breaking news
first singl
-
ఒక్క సాంగ్‌తోనే వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌గా విజయ్...
-
మైండ్ బ్లోయింగ్ ‘బూమ్ బూమ్’ వచ్చేసింది..
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘స్పైడర్’ సినిమాలో తొలి సాంగ్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే బుధవారం సాయంత్రం 6 గంటలకు దీన్ని రిలీజ్ చేశారు.. ‘ బూమ్ బూమ్. భూంకపాల.. ఎస్పీవై వచ్చాడోయ్ ...అంటూ మైండ్ బ్లోయింగ్ గా ఉన్న ఈ పాటకు అభిమానులు ఫుల్ ఫిదా. ఈ పాటకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడంతో అభిమానులను సర్ప్రైజ్ అయితే ఇపుడు పూర్తి పాటతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అటు ఈ పాటపై అప్పుడే ట్విట్టర్ లో సందడి మొదలైంది. హాస్య నటుడు వెన్నెల నటుడు అదిరిందంటూ స్పందించగా, వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్‌వర్మ అభిమానులకు ఇది బూం బూం టైం అంటూ స్పందించడం విశేషం. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ‘స్పైడర్’ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుందని భావిస్తున్నారు. మహేష్ బాబుకు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమాకు హేరిస్ జయరాజ్ సంగీతమందించారు. Can say confidently that #BoomBoom will be the best intro Song of South India's Biggest Star Mahesh, absolute treat for fans. — Ram Gopal Varma (@RGVzoomined) August 2, 2017