటు పడిన ధోనీసేన మూడో టెస్టు నుంచి మరింత జోరు కనబరుస్తుందనిపించింది. అయితే కథ అడ్డం తిరిగింది. మూడు, నాలుగు టెస్టుల్లో మనోళ్లు గల్లీ క్రికెట్‌ను తలపించేలా ఘోరంగా ఆడారు. ఫలితంగా రెండింటిలోనూ చిత్తుచిత్తుగా ఓడారు. సిరీస్‌ను సమం చేయాలంటే గెలిచి తీరాల్సిన చివరి, ఐదో మ్యాచ్‌లోనూ ఇదే వరుస. శుక్రవారం ఆరంభమైన ఐదో టెస్టులో ధోనీసేన దారుణంగా ఆడుతోంది. తొలి సెషన్ కూడా ముగియకముందే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. గంభీర్ డకౌటవగా, ఇతర బ్యాట్స్‌మెన్ అదే బాటపట్టారు. క్రీజులోకి రావడం ఆలస్యమన్నట్టు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. గంభీర్ (0), పుజారా (4), కోహ్లీ (6), రహానె (0).. మన ఘనాపాటి క్రికెటర్లు చేసిన పరుగులివి. మురళీ విజయ్ (18) మాత్రం డబుల్ డిజిట్ స్కోరు చేశాడనిపించుకుని అవుటయ్యాడు. భారత్ 20 ఓవర్లలో 37 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. భారత లైనప్‌లో మిగిలున్న సీనియర్ బ్యాట్స్‌మన్ ధోనీ మాత్రమే. ధోనీతో పాటు బిన్నీ క్రీజులో ఉన్నారు. భారత ప్రదర్శన ఇలాగే కొనసాగితే రెండో సెషన్లోనే చాపచుట్టేయడం ఖాయం! ఈ మ్యాచ్‌లో కూడా ధోనీసేన మూడు రోజుల్లోనే ఓడినా ఆశ్చర్యం లేదు. క్రీడల్లో గెలుపోటములు సహజమే అయినా ప్రపంచ స్థాయి అత్యుత్తమ జట్టు మరీ ఇంత చెత్తప్రదర్శన కనబర్చడం దారుణం. ధోనీసేనకు ఏమైంది? -
చంద్రబాబు సభకు జనం కరువు
-
టాలీవుడ్ 2013 - ఫ్లాప్ షో